MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/rajamouli-rrr4e15203a-e026-4240-be85-32ba3a32d894-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/rajamouli-rrr4e15203a-e026-4240-be85-32ba3a32d894-415x250-IndiaHerald.jpgఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. అసలు అపజయమే ఎరుగని రాజమౌళికి ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఎక్కువ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల విషయానికి వస్తే ముందుగా స్టూడెంట్ నెం 1 తెరకెక్కింది. ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ పై కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. “స్టూడెంట్ నెం 1” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీతో రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాజమౌళి యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. సూపdirectors-heroes-combination;ntr;maruti;rajamouli;tollywood;rrr movie;cinema;blockbuster hit;hero;nandamuri taraka rama rao;student no 1;simhadri;graphicsఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!directors-heroes-combination;ntr;maruti;rajamouli;tollywood;rrr movie;cinema;blockbuster hit;hero;nandamuri taraka rama rao;student no 1;simhadri;graphicsMon, 24 May 2021 11:14:05 GMTఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ అంటే చెప్పాల్సిన పని లేదు. అసలు అపజయమే ఎరుగని రాజమౌళికి ఎన్టీఆర్ తో సాన్నిహిత్యం ఎక్కువ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల విషయానికి వస్తే ముందుగా స్టూడెంట్ నెం 1 తెరకెక్కింది. ఈ సినిమాని స్వప్న సినిమా బ్యానర్ పై కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. “స్టూడెంట్ నెం 1” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీతో రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాజమౌళి యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. 


సూపర్ హిట్ గా నిలిచిన “స్టూడెంట్ నెం 1” మూవీ 42 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక వీరి కంబోలో వచ్చిన రెండో సినిమా సింహాద్రి. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “సింహాద్రి “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సింహాద్రి 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. 



ఇక వీరి కాంబోలో వచ్చిన మూడో సినిమా యమదొంగ. విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు రాజమౌళి , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన సోషియో ఫాంటసీ “యమదొంగ ” మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ ద్వారా కనిపించడం, హీరో ఎన్టీఆర్ ఒక సాంగ్ కు గళాన్ని అందించడం విశేషం. “యమదొంగ ” మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక వీరి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. చూడాలి మరి ఏమేరకు రికార్డులు బద్దలు కొడుతుందో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ల న‌రేంద్ర‌కు బెయిల్ మంజూరు

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

కోడి రామకృష్ణ, రాజశేఖర్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలివే..!!

మహిళలకు మోడీ శుభవార్త

రాజమౌళి ఆ హీరోతో మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తాడా?

అల్లు అర్జున్,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అదుర్స్‌

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>