MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/salaar53e5dc4c-4eaf-4061-8d66-74f31990df31-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/salaar53e5dc4c-4eaf-4061-8d66-74f31990df31-415x250-IndiaHerald.jpgఇటీవల సాహో సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. కాగా ఆ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే సింగర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆల్మోస్ట్ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసుకున్న salaar;prabhas;pooja hegde;shruti;shruti haasan;ali reza;gopika;kriti sanon;prasanth;prashanth neel;ramu;seetha;sruthi;vikramaditya;india;bollywood;tollywood;cinema;telugu;saaho;jaan;kannada;audience;heroine;prasanth neel;lie;v creations;john;vemuri radhakrishna;uv creations;v;prashant kishor;gopikrishna moviesసలార్ తో సై అనేది అతడు కాదట ... మరి ఎవరంటే ... ??సలార్ తో సై అనేది అతడు కాదట ... మరి ఎవరంటే ... ??salaar;prabhas;pooja hegde;shruti;shruti haasan;ali reza;gopika;kriti sanon;prasanth;prashanth neel;ramu;seetha;sruthi;vikramaditya;india;bollywood;tollywood;cinema;telugu;saaho;jaan;kannada;audience;heroine;prasanth neel;lie;v creations;john;vemuri radhakrishna;uv creations;v;prashant kishor;gopikrishna moviesMon, 24 May 2021 23:41:00 GMTఇటీవల సాహో సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి యావరేజ్ విజయాన్ని అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. కాగా ఆ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య అనే సింగర్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఆల్మోస్ట్ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జులై 30న విడుదల కానుంది.

దీనితో పాటు మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ లో రాముడిగా నటిస్తున్నారు ప్రభాస్. ఓం రౌత్ తీస్తున్న ఈ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తుండగా కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ ప్రాజక్ట్ సలార్ లో కూడా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు. అండర్ వరల్డ్ మాఫియా నేపధ్యములో మంచి యాక్షన్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమా ఇప్పటికే ముప్పై శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ పలు టాలీవుడ్ వర్గాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటిస్తున్నారని, ఇప్పటికే టీమ్ ఆయనని సంప్రదించగా ఆయన కొంత సమయం అడిగినట్లు చెప్తున్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ యాక్టర్ మధు గురుస్వామి యాక్ట్ చేస్తున్నారని, అలానే మరికొన్ని నెగటివ్ పాత్రల్లో పలువురు కన్నడ, తెలుగు నటులు యాక్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కన్నడతో పాటు తెలుగులో సాక్ష్యం మూవీలో ఒక విలన్ గా మధు గురుస్వామి నటించారు. ఇక జాన్ అబ్రహం ఈ మూవీలో యాక్ట్ చేయనున్నారు అనేది ఫేక్ న్యూస్ అని అంటున్నారు. అయితే వీటిలో అసలు ఏది వాస్తవమో తెలియాలి అంటే స్వయంగా సలార్ యూనిట్ డైరెక్ట్ గా స్పందించాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమిళ్ తలపతి తెలుగు ఎంట్రీ పక్కా.. భారీ స్కెచ్ లో బడా ప్రొడ్యూసర్ ?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>