PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-ap-issuesf8b7480c-928b-454a-a3b8-f1be87ad0a7b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-ap-issuesf8b7480c-928b-454a-a3b8-f1be87ad0a7b-415x250-IndiaHerald.jpgతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగేలా కనిపిస్తోంది. కరోనా కారణంగా ఆంక్షలు పెట్టి ఏపీ వాహనాలను తమ సరిహద్దుల వద్దే ఆపేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజులకు ముందు అంబులెన్స్ లను సైతం వారి రాష్ట్రంలోకి రానివ్వకుండా సరిహద్దుల వద్ద ఆపేసిన సందర్భాలు చూసాంtelangana-ap-issues;kcr;jagan;andhra pradesh;telangana;district;police;suryapeta;kodad;paruguమరోసారి ఏపీకి షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ?మరోసారి ఏపీకి షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కార్ ?telangana-ap-issues;kcr;jagan;andhra pradesh;telangana;district;police;suryapeta;kodad;paruguMon, 24 May 2021 09:00:00 GMTతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య  దూరం మరింత పెరిగేలా కనిపిస్తోంది.  కరోనా  కారణంగా ఆంక్షలు పెట్టి ఏపీ వాహనాలను తమ సరిహద్దుల వద్దే ఆపేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కొద్ది రోజులకు ముందు అంబులెన్స్ లను సైతం వారి రాష్ట్రంలోకి రానివ్వకుండా సరిహద్దుల వద్ద ఆపేసిన సందర్భాలు   చూసాం. అది కాస్తా చక్కబడింది అనుకుంటే ఇప్పుడు ఏపీ ప్రజలకు మరో సమస్య ఎదురైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పరిస్థితి మెల్ల మెల్లగా చక్కుబడుతుంది అనుకున్న సమయంలో తెలంగాణలో ఎంట్రీకి కఠిన ఆంక్షలు ఉండబోవు అనుకొని  ఏపీ నుంచి వాహన దారులు తెలంగాణ వైపు పరుగులు తీశారు. 

తెలంగాణలో  ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్న సమయంలో ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సూచించారు సీఎం కెసిఆర్. దాంతో ఏపీ నుండి వస్తున్న వాహనాలను సరిహద్దుల వద్ద  నిలిపి వేశారు తెలంగాణ పోలీసులు. దీంతో తెలంగాణ ఏపీ సరిహద్దు లైన సూర్యాపేట జిల్లా , కోదాడ మండలం, రామాపురం చెక్పోస్ట్ వద్ద ఏపీ వాహనాలు బారులు తీరాయి. ఉదయం 10 గంటల వరకు లాక్ డౌన్ మినహాయింపు ఉన్నప్పటికీ వాహనదారులను అనుమతించకుండా నిర్ధాక్షణ్యంగా నిలిపివేసినట్లు సమాచారం. 

అత్యవసర వాహనాలకు మాత్రం పర్మిషన్ ఉందని, అది కూడా ఎమర్జెన్సీ గుర్తింపు కార్డు ఖచ్చితంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది.  ఇప్పుడు ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇంతకు ముందు అయితే తెలంగాణ హై కోర్ట్ కల్పించుకుని సమస్యను సాల్వ్ చేసింది. కానీ ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడాలి. సీఎం జగన్ దీనిపై సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బుగ్గన మాట్లాడకపోయినా జగన్ హ్యాపీనే...?

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>