MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/taman-356bca4e-6b1b-472e-9293-77656cf76a49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/taman-356bca4e-6b1b-472e-9293-77656cf76a49-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా అవకాశాలతో కొనసాగుతున్న సంగీత దర్శకుల్లో యువ మ్యూజికల్ సెన్సేషనల్ థమన్ అందరికంటే ముందు ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తొలిసారిగా భీభత్సం మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన థమన్, ఆ తరువాత రవితేజ నటించిన కిక్ మూవీతో తొలి సక్సెస్ అందుకున్నాడు. అక్కడి నుండి ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకున్న థమన్ ఆపై దూకుడు, బృందావనం సినిమాల భారీ సక్సెస్ లతో మరింత మంచి పేరు దక్కించుకున్నాడు. ఆపై వరుస అవకాశాలతో దూసుకెళ్లిన థమన్ చాలా సినిమాలకు శ్రోతలs-thaman;view;chiranjeevi;mahesh;ravi;balakrishna;allu arjun;geetha;pawan kalyan;ravi teja;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;remake;director;success;yuva;arjun;kick;ala vaikunthapurramloo;tuck jagadish;anandamఅందరి గురించి బాగానే చెప్పాడు .... అందులో ఎందరికి అదరగొడతాడో మరి ..... ??అందరి గురించి బాగానే చెప్పాడు .... అందులో ఎందరికి అదరగొడతాడో మరి ..... ??s-thaman;view;chiranjeevi;mahesh;ravi;balakrishna;allu arjun;geetha;pawan kalyan;ravi teja;thaman s;trivikram srinivas;tollywood;cinema;sangeetha;media;youtube;you tube;remake;director;success;yuva;arjun;kick;ala vaikunthapurramloo;tuck jagadish;anandamMon, 24 May 2021 21:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం వరుసగా అవకాశాలతో కొనసాగుతున్న సంగీత దర్శకుల్లో యువ మ్యూజికల్ సెన్సేషనల్ థమన్ అందరికంటే ముందు ఉంటారు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. తొలిసారిగా భీభత్సం మూవీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన థమన్, ఆ తరువాత రవితేజ నటించిన కిక్ మూవీతో తొలి సక్సెస్ అందుకున్నాడు. అక్కడి నుండి ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకున్న థమన్ ఆపై దూకుడు, బృందావనం సినిమాల భారీ సక్సెస్ లతో మరింత మంచి పేరు దక్కించుకున్నాడు. ఆపై వరుస అవకాశాలతో దూసుకెళ్లిన థమన్ చాలా సినిమాలకు శ్రోతలను ఆకట్టుకునే మంచి సాంగ్స్ అందించారు. అయితే మధ్యలో ఆయన పై కాపీ ట్యూన్స్ వార్తలు ప్రచారం కావడంతో, అనంతరం కెరీర్ పరంగా స్వల్ప విరామం తీసుకున్న థమన్ ఆపై మహానుభావుడు మూవీ తో రీఎంట్రీ ఇచ్చి తద్వారా సూపర్ హిట్ అందుకోవడం జరిగింది.

ఆ తరువాత నుండి పలు సినిమాలతో వరుసగా మ్యూజికల్ హిట్స్ ఇస్తూ కొనసాగిన థమన్ గత ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన అలవైకుంఠపురములో సాంగ్స్ తో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ సాంగ్స్ యూట్యూబ్ లో వందల మిలియన్స్ వ్యూస్ అందుకోవడంతో పాటు కెరీర్ పరంగా థమన్ కి ఆకాశమంత పేరు తెచ్చిపెట్టాయి. దానితో ప్రస్తుతం థమన్ కు ఒకదాని వెంట మరొకటి ఛాన్స్ లు క్యూ కట్టాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాల గురించి ఇటీవల ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూ లో భాగంగా థమన్ మాట్లాడుతూ, చాలా మంది స్టార్ హీరోలతో పాటు కొందరు యువ హీరోల సినిమాలు కూడా ప్రస్తుతం తాను చేస్తున్నానని అన్నారు.

ముందుగా మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట తోపాటు త్వరలో మహేష్, త్రివిక్రమ్ తో చేయనున్న మూవీలో కూడా సాంగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయని చెప్పిన థమన్, అలానే పవర్ స్టార్ తో కూడా వరుసగా రెండవ సినిమాగా అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ కి మ్యూజిక్ అందిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, ఆ మూవీలో సాంగ్స్ కూడా అదిరిపోతాయని అన్నారు. ఇక బాలయ్య, బోయపాటిల అఖండ మ్యూజిక్ ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని, నానితో చేస్తున్న టక్ జగదీశ్ తో పాటు ముఖ్యంగా తన కెరీర్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ తో త్వరలో ప్రారంభం కానున్న లూసిఫర్ తెలుగు రీమేక్ సినిమాలకు కూడా మ్యూజిక్ అదరగొడుతున్నట్లు థమన్ చెప్పారు.

ఇప్పటికే టక్ జగదీశ్ నుండి విడుదలైన సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా లైన్లో ఉన్నాయని, తన కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందని, తప్పకుండా ఈ సినిమాలు అన్నివిజయాలు అందుకుని తనకు మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నట్లు థమన్ చెప్పారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా, అన్న నువ్వు అన్ని సినిమాల సాంగ్స్ అవుట్ ఫుట్ అదిరిపోతాయి అని చెప్తున్నావు, ఇంతకీ వీటిలో ఏ మూవీ సాంగ్స్ ఇరగదీసావు అనేది తెలియాలంటే ఆయా సినిమాల పాటలు విడుదలైన తరువాతే చెప్పగలం అని, అయితే పక్కాగా నీ మీద టాలీవుడ్ ఫ్యాన్స్ అందరికీ ఎంతో నమ్మకం ఉంది, అన్ని సినిమాల సాంగ్స్ అద్భుతంగా ఉండాలని కోరుతూ పలువురు సినీ ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా థమన్ ని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు ..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మాజీ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ సబబేనా ?

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>