PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp77ab8d16-c9cf-4f5b-9a96-9da8b4b00f8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp77ab8d16-c9cf-4f5b-9a96-9da8b4b00f8b-415x250-IndiaHerald.jpgవైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చేశాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే జిల్లాలో పరిస్తితులు వైసీపీ అనుకూలంగా మారిపోయాయి. 2019 ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. జిల్లాలో 17 అసెంబ్లీ సీట్లలో 15 వైసీపీ గెలిచింది. అలాగే 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అటు టీడీపీ 2 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీటుని గెలుచుకుంది.ysrcp;amaravati;2019;mp;district;mirchi;capital;parliment;assembly;mla;tdp;local language;ycp;chandragiri;repalleమారిన గుంటూరు రాజకీయాలు...ఆ ఎమ్మెల్యే పరిస్తితి ఏంటి?మారిన గుంటూరు రాజకీయాలు...ఆ ఎమ్మెల్యే పరిస్తితి ఏంటి?ysrcp;amaravati;2019;mp;district;mirchi;capital;parliment;assembly;mla;tdp;local language;ycp;chandragiri;repalleMon, 24 May 2021 14:00:00 GMTవైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చేశాయి. టీడీపీకి అనుకూలంగా ఉండే జిల్లాలో పరిస్తితులు వైసీపీ అనుకూలంగా మారిపోయాయి. 2019 ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. జిల్లాలో 17 అసెంబ్లీ సీట్లలో 15 వైసీపీ గెలిచింది. అలాగే 2 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అటు టీడీపీ 2 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సీటుని గెలుచుకుంది.


ఇక ఎన్నికల అయిన దగ్గర నుంచి జిల్లాలో మరింతగా వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయి. రాజధాని అమరావతి అంశం కూడా వైసీపీని ఇబ్బంది పెట్టలేదు. ఊహించని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. అలాగే గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ జెండా ఎగిరింది. ఈ విధంగా జిల్లాపై వైసీపీకి పూర్తి పట్టు వచ్చింది.


ఆఖరికి టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో సైతం వైసీపీ పట్టు సాధించింది. టీడీపీ గెలిచిన రేపల్లె, గుంటూరు వెస్ట్‌ల్లో వైసీపీ హవా నడిచింది. ఇప్పటికే వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. అనధికారికంగా గిరి వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వెస్ట్ వైసీపీ సీటు గిరికే దక్కుతుందా? అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నం వెస్ట్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయనకు గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ పదవి దక్కినా సరే వెస్ట్‌ని వదల్లేదు.   


మద్దాలి వైసీపీ వైపుకు రావడంతో యేసురత్నంకు కీలక పదవి ఇచ్చారు. అయితే పదవి ఉన్నా సరే, నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వెస్ట్‌లో పోటీ చేయాలని యేసురత్నం చూస్తున్నారు. ఇటు ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరి సైతం తనకే టిక్కెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో వీరిలో వెస్ట్ వైసీపీ సీటు ఎవరికి దక్కుతుందా అనేది చూడాలి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూట్యూబ్ ఇంటర్వూస్ కోసం ఒక్కో సెలబ్రిటీ ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా.. ?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>