TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/raily-symbeles-x-and-lved026318-f04e-4c11-93a0-d43a420b09e0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/raily-symbeles-x-and-lved026318-f04e-4c11-93a0-d43a420b09e0-415x250-IndiaHerald.jpgనాటి నుంచీ నేటి వరకూ భారతదేశంలోనే ఎక్కువమంది ప్రజలు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సురక్షితమైన ప్రయాణం కాబట్టి. పైగా ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. నిర్ణీత సమయంలో నిర్దిష్ట ప్రదేశానికి చేరవేయగలవు. పైగా రైలు ప్రయాణం వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక అందుకే చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మన భారతదేశంలో రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణం చేయని వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.. అయితే అలా ప్రయాణించేటప్పుడు భారతీయ రైల్వే భద్రతకు సంబంధించి ప్రత్యేRAILY SYMBELES X AND LV;indiaబుల్లి పిట్ట: రైలు చివరను X అలాగే LV సింబల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా ?బుల్లి పిట్ట: రైలు చివరను X అలాగే LV సింబల్స్ ఎందుకు ఉంటాయో తెలుసా ?RAILY SYMBELES X AND LV;indiaMon, 24 May 2021 13:00:00 GMT
నాటి నుంచీ నేటి వరకూ భారతదేశంలోనే ఎక్కువమంది ప్రజలు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో, సురక్షితమైన ప్రయాణం కాబట్టి. పైగా ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. నిర్ణీత  సమయంలో నిర్దిష్ట ప్రదేశానికి చేరవేయగలవు. పైగా రైలు ప్రయాణం వల్ల ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక అందుకే చాలా మంది ప్రజలు, ముఖ్యంగా  మన భారతదేశంలో రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా రైలు ప్రయాణం చేయని వారు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు..


అయితే అలా ప్రయాణించేటప్పుడు భారతీయ రైల్వే భద్రతకు సంబంధించి ప్రత్యేక సంకేతాలను గమనించే ఉంటారు. ముఖ్యంగా  ప్యాసింజర్ రైళ్లలో అనేక రకాల సంకేతాలు ఉంటాయి. వీటికి ప్రత్యేక అర్థం ఉంటుంది. రైళ్లలో సంకేతాలు సృష్టించకపోతే భారత రైల్వేల పనితీరు దాదాపు అసాధ్యం. సాధారణంగా వీటిని ప్రతి ఒక్కరు గమనించి ఉంటారు కాబట్టి  వీటి వెనుక ఉన్న అర్థం ఏమిటో మాత్రం చాలామందికి తెలియదు. అయితే ఆ సంకేతాల అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఒకవేళ రైలు వెనుక X అని ఉంటే దాని అర్థం  అది ఆ రైలు యొక్క చివరి పెట్టె అని అర్థం. ప్యాసింజర్ రైలు చివరి పెట్టెలో ఎక్స్ తో పాటు, LV అనే అక్షరాలు కూడా కనిపిస్తాయి. ఈ LV అంటే లాస్ట్ వెహికల్ అని అర్థం. ఈ రెండు సంకేతాలు ప్రధానంగా రైల్వే అధికారులు, ఉద్యోగులకు సంబంధించినవి.

ఈ సంకేతాలకు, సామాన్యులకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా రైల్వే అధికారి లేదా ఉద్యోగి రైలు చివరి పెట్టెలో వ్రాసిన X లేదా LV ని  చూడకపోతే, అతను వెంటనే సమీప కంట్రోల్ రూమ్‌కు తెలియజేస్తాడు. ఈ రెండు సంకేతాలు రైలు చివరి కంపార్ట్మెంట్లో కనిపించకపోతే రైలు చివరి కంపార్ట్మెంట్ లేదా వెనుక భాగంలో కొంత భాగం రైలు నుండి వేరు చేయబడిందని అర్థం. అందుకే ఈ రెండు గుర్తులకు అంత ప్రాధాన్యత ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరిత్ర సృష్టించిన బన్నీ సినిమా..?

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..

కేసీఆర్‌ను క‌ల‌వాలంటే ఆ ఎంపీ ప‌ర్మీష‌న్ కావాలా? ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

ఎన్టీఆర్ - రాజమౌళి: అపజయమేలేని కాంబో!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>