MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/directors-heroes-combination6ae4577f-8547-4bcc-b8a2-dc2ffee8fc98-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/directors-heroes-combination6ae4577f-8547-4bcc-b8a2-dc2ffee8fc98-415x250-IndiaHerald.jpgహీరోకు మాస్ లో అదిరిపోయే ఫాలోయింగ్. ఓ డైరెక్టర్ మాస్ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆ హీరో, డైరెక్టర్ మరెవరో కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు వి వి వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి తెరకెక్కిన చిత్రం సాంబ. ఈ సినిమా 2004లో విడుదల అయింది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వివి వినాయక్ చాలా అగ్రెసివ్ రోల్ లో చూపించారు. directors-heroes-combination;ntr;v v vinayak;cinema;director;comedy;hero;nandamuri taraka rama rao;kathanam;v;mass;adhursయంగ్ టైగర్ ను కామెడీగా ప్రజెంట్ చేసిన ఈ కాంబో "అదుర్స్ "..!యంగ్ టైగర్ ను కామెడీగా ప్రజెంట్ చేసిన ఈ కాంబో "అదుర్స్ "..!directors-heroes-combination;ntr;v v vinayak;cinema;director;comedy;hero;nandamuri taraka rama rao;kathanam;v;mass;adhursMon, 24 May 2021 18:00:00 GMTఓ హీరోకు మాస్ లో అదిరిపోయే ఫాలోయింగ్. ఓ డైరెక్టర్ మాస్ సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఆ హీరో, డైరెక్టర్ మరెవరో కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు వి వి వినాయక్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ప్రత్యేక క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి తెరకెక్కిన చిత్రం సాంబ. ఈ సినిమా 2004లో విడుదల అయింది. ఈ మూవీలో  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వివి వినాయక్ చాలా అగ్రెసివ్ రోల్ లో చూపించారు. సినిమాలో చక్కటి మెసేజ్ తో పాటు మాస్ కంటెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ కథనంలో లోపాలు ఉండడంతో సాంబ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గా నిలిచింది. 


అయినప్పటికీ వినాయక్-ఎన్టీఆర్ కాంబినేషన్ పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ 2010లో వచ్చిన అదుర్స్ సినిమాతో మరొకసారి రిపీట్ అయింది. ఈ సినిమాతో వీరి కాంబో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ ను వరుస ప్లాపులు వెంటాడుతున్న ఆ సమయంలో అదుర్స్ మూవీ బిగ్ హిట్ నిలవడమే ఎన్టీఆర్ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ముఖ్యంగా అదుర్స్ మూవీలో చారిగా ఎన్టీఆర్ పంచిన కామెడీ ఏ స్థాయిలో ప్రేక్షకులను నవ్వించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ మంచి వసూళ్లనే రాబట్టింది. 


అదుర్స్ మూవీ తరువాత ఎన్టీఆర్ వివి వినాయక్ కాంబినేషన్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే అదుర్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఎలాంటి మూవీ రాలేదు. గతంలో వీరిద్దరి ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో వివి వినాయక్  శైలి చాలా ప్రత్యేకమైనది. దాంతో వీరిద్దరి క్రేజీ కాంబో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రేయ్ గోగినేని అక్క‌డ వాత‌లు పెడ‌తా...మాధ‌వీ ల‌త సంచ‌ల‌నం.. !

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>