PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-raghu-rama-krishnam-raju3f72eb46-b998-41d8-a331-145abb9a756a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-raghu-rama-krishnam-raju3f72eb46-b998-41d8-a331-145abb9a756a-415x250-IndiaHerald.jpgభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఏపీ ప్ర‌భుత్వం ర‌ఘురామ‌పై రాజ‌ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసింది. అయితే అరెస్టు స‌మ‌యంలో సీఐడీ అధికారులు ర‌ఘురామ‌ను కొట్టార‌ని, కాళ్లు వాపు వ‌చ్చాయ‌ని వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నిర్ధారించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి ప‌రీక్ష‌ల్లో సీఐడీ అధికారులు కొట్ట‌లేద‌ని గ‌తంలో ఉన్న గాయాలేన‌ని రిపోర్టులో పేర్కొంటmp raghu rama krishnam raju;krishna;krishnam raju;raghu;andhra pradesh;mp;high court;media;television;court;king;army;ycpఓన్లీ రొటీన్ కామెంట్స్‌.. రోజువారీ ర‌చ్చ‌కు ఫుల్‌స్టాప్‌!ఓన్లీ రొటీన్ కామెంట్స్‌.. రోజువారీ ర‌చ్చ‌కు ఫుల్‌స్టాప్‌!mp raghu rama krishnam raju;krishna;krishnam raju;raghu;andhra pradesh;mp;high court;media;television;court;king;army;ycpMon, 24 May 2021 09:26:00 GMTవైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరి చేసిన విష‌యం విధిత‌మే. ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు రానున్నాడు. కోర్టు ఆంక్ష‌ల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ ఆంక్ష‌ల్లో మీడియా స్టేట్‌మెంట్‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని కూడా పేర్కొంది. దీంతో ర‌ఘురామ కృష్ణంరాజు ర‌చ్చ ఇక త‌గ్గిన‌ట్లేన‌ని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కొంద‌రుమాత్రం సుప్రీంకోర్టు విధించిన ఆంక్ష‌ల్లో కేసుకు సంబంధించిన విష‌యాల‌ను మాట్లాడ‌కూడ‌ద‌ని ఉంద‌ని, టీవీ డిబేట్‌ల‌లో పాల్గొన‌వ‌చ్చ‌ని వాద‌న‌ను వినిపిస్తున్నారు. ఎంతైనా ఇంత‌కు ముందులా వ్య‌వ‌హ‌రిస్తే ర‌ఘురామ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని, ఎవ‌రికి ఇబ్బందిలేకుండా కేవ‌లం ఓన్లీ రొటీన్ కామెట్స్‌తో స‌రిపెట్టుకోవాల్సిందేనన్న వాద‌న ఉంది.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని.. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఏపీ ప్ర‌భుత్వం ర‌ఘురామ‌పై రాజ‌ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసింది. అయితే అరెస్టు స‌మ‌యంలో సీఐడీ అధికారులు ర‌ఘురామ‌ను కొట్టార‌ని, కాళ్లు వాపు వ‌చ్చాయ‌ని వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో.. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నిర్ధారించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి ప‌రీక్ష‌ల్లో సీఐడీ అధికారులు కొట్ట‌లేద‌ని గ‌తంలో ఉన్న గాయాలేన‌ని రిపోర్టులో పేర్కొంటూ ప్ర‌భుత్వం త‌ర‌పు లాయ‌ర్లు కోర్టుకు అందజేశారు. ఈ రిపోర్టును స‌వాల్‌చేస్తూ రఘురామ త‌ర‌పు లాయ‌ర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచార‌ణ చేప‌ట్టిన సుప్రీంకోర్టు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్ప‌త్రిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రిపోర్టు అంద‌జేయాల‌ని హైకోర్టును ఆదేశించింది.

ఈ రిపోర్టులో ర‌ఘురామ‌ను సీఐడీ అధికారులు కొట్టడం వ‌ల్ల‌నే గాయాలు అయ్యాయ‌ని సుప్రీంకోర్టుకు నివేదిక అంద‌జేశారు. దీంతో ప‌లు ఆంక్ష‌ల‌తో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. నేడోరేపో ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు రానున్నారు. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ర‌ఘురామ గ‌తంలోలా మాట్లాడితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యం విధిత‌మే. అయితే కేసు విష‌యం మిన‌హా మిగిలిన విష‌యాల‌ను మాట్లాడుకోవ‌చ్చ‌న్న‌ది ఒక‌వ‌ర్గం వాద‌న‌. మ‌రి ర‌ఘురామ బ‌య‌ట‌కు వ‌చ్చాక త‌న ర‌చ్చ‌ను కంటిన్యూ చేస్తాడా..?  లేక సైలెంట్‌గా త‌న‌ప‌ని తాను చేసుకుంటూ ఉండిపోతాడా అన్న అంశం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆనందయ్య మందు గురించి అదిరిపోయే గుడ్‌న్యూస్..?

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>