MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9c9ce836-f2fe-411f-9a14-d53bed293da6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi9c9ce836-f2fe-411f-9a14-d53bed293da6-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నటనలో గానీ.. డాన్స్ లో గానీ.. ఫైట్ సన్నివేశాల్లో గానీ అదరగొడతారు. ఆయన తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో నవ్వు తెప్పించగలరు, అలాగే ఏడ్పు కూడా బాగా తెప్పించగలరు. అయితే ఎలాంటి క్లిష్టతరమైన పాత్రలోనైనా నటించడానికి చిరంజీవి సిద్ధమవుతారు కానీ పాటలు పాడటానికి మాత్రం ఆయన అస్సలు ఇష్టపడరు. పాట పాడాలని ఎవరైనా అడిగితే అమ్మో నా వల్ల కాదు అండి అని వెంటనే చెప్పేస్తారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం చిరంజీవిని బలవంతపెట్టి మరీ ఒక పాట పాడించారు. వివరంగా తెలుసుకుంటే.. 1997 లో విడుదలైన మాస్టర్ సినిమాలోchiranjeevi;chiranjeevi;allu aravind;suresh;krishna;sirivennela;tara;korcha;cinema;interview;director;hero;geetha arts;master;sirivennela sitaramasastriచిరుని బలవంతపెట్టి మరీ ఆ పని చేయించిన డైరెక్టర్..?చిరుని బలవంతపెట్టి మరీ ఆ పని చేయించిన డైరెక్టర్..?chiranjeevi;chiranjeevi;allu aravind;suresh;krishna;sirivennela;tara;korcha;cinema;interview;director;hero;geetha arts;master;sirivennela sitaramasastriMon, 24 May 2021 17:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి నటనలో గానీ.. డాన్స్ లో గానీ.. ఫైట్ సన్నివేశాల్లో గానీ అదరగొడతారు. ఆయన తన సహజమైన నటనతో ప్రేక్షకుల్లో నవ్వు తెప్పించగలరు, అలాగే ఏడ్పు కూడా బాగా తెప్పించగలరు. అయితే ఎలాంటి క్లిష్టతరమైన పాత్రలోనైనా నటించడానికి చిరంజీవి సిద్ధమవుతారు కానీ పాటలు పాడటానికి మాత్రం ఆయన అస్సలు ఇష్టపడరు. పాట పాడాలని ఎవరైనా అడిగితే అమ్మో నా వల్ల కాదు అండి అని వెంటనే చెప్పేస్తారు. అయితే ఒక డైరెక్టర్ మాత్రం చిరంజీవిని బలవంతపెట్టి మరీ ఒక పాట పాడించారు.



వివరంగా తెలుసుకుంటే.. 1997 లో విడుదలైన మాస్టర్ సినిమాలో చిరంజీవి, రోషిని హీరో హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన "తమ్ముడు అరె తమ్ముడు" పాటను చిరంజీవి ఆలపించిన విషయం తెలిసిందే. అయితే సురేష్ కృష్ణ ఈ పాటను పాడాలని చిరంజీవిని అడిగినప్పుడు ఆయన తీవ్ర విముఖత చూపారు. 'పాట పాడనంటే పాడను' అని చిరంజీవి మొండికేసి కూర్చున్నారు. కానీ సురేష్ కృష్ణ మాత్రం పట్టుబట్టి మరీ చిరంజీవిని ఎలాగోలా ఒప్పించారు.



ఐతే 6 నిమిషాల 6 సెకండ్ల నిడివి గల ఈ పాటను చిరంజీవి అయిష్టంగానే పాడారు. అలాగే ఈ పాట విని ప్రేక్షకులు తనని ఖచ్చితంగా ఎద్దేవా చేస్తారని చిరు అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత "తమ్ముడు అరె తమ్ముడు" పాట సూపర్ హిట్ అయింది. దీంతో చిరంజీవి నటనలో మాత్రమే కాదు పాట పాడటం లో కూడా ప్రేక్షకులను అలరించినట్లయింది. అయితే ఇటీవల ఈ విషయాలను మాస్టర్ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇకపోతే చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాకిస్తాన్ కుక్క బుద్ధి... మరీ ఇలానా...?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>