PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vaccine-hosptal-goving-56e14d22-39b7-442c-9c34-e36280a809ed-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/carona-vaccine-hosptal-goving-56e14d22-39b7-442c-9c34-e36280a809ed-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వృధా తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుcorona virus;central government18+ వారికి కేంద్రం శుభవార్త!18+ వారికి కేంద్రం శుభవార్త!corona virus;central governmentMon, 24 May 2021 17:10:00 GMTకరోనా వ్యాక్సిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఎలాంటి ముందస్తు నమోదు లేకుండా ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వృధా తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది..


 ఒకవేళ కరోనా వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వారు ఒకవేళ ఆ రోజు రాకపోతే ఆ టీకా డోసులు నిరుపయోగంగా మారుతున్నాయి అని, ఆ వేస్టేజ్ ను కొంతలో కొంత తగ్గించేందుకుగాను ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద 18 - 44 ఏళ్ల మధ్య వారికి ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వానిదేనని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ 18-44 ఏళ్ల వారికి ఆయా రాష్ట్రాలు ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌కు అనుమతినిస్తే.. అది కేవలం ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రం వద్ద మాత్రమే అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. 


ప్రయివేటు కేంద్రాల వద్ద వాక్‌-ఇన్‌ నమోదులను చేపట్టొద్దని సూచించింది. ఇక ఆన్‌సైట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో టీకా కేంద్రాల వద్ద ఎలాంటి రద్దీ లేకుండా చూసుకోవాలి అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ టీకాలు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే 18-44 ఏళ్ల వారు కచ్చితంగా కొవిన్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొంది. 18 ఏళ్ల పైబడిన వారికి టీకాలు ఇవ్వొచ్చని కేంద్రం చెప్పినప్పటికీ వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రాలు టీకా పంపిణీ ఇంకా ప్రారంభించలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం 45+ వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దేశంలో అదొక్కటే భయం... ఇప్పుడు ఏంటీ...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>