PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ex-tdp-mla-arrest5b6cca4e-56ab-4f9b-b35d-e62100fc4a1a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ex-tdp-mla-arrest5b6cca4e-56ab-4f9b-b35d-e62100fc4a1a-415x250-IndiaHerald.jpgగత కొంతకాలముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన అధ్యక్షుడు మరియు ఇతర నాయకులంతా రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ అరెస్టులను చేస్తోందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. EX TDP MLA ARREST;andhra pradesh;backward classes;bc janardhan reddy;mla;arrest;tdp;ycp;lokesh kanagaraj;reddy;partyమాజీ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ సబబేనా ?మాజీ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ సబబేనా ?EX TDP MLA ARREST;andhra pradesh;backward classes;bc janardhan reddy;mla;arrest;tdp;ycp;lokesh kanagaraj;reddy;partyMon, 24 May 2021 21:00:25 GMTగత కొంతకాలముగా ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన అధ్యక్షుడు మరియు ఇతర నాయకులంతా రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ నేతల అరెస్టులపై, వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఈ అరెస్టులను చేస్తోందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దీనిపై వైసీపీ నాయకులు కూడా వారికి తగిన సమాధానాలను ఇస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిన్న జరిగిన అరెస్ట్ సంచలనంగా మారింది. వివరాల్లోకి  వెళితే నిన్న రాత్రి బనగానిపల్లె మాజీ టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందు జరిగిన అరెస్టులన్నీ కూడా పాత అవినీతి కథలో  లేదా మరొక కారణమో ఉండేది.

కానీ ఇప్పుడు జరిగిన అరెస్ట్ ను చూస్తే నిన్న సాయంత్రం దాడికి పాల్పడిన కారణంగా ఈ అరెస్ట్ జరిగిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నటు తెలుస్తోంది. ఇప్పటి వరకు కక్ష గట్టి అరెస్టు చేస్తున్నారు అనే ఆరోపణలమీద టీడీపీ ఏమి చెబుతుందో తెలియాల్సి ఉంది.  వైసీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్, ఈయన కాటసాని అనుచరుడు. ఈయనపై తీవ్రస్థాయిలో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డుమీద పడేసి కొట్టడం జరిగిందని తెలుస్తోంది. దీని కారణంగానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అది పనిగా ప్లాన్ చేసి మరీ రాడ్ లతో దాడి చేశారనే విషయం క్లియర్ గా తెలుస్తూ ఉంది.

సదరు వ్యక్తి వారి నుండి తప్పించుకుని వెళుతున్నా కూడా వదలకుండా వెంటపడి కొట్టడం జరిగింది.  ఇప్పటికే ఈ వీడియో టీడీపీ నాయకుల వరకు చేరి ఉంటుంది. ఇంత దారుణంగా కొట్టిన తరువాత కూడా దాడికి కారణమయిన వారిని అరెస్ట్ చేయక ? నిలబెట్టి పాలాభిషేకం చేయాలా ? అంటూ నెటిజన్లు మరియు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?

బాలీవుడ్ బడా డైరెక్టర్ తో విభేదాల్లో ఉన్న హీరో హీరోయిన్లు వీరే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>