PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine233a7351-688c-4f41-85d8-56cdeb7a1fbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine233a7351-688c-4f41-85d8-56cdeb7a1fbc-415x250-IndiaHerald.jpgనెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్య మీడియా ముందుకొచ్చారు. తనను అరెస్టు చేశారని, నాటు మందు పంపిణీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంపై నోరు విప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆదివారం ఆనందయ్య మీడియాతో మాట్లాడారు. కరోనాకు మందు పంపిణీ చేసేందుకు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు. వాళ్లందరికీ ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ముఖcarona vaccine;poorna;jagan;mandula;congress;district;media;chief minister;mla;ayurveda;reddy;krishnapatnam port;partyనాటు మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీనాటు మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీcarona vaccine;poorna;jagan;mandula;congress;district;media;chief minister;mla;ayurveda;reddy;krishnapatnam port;partyMon, 24 May 2021 17:08:48 GMTనెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొడిగ ఆనందయ్య మీడియా ముందుకొచ్చారు. తనను అరెస్టు చేశారని, నాటు మందు పంపిణీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంపై నోరు విప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆదివారం ఆనందయ్య మీడియాతో మాట్లాడారు. కరోనాకు మందు పంపిణీ చేసేందుకు ప్రజలు పూర్తిగా సహకరిస్తున్నారని, ప్రభుత్వం సంపూర్ణంగా సపోర్ట్ చేస్తోందని వెల్లడించారు. వాళ్లందరికీ ఆనందయ్య ధన్యవాదాలు తెలిపారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మందుపై ప్రత్యేకంగా చొరవ తీసుకుని, వెంటనే స్పందించి ఐసీఎంఆర్‌కు పంపారని గుర్తు చేశారు. సీఎం జగన్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారని చెప్పారు. తనకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చి మందు పంపిణీ చేసేందుకు పూర్తి భరోసా ఇస్తున్నారని తెలిపారు. కానీ, వనమూలికలు సమకూర్చుకునేందుకు బయటకు వెళ్తే ప్రజల తాకిడితో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని.. కాబట్టి, కొంచెం ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు.

తనకు ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని నమ్మకం ఉందని ఆనందయ్య అన్నారు. ఐసీఎంఆర్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ప్రభుత్వం ఇచ్చే సహాయంతో ఈ మందుకు కావాల్సిన ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటామని వెల్లడించారు. అతి త్వరలోనే ప్రజలందరికీ మందులు అందిస్తానని ఆనందయ్య ప్రకటించారు. ప్రభుత్వ అనుమతి వచ్చాకే ఆయుర్వేద మందు పంపిణీ చేస్తామని.. లేనిపోని ఆరోపణలు చేసి, అనుమానాలు రేపొద్దని సర్వేపల్లి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆనందయ్య మందుపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారన్నారు. ఆర్‌సీఎంఆర్ త్వరలోనే నివేదిక ఇస్తుందని, అనుమానాలు నివృత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు రాద్దాంతం చేయొద్దని ఆయన తెలిపారు. ఆనందయ్య మాటతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీలైనంత త్వరగా తమకు ఆనందయ్య మందు అందుబాటులోకి రావాలని వేడుకుంటున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట్ లెజెండ్ బ‌యోపిక్ అప్పుడే..!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>