MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/directors-heroes-combination81cb6572-c7a7-4f51-a5fb-a6bd2502551e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/directors-heroes-combination81cb6572-c7a7-4f51-a5fb-a6bd2502551e-415x250-IndiaHerald.jpgఒక సినిమా హిట్ అనేది ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల కృషి మరియు కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు తెరపై నటించే హీరో కాగా, ఇంకొకరు తెరవెనుక ఉండి హీరోలా సినిమాను ముందుకు నడిపించే డైరెక్టర్. అయితే సినిమా చరిత్రలో ఎంతోమంది హీరోలు మరియు డైరెక్టర్ లు వచ్చి తమ సత్తా చాటుకున్నారు. DIRECTORS-HEROES-COMBINATION;ram charan teja;geetha;ram pothineni;robo shankar;shankar;vikram;india;cinema;sangeetha;telugu;tamil;interview;blockbuster hit;director;hero;aparichithudu"రోబో శంకర్ - చియాన్ విక్రమ్" కాంబినేషన్ ఓ సంచలనం ?"రోబో శంకర్ - చియాన్ విక్రమ్" కాంబినేషన్ ఓ సంచలనం ?DIRECTORS-HEROES-COMBINATION;ram charan teja;geetha;ram pothineni;robo shankar;shankar;vikram;india;cinema;sangeetha;telugu;tamil;interview;blockbuster hit;director;hero;aparichithuduMon, 24 May 2021 12:00:00 GMTఒక సినిమా హిట్ అనేది ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల కృషి మరియు కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకరు తెరపై నటించే హీరో కాగా, ఇంకొకరు తెరవెనుక ఉండి హీరోలా సినిమాను ముందుకు నడిపించే డైరెక్టర్. అయితే సినిమా చరిత్రలో ఎంతోమంది హీరోలు మరియు డైరెక్టర్ లు వచ్చి తమ సత్తా చాటుకున్నారు. కానీ కొంతమంది హీరోలు మరియు డైరెక్టర్ లు పదే పదే కలిసి పనిచేస్తుంటారు. ఈ విధంగా ఒక డైరెక్టర్ మరియు హీరోల కాంబినేషన్ లు చాలానే ఉన్నాయి. అందులో ఒక కాంబినేషన్ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఆ కాంబినేషన్ తమిళ హీరో చియాన్ విక్రమ్ మరియు ప్రముఖ డైరెక్టర్ శంకర్ లది. శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలు ఒక స్థాయిలో ఉంటాయి. సమాజంలో ఉన్న ఒక సమస్యను తీసుకుని దాని చుట్టూ ఒక మంచి కథను అల్లి సినిమా రూపంలో తీసుకురావడంలో సిద్ధహస్తుడు. ఇక విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 తన నటనతో ఇండియా అంతా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇతను తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. ఈయన తమిళ్ లో నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో అపరిచితుడు మరియు మనోహరుడు సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాలలో అపరిచితుడు బ్లాక్ బస్టర్ హిట్ కాగా, మనోహరుడు మాత్రం యావరేజ్ మూవీ గా నిలిచింది. కానీ అపరిచితుడులో విక్రమ్ నటనను ఇప్పుడు తలుచుకున్నా గూస్ బంప్స్ వస్తాయి. మూడు పాత్రలలో తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ శంకర్ పాత్రలను మలిచిన తీరు కూడా అద్భుతం. ఈ సినిమాకు హరీష్ జయరాజ్ అందించిన సంగీతం చాలా ప్లస్ అయింది. ఇది విక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా డైరెక్టర్ శంకర్ కు భారతీయ సినిమా పరిశ్రమలో మంచిపేరును తీసుకువచ్చింది.


 ఇలా విక్రమ్ మరియు శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమాలు వచ్చాయి. మనోహరుడు సినిమా కథ పరంగా బాగున్నా కానీ ప్రేక్షకులకు ఎందుకో కనెక్ట్ కాలేకపోయింది. డైరెక్టర్ శంకర్ సినిమా అంటే ఒక రేంజ్ లో ఊహించుకునే ప్రేక్షకులు , ఈ సినిమా పట్ల నిరుత్సహపడ్డారు. కానీ ఇందులో కూడా విక్రమ నటన మాములుగా లేదు. ఈ సినిమాలో గూని వ్యక్తిగా కనిపించడానికి ఎంత కష్టపడ్డాడో విక్రమ్ స్వయంగా అప్పుడు ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఈ రెండు సినిమాల తరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. విక్రమ్ కొన్ని సినిమాలతో బిజీ గా ఉన్నాడు.

 





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>