HealthN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/low-fees-in-covid-treatment-at-prajwala-ckinicf14085a1-30d5-43cf-b458-c1f10effab6b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/low-fees-in-covid-treatment-at-prajwala-ckinicf14085a1-30d5-43cf-b458-c1f10effab6b-415x250-IndiaHerald.jpgక‌రోన మ‌హామ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది.క‌రోనతో ఆసుప‌త్రికి వెళ్తే ల‌క్ష‌ల ఖ‌ర్చ‌వుతుంది.కొన్ని సంద‌ర్భాల్లో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ప్రాణాలు ద‌క్క‌డం లేదు. క‌రోనా చికిత్స‌కోసం కార్పోరేట్ ఆసుప‌త్రుల‌కు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌రోనాని కార్పోరేట్ ఆసుప‌త్రి వైద్యులు క్యాష్ చేసుకుంటున్న ఇలాంటి స‌మ‌యంలో ఓ డాక్ట‌ర్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. క‌న్స‌ల్టెన్నీ ఫీజు 10 రూపాయ‌లు తీసుకుని క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్నారు.వ‌చ్చిన వారు పేద వారైతే ఆ ప‌ది రూcovid treatment;mandula10రూపాల‌య‌కే క‌రోన వైద్యం... ఎక్క‌డంటే.?10రూపాల‌య‌కే క‌రోన వైద్యం... ఎక్క‌డంటే.?covid treatment;mandulaMon, 24 May 2021 16:01:30 GMTక‌రోన మ‌హామ్మారి క‌ల్లోలం సృష్టిస్తుంది.క‌రోనతో ఆసుప‌త్రికి వెళ్తే ల‌క్ష‌ల ఖ‌ర్చ‌వుతుంది.కొన్ని సంద‌ర్భాల్లో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన ప్రాణాలు ద‌క్క‌డం లేదు. క‌రోనా చికిత్స‌కోసం కార్పోరేట్ ఆసుప‌త్రుల‌కు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. క‌రోనాని కార్పోరేట్ ఆసుప‌త్రి వైద్యులు క్యాష్ చేసుకుంటున్న ఇలాంటి స‌మ‌యంలో ఓ డాక్ట‌ర్ త‌న మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. క‌న్స‌ల్టెన్నీ ఫీజు 10 రూపాయ‌లు తీసుకుని క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్నారు.వ‌చ్చిన వారు పేద వారైతే ఆ ప‌ది రూపాయ‌లు కూడా ఆయన తీసుకోవ‌డంలేదు. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రో ఎంటో తెలుసుకుందాం.

ఫిర్జాదీగూడ‌కు చెందిన డాక్ట‌ర్ విక్ట‌ర్ ఇమ్మాన్యుయేల్ ప్ర‌జ్వ‌ల క్లినిక్‌ను నిర్వ‌హిస్తున్నారు. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బాధితుల ద‌గ్గ‌ర నుంచి డ‌బ్బులు దండుకుంటున్న ఈ స‌మ‌యంలో ఆయ‌న మాత్రం అంద‌రికి ఆద‌ర్శ‌నంగా నిలుస్తున్నారు.డాక్ట‌ర్ విక్ట‌ర్ జ‌న‌ర‌ల్ మెడిసిన్ స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.సొంత‌గా క్లినిక్ పెట్టుకుని చుట్టుప్ర‌క్క‌లా ప్రాంతాల వారికి చికిత్స అందిస్తున్నారు.ఆయ‌న ఆసుప‌త్రిలో సాధార‌ణంగా క‌న్స‌ల్టెన్నీ ఫీజు కింద రూ.200 తీసుకుంటారు.పేద‌వారికి అయితే మాత్రం రూ.10 మాత్ర‌మే ఫీజు.దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు సహా జబ్బు నయం అయ్యే దాకా మందులతో సహా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉచితంగానే అందిస్తున్నారు.  కొవిడ్‌ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్‌ పరీక్షలు మొదలుకుని మందులు, ఇంజక్షన్‌లు సైతం తక్కువ ధరకే అందిస్తున్నారు.

అయితే ప్ర‌జ్వ‌ల క్లినిక్‌లో క‌రోనా చికిత్సకు ఫీజు కూడా చాలా త‌క్కువ‌గానే ఉంది.క‌న్స‌ల్టెన్సీ ఫీజు రూ.10 రూపాయ‌లు మాత్రమే ఉంది.కరోనా చికిత్సలో భాగంగా ఆక్సిజన్‌, రెమ్‌డెవివిర్‌ ఇంజెక్షన్లు సామాన్యులకు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రోగులకు ఇవన్నీ తక్కువ ధరకే సమకూర్చుతున్నారు డాక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌. ఇందుకు ఇతర వైద్యుల సహాయాన్ని ఆయన తీసుకుంటున్నారు. ఇంటి వద్ద వైద్యం చేయించుకునే రోగుల కోసం నర్సులను పంపుతున్నారు. ఇందుకు రోగులే రవాణా ఖర్చులను భరించాల్సి ఉంటుంది. మొత్తంగా కరోనా చికత్స కోసం రూ.15వేల నుంచి రూ.20లోపే ఖర్చవుతుంది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో లక్షలు ఖర్చవుతుండగా రూ.15 వేలకే కరోనా వైద్యం అందిస్తుండడంతో ఇమ్మాన్యుయెల్‌ నడిపిస్తున్న ప్రజ్వల క్లినిక్‌కు వచ్చే రోగుల సంఖ్య  రోజురోజుకి పెరుగుతోంది. పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఐసొలేషన్‌ సెంటర్‌లోనూ డాక్టర్‌ ఇమ్మాన్యుయెల్‌ ఏడాదిగా కరోనా బాధితులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన  రోగుల్లో నిరుపేదలుంటే వారిని పీర్జాదిగూడ ఐసొలేసన్‌ సెంటర్‌లో చేర్పించి వారికి పూర్తిస్థాయిలో ఉచితంగానే వైద్యం చేయిస్తున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో అదొక్కటే భయం... ఇప్పుడు ఏంటీ...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>