MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combination673ebf2e-f79c-4426-a9c5-9649930dcefd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combination673ebf2e-f79c-4426-a9c5-9649930dcefd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో గోపీచంద్ మలినేని పేరు కూడా ఉంటుంది. గోపీచంద్ తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి హిట్‌లతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. గోపీచంద్ మలినేని ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్‌‌ను బద్దలు కొట్టాడు. ఈ సినిమాలో మాస్ మహరాజ రవితేజ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ‘క్రాక్’ వీరి కాంబోలో వచ్చిన..directors-heroes-combination;ravi;raja;ravi teja;cinema;director;wanted;mass;bodyguard;krack;gopichandటాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేనిటాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేనిdirectors-heroes-combination;ravi;raja;ravi teja;cinema;director;wanted;mass;bodyguard;krack;gopichandMon, 24 May 2021 12:10:00 GMTప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో గోపీచంద్ మలినేని పేరు కూడా ఉంటుంది. గోపీచంద్ తన కెరీర్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి హిట్‌లతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. గోపీచంద్ మలినేని ఈ ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్‌‌ను బద్దలు కొట్టాడు. ఈ సినిమాలో మాస్ మహరాజ రవితేజ హీరోగా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ‘క్రాక్’ వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా. ఇంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు కూడా భారీ హిట్ అందుకున్నాయి. ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఈ కాంబో హ్యాట్రిక్ అందుకుంది.
వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ‘డాన్ శ్రీను’. 2010లో వచ్చిన ఈ సినిమాతోనే గోపీచంద్ దర్శకునిగా పరిచయం అయ్యాడు. తన తొలి సినిమాతో భారీ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తరువాత 2012లో ‘బాడీగార్డ్‘ సినిమా చేశాడు. అయితే 2013లో మళ్లీ రవితేజతో జతకట్టిన గోపీచంద్ ‘బలుపు’ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది. దాంతో వీరి కాంబో హిట్ కాంబినేషన్ అనిపించుకుంది. వీరిద్దరు మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఆ తరువాత రవితేజ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. కానీ వాటిలో చాలా సినిమాలు ఆశించిన స్థాయి ఫలితం ఇవ్వలేదు.  వాటిలో వచ్చిన రాజా దిగ్రేట్ తరువాత రవితేజకు మళ్లీ హిట్ రాలేదు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు క్రాక్ అవకాశం వచ్చింది.
అప్పటికే రెండు హిట్‌లు ఇచ్చిన డైరెక్టర్ కావడంతో గోపీచంద్‌కు రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు వీరి కాంబోలో సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకుల కోరిక నెరవేరింది. ఈ సినిమా అభిమానుల ఊహలను మించి అలరించింది. ఈ సినిమా హిట్‌తో ఈ హిట్ కాంబో హ్యాట్రిక్ అందుకుంది. మరి మునుముందు ఈ కాంబోలో మరెన్ని సినిమాలు వస్తాయో వేచి చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ పది మంది ఎమ్మెల్యేలే జగన్ కు చిరాకు...?

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>