MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combinationf6bd6cb9-dd40-4cf2-ae3e-f1e2f8115953-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors-heroes-combinationf6bd6cb9-dd40-4cf2-ae3e-f1e2f8115953-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నాకూడా ఆది మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే జూనియ‌ర్‌కు మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. 20ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారడానికి ఈ సినిమాతో బీజంప‌డింది. ఆది సినిమాలో అమ్మ‌తోడు అడ్డంగా న‌రుకుతా డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఇప్ప‌టికీ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఆ డైలాగే అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. ఆది సినిమా 2002లో రాగా.. రెండేళ్ల త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో సాంబ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతమ‌నే చెప్ప‌వ‌చ్చు. అయdirectors-heroes-combination;ntr;jr ntr;adinarayanareddy;tollywood;cinema;nandamuri taraka rama rao;v;mass;adhurs;fidaaరికార్డుల మోత మోగించారు .. అదుర్స్ సీక్వెల్ ఎప్పుడంటే!రికార్డుల మోత మోగించారు .. అదుర్స్ సీక్వెల్ ఎప్పుడంటే!directors-heroes-combination;ntr;jr ntr;adinarayanareddy;tollywood;cinema;nandamuri taraka rama rao;v;mass;adhurs;fidaaMon, 24 May 2021 14:30:00 GMTద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్, యంగ్‌టైగ‌ర్ జూ. ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా అంటేనే సినీ ప‌రిశ్ర‌మ మొత్తం టాలీవుడ్ రికార్డుల వైపు చూస్తుంది. అంత‌లా వీరి కాంబినేష‌న్ హిట్ అయింది. ఆది సినిమాతో తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఆ త‌రువాత వ‌చ్చిన సాంబ ఆశించిన స్థాయిలో ఆడ‌క‌పోయినా.. 2010లో వ‌చ్చిన అదుర్స్ సినిమాతో మ‌రోసారి రికార్డుల ప‌రంప‌ర‌ను కొన‌సాగించారు. ప్ర‌స్తుతం వీవీ వినాయ‌క్, జూ. ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో అదుర్స్ సీక్వెల్ రాబోతుంద‌న్న టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే వి.వి. వినాయ‌క్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. జూ. ఎన్టీఆర్‌తో అదుర్స్ సీక్వెల్ ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని తేల్చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నాకూడా ఆది మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే జూనియ‌ర్‌కు మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. 20ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారడానికి ఈ సినిమాతో బీజంప‌డింది. ఆది సినిమాలో అమ్మ‌తోడు అడ్డంగా న‌రుకుతా డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించింది. ఇప్ప‌టికీ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఆ డైలాగే అగ్ర‌స్థానంలో నిలుస్తుంది. ఆది సినిమా 2002లో రాగా.. రెండేళ్ల త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో సాంబ సినిమా విడుద‌లైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న అద్భుతమ‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయింది.

ఆరేళ్ల గ్యాప్ త‌రువాత 2010లో అదుర్స్ సినిమాతో మ‌ళ్లీ అద్భుత విజ‌యాన్ని వి.వి.వినాయ‌క్‌, జూ. ఎన్టీఆర్‌లు అందుకున్నారు. అదుర్స్‌లో ఎన్టీఆర్ న‌ట‌న సినిమా చూసేవారిని క‌ళ్లుతిప్పుకోనివ్వ‌దంటే అతిశ‌యోక్తికాదు. ద్విపాత్రాభిన‌యం చేసిన ఎన్టీఆర్‌.. త‌న‌దైన శైలిలో న‌ట‌విశ్వ‌రూపం చూపించారు. ఎన్టీఆర్ న‌ట‌న‌తో ఫిదా అయిన ప్రేక్ష‌కులు భారీ విజ‌యాన్ని అందించారు. ఆ త‌రువాత ఎన్టీఆర్, వినాయ‌క్‌ల కాంబినేష‌న్ ఎప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానులు ఎద‌రుచూస్తున్నారు. అయితే అదుర్స్ సీక్వెల్ క‌చ్చితంగా ఉంటుంద‌ని వివి వినాయ‌క్ స్ప‌ష్టం చేశారు. అయితే ఆ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌న్న‌ది తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ కి 'ట్రెండ్ సెట్టర్' కాంబినేషన్ అంటే వీళ్లదే..!!

సూపర్ హిట్ కోసం సూర్య నాలుగో ప్రయత్నం...

"ప్రస్థానం" డైరెక్టర్ విజయాల బాట పట్టేనా ?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>