Andhra Pradesh
oi-Madhu Kota
సినీ పరిశ్రమలో మరో మరణం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. దర్శకుడు, నిర్మాత అయిన పి. సోమశేఖర్ కరోనాతో కన్నుమూశారు. ఆయన ఆర్జీవీకి వరుసకు సోదురుడు అవుతారు. కరోనా సోకడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సోమశేఖర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!
వర్మ సోదరుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన సోమశేఖర్.. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. హిందీలో ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. తర్వాతి కాలంలో సినిమాయేత వ్యాపారాలతో వర్మకు దూరంగా ఉండిపోయారు.

తన జీవితంలో కీలకమై వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని.. అతడిని చాలా మిస్ అవుతున్నానని ఆర్జీవి పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. సోమశేఖర్ మృతిపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ విచారం వ్యక్తం చేశారు.
wife video: భార్య నగ్న వీడియో వైరల్ -భర్త ఆత్మహత్య -కృష్ణా జిల్లాలో ఘోరం -పోలీసులు ఏం చేశారంటే..
సోమశేఖర్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యానని, కరోనా సొకిన తల్లికి సేవలు చేస్తూ శేఖర్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యాడని, తల్లిని కాపాడుకోగలిగినా, ఆయన మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బోనీ కపూర్ తెలిపారు. శేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని బోనీ అన్నారు.
English summary
popula film maker, director Ram Gopal Varma’s cousin brother P Somasekhar passed away due to covid-19 on Sunday. rgv’s brother was infected coronavirus days back and was admitted in a private hospital in Hyderabad. somashekhar directed a Bollywood movie ‘Muskurake Dekh Zara’. several film personalities including boney kapoor expressed grief over rgv brother’s death.
Story first published: Monday, May 24, 2021, 8:34 [IST]