MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/republic7368838d-e72f-4ffc-804a-e9e4f2337554-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/republic7368838d-e72f-4ffc-804a-e9e4f2337554-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తనదైన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎప్పటిప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు తన సినిమాల్లో కొత్త దనాన్ని పరిచయం..republic;jeevitha rajaseskhar;krishna;ramya;ramya krishnan;tollywood;cinema;hero;subrahmanyam for sale;solo bathuke so better;massసరికొత్తగా సాయితేజ్.. ఆ సినిమా కోసమే..?సరికొత్తగా సాయితేజ్.. ఆ సినిమా కోసమే..?republic;jeevitha rajaseskhar;krishna;ramya;ramya krishnan;tollywood;cinema;hero;subrahmanyam for sale;solo bathuke so better;massMon, 24 May 2021 17:29:27 GMTటాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఒకడు. పేరుకి మెగా బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా తనదైన టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. తనదైన నటన, డాన్స్, డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎప్పటిప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు తన సినిమాల్లో కొత్త దనాన్ని పరిచయం చేశాడు. దాంతో సాయి తేజ్ సినిమా అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి కథలనే ఒప్పుకుంటూ ప్రస్తుతం సాయి తేజ్ దూసుకుపోతున్నాడు. ఇటీవల కరోనా సమయంలోనూ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతొ హిట్ టాక్ అందుకున్న మొదటి హీరో సాయి తేజ్.


అయితే 2014లో ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సాయి తేజ్ తన తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,  సుప్రీం సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. అయితే తాజాగా సాయి తేజ్ నటిస్తున్న సినిమా రిపబ్లిక్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్యర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాకుండా జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను గతేడాది ప్రారంభించినా కరోనా కారణంగా ఇంకా పూర్తి కాలేదు.



 అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరికొత్తగా కనిపించనున్నాడట. అందుకోసం సాయి తేజ్ చాలా కష్టపడుతున్నాడని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో మాస్ లుక్స్‌తో సాయితేజ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా సమాజానికి ఓ మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నారని సమాచారం. ఈ సినిమాను కుదిరితే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని సమాచారం. మరి ఈ సినిమాతో సాయి తేజ్ అభిమానుల అంచనాలను అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఒక్క మేకప్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేసిన సినిమా

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>