PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prime-minister-narendra-modi73eb6d70-8d9d-45e8-8322-3f613cd4f420-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prime-minister-narendra-modi73eb6d70-8d9d-45e8-8322-3f613cd4f420-415x250-IndiaHerald.jpgప‌ప్పు, నూనెల ధ‌ర‌లుసైతం అమాంతం పెరిగిపోతున్నాయి. గ‌తంలో ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉన్న స‌మ‌యంలో ఇదంతా మోదీ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌న్న బీజేపీ నేత‌లు ఇప్పుడు అమాంతం ధ‌ర‌లు పెరుగిపోతుంటే మాత్రం ఏమీ మాట్లాడ‌క పోవ‌టం గ‌మ‌నార్హం. కొవిడ్ కార‌ణంగా విదేశాల నుంచి స‌రుకు ర‌వాణా నిలిచిపోయింద‌ని అనుకోవ‌టానికి లేదు. ఎందుకంటే కేవ‌లం విదేశాల‌కు ఫ్యాసింజ‌ర్ విమానాలు మాత్ర‌మే నిలిచిపోయాయి. వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో విమానాలు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నాయి. prime minister narendra modi;bharatiya janata party;narendra modi;petrol;diesel;central governmentమోదీ ఏంద‌య్యా ఇది?మోదీ ఏంద‌య్యా ఇది?prime minister narendra modi;bharatiya janata party;narendra modi;petrol;diesel;central governmentMon, 24 May 2021 16:10:00 GMTదేశ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌జ‌లు ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు రావాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ప‌లు రాష్ట్రాలు కొవిడ్ నియంత్ర‌ణ‌కు లాక్‌డౌన్‌ను విధించాయి. ఒక‌వైపు క‌రోనాతో ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. వ్యాపార సంస్థ‌లు మూత‌ప‌డ‌టంతో ఉద్యోగాలు, ఉపాధి పోయి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డుతున్నారు. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డ్డ చందంగా కొవిడ్ స‌మ‌యంలో ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌తో పాటు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు సామాన్య ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తున్నాయి.

క‌రోనా స‌మ‌యంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల పెరుగుద‌ల సామాన్య ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. ఇప్ప‌టికే  పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అమాంతం పెరిగిపోతున్నాయి. మే నెల‌లో ప‌దిసార్లు పెట్రోల్ ధ‌ర‌లు పెరిగాయి. ఫ‌లితంగా పెట్రోల్ లీట‌ర్ రూ. 95కి చేరింది. అయితే ఈ ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో మోదీ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తుంది. ప్ర‌తిప‌క్షాలు ఇదే వాద‌న‌ను లేవ‌నెత్తుతున్నాయి. క‌రోనా మొద‌టి వేవ్‌లో మోదీ విజ‌య‌వంతంగా కొవిడ్‌ను ఎదుర్కోవ‌టంలో స‌ఫ‌లీకృత‌ల‌య్యారు. సెకండ్‌వేవ్‌లో కేంద్రానికి ఏమీ సంబంధం లేద‌న్న‌ట్లుగా రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుండ‌టం ప్ర‌తీఒక్క‌రికి అర్థంకాని ప్ర‌శ్న‌గా మారింది.

ప‌ప్పు, నూనెల ధ‌ర‌లుసైతం అమాంతం పెరిగిపోతున్నాయి. గ‌తంలో ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉన్న స‌మ‌యంలో ఇదంతా మోదీ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌న్న బీజేపీ నేత‌లు ఇప్పుడు అమాంతం ధ‌ర‌లు పెరుగిపోతుంటే మాత్రం ఏమీ మాట్లాడ‌క పోవ‌టం గ‌మ‌నార్హం. కొవిడ్ కార‌ణంగా విదేశాల నుంచి స‌రుకు ర‌వాణా నిలిచిపోయింద‌ని అనుకోవ‌టానికి లేదు. ఎందుకంటే కేవ‌లం విదేశాల‌కు ఫ్యాసింజ‌ర్ విమానాలు మాత్ర‌మే నిలిచిపోయాయి. వ‌స్తువుల‌ను ర‌వాణా చేసే కార్గో విమానాలు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో దేశంలో కొర‌త ఉన్న వ‌స్తువుల‌ను ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకొని దేశంలో ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా చూడ‌వ‌చ్చు. కానీ కేంద్రం ఆ ప్ర‌య‌త్న‌మే చేయ‌డం లేదు. దీంతో న‌రేంద్ర మోదీపై ప్ర‌తిప‌క్షాల నుంచే కాకుండా సామాన్య ప్ర‌జ‌ల నుండి ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దుర్భ‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటున్న స‌మ‌యంలో క‌నీసం నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌ను నియంత్రించే ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రికెట్ లెజెండ్ బ‌యోపిక్ అప్పుడే..!

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>