HealthDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedప్రతిరోజు ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగడమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో ? లేదో ? కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ ఆరోగ్యానికి హానికరమైన వాటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. అయితే ఖాళీ కడుపున వీటిని అస్సలు తినవద్దని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరి అవేంటో ఒక సారి చూద్దాం. 1). ఖాళీ కడుపున ఫ్రూట్ జ్యూస్ తాగవదSWEETS,DRINKES VIGGITABULES;hushaaru;dry fruits;heart;sugar;chilli;aquaఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు ?ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినకూడదు ?SWEETS,DRINKES VIGGITABULES;hushaaru;dry fruits;heart;sugar;chilli;aquaMon, 24 May 2021 18:00:00 GMT
ప్రతిరోజు ఉదయం పూట తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగడమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. ఈ అల్పాహారం తీసుకునేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏ ఏ ఆహార పదార్థాలను అల్పాహారంలో తీసుకోవచ్చో ? లేదో ? కూడా తెలిసి ఉండాలి. ఒకవేళ ఆరోగ్యానికి హానికరమైన వాటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. అయితే ఖాళీ కడుపున వీటిని అస్సలు తినవద్దని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరి అవేంటో ఒక సారి చూద్దాం.

1). ఖాళీ కడుపున ఫ్రూట్ జ్యూస్ తాగవద్దు:
ఉదయాన్నే చాలామంది ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటారు. ఇలా ఖాళీ కడుపుతో పంచదార వుండే ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవడం వలన గుండె పై ఎక్కువ బరువు పడుతుంది.

2). తీపి పదార్థాలు మానేయాలి:
తీపి పదార్థాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవద్దు. ఉదయాన్నే అల్పాహారం సమయంలో షుగర్ ఉండే వాటిని తీసుకోవడం మంచిది కాదు.

3). స్పైసీ ఫుడ్ తీసుకోరాదు:
ఖాళీ కడుపుతో పచ్చిమిర్చి, స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల ఇరిటేషన్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి.

4). పుల్లటి పండ్లు తినవద్దు:
ఉదయాన్నే ఖాళీ కడుపున పుల్లని పండ్లు తీసుకోవడం మంచిది కాదు. అలా తీసుకోవడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.

5). సలాడ్స్:
ఉదయాన్నే సలాడ్స్ కూడా తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కూరగాయలతో చేసిన సలాడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే  ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఉదయాన్నే పౌష్టికాహారం కలిగిన మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్, పాలు, కోడిగుడ్లు వంటి వాటిని తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాకిస్తాన్ కుక్క బుద్ధి... మరీ ఇలానా...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>