SmaranaDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sree-hari-dd3cd0e1-8512-419a-90c8-95bc95296971-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/sree-hari-dd3cd0e1-8512-419a-90c8-95bc95296971-415x250-IndiaHerald.jpgమాట్లాడాలంటే ముందుగా మనకు గుర్తు వచ్చే నటుడు శ్రీహరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఈయన తీసిన సినిమాల్లో చాలా వరకు మనం తెలంగాణ యాసను గమనించవచ్చు. శ్రీహరి తెలుగు సినిమా నటుడు. అంతేకాకుండా ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.. శ్రీహరి సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదనుకుంటూ సాయం చేసే గొప్ప గుణం కలిగిన మనిషి అని ప్రతి ఒక్కరికి తెలిసిందే.. శ్రీహరి తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి ఎలమర్రు లో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్ షాపు నడుSREE HARI;kumaar;prabhu deva;shobhana;raj;sree;sridhar;srihari;srinivas;mumbai;hyderabad;telangana;adinarayanareddy;ram madhav;district;cinema;cinema theater;tamil;village;cycle;october;traffic police;father;research and analysis wing;kavuru srinivas;master;misterస్మరణ : మిస్టర్ హైదరాబాద్ గా 7 సార్లు ఎంపికైన శ్రీహరి.స్మరణ : మిస్టర్ హైదరాబాద్ గా 7 సార్లు ఎంపికైన శ్రీహరి.SREE HARI;kumaar;prabhu deva;shobhana;raj;sree;sridhar;srihari;srinivas;mumbai;hyderabad;telangana;adinarayanareddy;ram madhav;district;cinema;cinema theater;tamil;village;cycle;october;traffic police;father;research and analysis wing;kavuru srinivas;master;misterMon, 24 May 2021 06:30:00 GMTతెలంగాణ యాస గురించి మాట్లాడాలంటే ముందుగా మనకు గుర్తు వచ్చే నటుడు శ్రీహరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు . ఈయన తీసిన సినిమాల్లో చాలా వరకు మనం తెలంగాణ యాసను గమనించవచ్చు. శ్రీహరి తెలుగు సినిమా నటుడు. అంతేకాకుండా ప్రతినాయకుడిగా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.. శ్రీహరి సాయం కోసం తన దగ్గరకు వెళ్ళిన వారికి లేదనుకుంటూ సాయం చేసే గొప్ప గుణం కలిగిన మనిషి అని ప్రతి ఒక్కరికి తెలిసిందే..


శ్రీహరి తండ్రి సత్యనారాయణ, తల్లి సత్యవతి ఎలమర్రు లో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిల్ షాపు నడుపుతూ జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. 1977లో ఎలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  శ్రీహరి ఏడవ తరగతి పాస్ అయ్యాడు. ఆ  తరువాత గ్రామంలో వున్న అర్ధ ఎకరం భూమిని అమ్ముకొని, హైదరాబాద్బ్కు మకాం మార్చారు.. శ్రీహరికి ముఖ్యంగా చెప్పాలంటే, యుక్త వయసు నుండే శారీరక దారుఢ్యం పై ఎంతో ఆసక్తి ఉండేది. ఇక ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ షాప్ లో  మెకానిక్ గా పని చేస్తూ ,దొరికిన సమయంలో సినిమాలను శోభన థియేటర్లో చూసేవారట . హైదరాబాద్ లో  నిర్వహించిన శారీరక దారుఢ్యం పోటీల్లో పాల్గొని, మొత్తం ఏడుసార్లు మిస్టర్ హైదరాబాద్ గా అవార్డులను సొంతం చేసుకున్నారు..


ఇక విశ్వవిద్యాలయం తరఫున రెండు సార్లు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు కూడా గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరఫున ఆడాలి అనే కోరిక ఉన్నప్పటికీ , ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు శ్రీహరి.. శ్రీహరి సినిమాలలో నటించాలనే ఆసక్తితోనే 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టాడు.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ  నటుడిగా మారాడు.. సినీ ఇండస్ట్రీలోకి 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ధర్మక్షేత్రం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ,హీరోగా , నిర్మాతగా  ఇలా వివిధ రకాలుగా నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీహరి.. ఇక అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన శ్రీహరి, 2000వ సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు..


ఆ తరువాత గణపతి, ఆయోధ్య రామయ్య , శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు ఇలా ఏకంగా 92 చిత్రాల్లో నటించి, 2013లో శ్రీ జగత్ గురు ఆది శంకర సినిమాలో చివరిసారిగా పూర్తిగా నటించి ఆయన కన్నుమూశారు.  ఇక చనిపోయే ముందు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్ కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ,ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 9 2013న కాలేయ సంబంధ వ్యాధి వల్ల ముంబైలో కన్నుమూశారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సీఎంఓ వెహికల్ అయినా..ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి ఎంట్రీ!

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>