PoliticsNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/directors-heroes-combination-9d9a4f21-469a-42de-93a1-289704c2938c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/directors-heroes-combination-9d9a4f21-469a-42de-93a1-289704c2938c-415x250-IndiaHerald.jpgకొన్ని కొన్ని హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ అభిమానులని అలరిస్తాయి . సినిమా హిట్ అయిన కాకపోయినా ఆ కాంబో లో సినిమా అంటే అందరూ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పవన్ డైరెక్టర్ ఎస్ జే సూర్య కాంబినేషన్ పెరు వింటే మాత్రం అభిమానులకి ఆనందం భయం రెండు ఒకేసారి వస్తాయి. ఎందుకంటే వారి కాంబో లో వచ్చిన సినిమా పవర్ స్టార్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా పేరొందిన ఖుషీ సృష్టించిన రికార్డులు చెప్పలేనివి. పవన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారుdirectors-heroes-combination;pawan;bhumika chawla;kalyan;pawan kalyan;surya sivakumar;vijay;cinema;tamil;history;hindi;remake;director;tiger;hero;heroine;joseph vijay;allu sneha;v;pawan-kalyan;kushiపవన్ - ఎస్ జే సూర్య : మొదట్లో అదరగొట్టి తర్వాత భయపెట్టిన కాంబోపవన్ - ఎస్ జే సూర్య : మొదట్లో అదరగొట్టి తర్వాత భయపెట్టిన కాంబోdirectors-heroes-combination;pawan;bhumika chawla;kalyan;pawan kalyan;surya sivakumar;vijay;cinema;tamil;history;hindi;remake;director;tiger;hero;heroine;joseph vijay;allu sneha;v;pawan-kalyan;kushiMon, 24 May 2021 14:00:00 GMTకొన్ని కొన్ని హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ అభిమానులని అలరిస్తాయి . సినిమా హిట్ అయిన కాకపోయినా ఆ కాంబో లో సినిమా అంటే అందరూ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే పవన్ డైరెక్టర్ ఎస్ జే సూర్య కాంబినేషన్ పెరు వింటే మాత్రం అభిమానులకి ఆనందం భయం రెండు ఒకేసారి వస్తాయి. ఎందుకంటే వారి కాంబో లో వచ్చిన సినిమా పవర్ స్టార్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా పేరొందిన ఖుషీ  సృష్టించిన రికార్డులు చెప్పలేనివి. పవన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. భూమిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు.

 పవన్ తో పోటాపోటీగా నటించింది భూమిక. శ్రీసూర్య మూవీస్ పై ఏ.ఎం.రత్నం ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో విజయ్ నటించిన ఖుషీకి తెలుగు రీమేక్ గా తీశారు. ఇక ఈ సినిమాకు హైలెట్ అంటే పవన్- భూమిక సన్నివేశాలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఈ క్లాసికల్ సినిమాలోని పాటలు, పవన్ మ్యానరిజం, డైలాగ్‌లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ హైలెట్ గానే అనిపిస్తాయి.భూమిక బొడ్డు చూపించే సన్నివేశం ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఇమేటేట్ చేస్తుండడం విశేషం. బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే రూ. 20కోట్ల వసూళ్లతో ఓ చరిత్ర సృష్టించింది ఈ చిత్రం.కేకేతో మణి శర్మ మొదటి సారి పాడించిన హిందీ సాంగ్ `యే మేరా జహాన్ ` తెలుగు చిత్ర రంగంలో నే తొలి ప్రయోగం. ఈ పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యింది.

సెకాండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్ సీన్స్‌కు పవన్ కళ్యాణ్ స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ ఫైల్ షూటింగ్‌కి వాడిన కెమెరా పనితనం, మార్షల్ ఆర్ట్స్, పవన్ లోని సృజనాత్మకతకి పరాకాష్టలుగా నిలిచాయి.అయితే ఇన్ని అంచనాలు ఉన్న వీరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా కొమరం పులి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంతమంచిది. ఎందుకంటే ఈ సినిమా పవన్ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్. ఈ సినిమా తర్వాత పవన్ అభిమానులు ఎస్ జే సూర్య బాగా తిట్టుకున్నారు.కానీ సినిమా ప్లాప్ అయిన కూడా పవన్ ఎస్ జే సూర్య మధ్య స్నేహం మాత్రం ఇంకా అలానే ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మారిన గుంటూరు రాజకీయాలు...ఆ ఎమ్మెల్యే పరిస్తితి ఏంటి?

టాలీవుడ్ లో కడుపుబ్బా నవ్వించిన కాంబో అల్లరి నరేష్ - ఈవీవీ సత్యనారాయణ..

కన్నీటిపర్యంతమైన సోనూసూద్

రీమేక్ ల జోలికి వెళ్లని మన టాలీవుడ్ హీరోలు వీరే..!!

రాజశేఖర్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన దర్శకుడు ఎవ‌రంటే.. 8/9 హిట్ ..!

టాలీవుడ్‌కే క్రాక్ తెప్పించిన కాంబో రవితేజ, గోపీచంద్ మలినేని

టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్ కాంబో..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>