PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam34e03178-eed3-4ad4-b9f7-bfe1348b2db1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/krishnapatnam34e03178-eed3-4ad4-b9f7-bfe1348b2db1-415x250-IndiaHerald.jpgకరోనా విజృంభిస్తున్న వేళ.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు.. ఇప్పుడు ఎవరి నోట చూసినా ఇదే మాట.. కృష్ణపట్నం నెల్లూరు జిల్లాలోని ఓ తీర ప్రాంతంలోని ఊరు ఇప్పుడు ఆనందయ్య మందు కారణంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆంధ్రాలోనే కాదు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా కరోనా రోగులు కృష్ణపట్నం వచ్చారు. ఆయన ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తుందన్న పేరూ వచ్చింది. అయితే అనూహ్యంగా జనం వెల్లువెత్తడంతో తాత్కాలికంగా ఈ మందు పంపిణీ ఆపేశారు. ఆనందయ్య మందును ఐసీఎంఆర్, ఆయుర్వేద నిపుణులుkrishnapatnam;andhra pradesh;karnataka - bengaluru;odisha;telangana;district;mla;good news;ayurveda;central government;anil kumar singhal;good newwz;krishnapatnam port;tirumala tirupathi devasthanamఆనందయ్య మందు గురించి అదిరిపోయే గుడ్‌న్యూస్..?ఆనందయ్య మందు గురించి అదిరిపోయే గుడ్‌న్యూస్..?krishnapatnam;andhra pradesh;karnataka - bengaluru;odisha;telangana;district;mla;good news;ayurveda;central government;anil kumar singhal;good newwz;krishnapatnam port;tirumala tirupathi devasthanamMon, 24 May 2021 09:30:00 GMTకరోనా విజృంభిస్తున్న వేళ.. అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు.. ఇప్పుడు ఎవరి నోట చూసినా ఇదే మాట.. కృష్ణపట్నం నెల్లూరు జిల్లాలోని ఓ తీర ప్రాంతంలోని ఊరు ఇప్పుడు ఆనందయ్య మందు కారణంగా ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆంధ్రాలోనే కాదు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా నుంచి కూడా కరోనా రోగులు కృష్ణపట్నం వచ్చారు. ఆయన ఇస్తున్న ఆయుర్వేద మందు బాగా పని చేస్తుందన్న పేరూ వచ్చింది. అయితే అనూహ్యంగా జనం వెల్లువెత్తడంతో తాత్కాలికంగా ఈ మందు పంపిణీ ఆపేశారు.

ఆనందయ్య మందును ఐసీఎంఆర్, ఆయుర్వేద నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ మందు కోసం రోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఆయుష్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనందయ్య తయారుచేస్తున్న మందు పంపిణీకి అభ్యంతరం లేదని ఏపీ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆనందయ్య వంశపారంపర్యంగా ఆయన ఈ మందు తయారుచేసి ఇస్తున్నారని, వీటిలో ఉపయోగిస్తున్న పదార్థాలతో హాని లేనట్లు వెల్లడైందని చెప్పారు.

అయితే.. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాక తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని సింఘాల్ అన్నారు. ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా  గుర్తించడం లేదని, అలా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయతపై నిర్ధారణ, ఇతర అనుమతులు అవసరమవుతాయని ప్రభుత్వం అంటోంది. ఈ మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మందు పంపిణీ త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.  

మరోవైపు ఆనందయ్య మందును ప్రజలకు చేరువ చేసేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లావ్యాప్తంగా అవసరమైన వారందరికీ పంపిణీ చేసే బాధ్యత తనదని ఆయన ప్రకటించారు. ఆనందయ్య మందును ఆయుష్‌, ఐసీఎంఆర్‌, ప్రభుత్వం ఆమోదిస్తే భారీగా తయారు చేసే అంశంలో సహకరించాలని ఇప్పటికే టీటీడీ కూడా నిర్ణయించింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్,త్రివిక్రమ్ సినిమాల్లో ఇవే హైలెట్..

ఉప్పెన హిట్ పాట వెనుక ఆసలు కథ ఇదే..?

అల్లు అర్జున్ జీవితాన్ని మార్చిన సుకుమార్.. !

ప్రభాస్ మాస్ స్టామినా చాటిన మిర్చి..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎల్లోమీడియా వాదనలో మరీ ఇంత డొల్లతనమా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : కార్పొరేటుకు ఆనందయ్యకు మద్య తేడా తెలిసిందా ?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>