PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-7702a96e-dfd4-41e1-85e9-e8a38a3d85ae-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-7702a96e-dfd4-41e1-85e9-e8a38a3d85ae-415x250-IndiaHerald.jpgవైఎస్ జగన్ వరస విజయాలతో గట్టిగానే ఉన్నారు. రెండేళ్ళుగా చూస్తే ఆయన తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోవడం ఏపీలోని విపక్షాలకు కష్టంగా మారుతోంది. జగన్ ని నిలువరించే మార్గాలని ఎప్పటికపుడు వారు అన్వేషిస్తున్నారు. jagan;lokesh;sudhakar;tara;jagan;district;vishakapatnam;bank;cbi;episode;heart;doctor;tdp;ycp;lokesh kanagaraj;party;scheduled caste;scheduled tribesజగన్ మీద పవర్ ఫుల్ కార్డు.... ?జగన్ మీద పవర్ ఫుల్ కార్డు.... ?jagan;lokesh;sudhakar;tara;jagan;district;vishakapatnam;bank;cbi;episode;heart;doctor;tdp;ycp;lokesh kanagaraj;party;scheduled caste;scheduled tribesMon, 24 May 2021 20:00:00 GMTవైఎస్ జగన్ వరస విజయాలతో గట్టిగానే ఉన్నారు. రెండేళ్ళుగా చూస్తే ఆయన తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోవడం ఏపీలోని విపక్షాలకు కష్టంగా మారుతోంది. జగన్ ని నిలువరించే మార్గాలని ఎప్పటికపుడు వారు అన్వేషిస్తున్నారు.

ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ముందుంది. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. పదేళ్ళుగా జగన్ ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు అంటే దానికి కారణం ఆయన వెనక ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ గట్టిగా ఉండడమే. అలాగే మైనారిటీలు కూడా జగన్ని నమ్ముతారు. ఇదిలా ఉంటే జగన్ కి బలమైన ఎస్సీ వర్గాలను దూరం చేయాలన్న ఆలోచన చాలా కాలంగా సాగుతోంది. కానీ అది నెరవేరడంలేదు.

ఇదిలా ఉంటే విశాఖ జిల్లా నర్శీపట్నం మత్తు దాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ ని అడ్డం పెట్టుకుని జగన్ మీద పదునైన బాణాన్నే టీడీపీ వదులుతోంది. ఆయన దళితుడు కావడంతో జగన్ సర్కార్ వెంటాది వేధించి ఈ డాక్టర్ ని పొట్టన పెట్టుకుంది అంటున్నారు. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ డాక్టర్ మాట్లాడారు. ఆ తరువాత ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇక ఆయన విశాఖలో  రోడ్డు మీదకు వచ్చి కొంత యాగీ చేశారు. ఆ మీదట  ఆయన విషయంలో  హై కోర్టు జోక్యం చేసుకుంది. సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ఆ నివేదిక త్వరలో వస్తుంది అనుకుంటున్న తరుణంలో సుధాకర్ గుండె పోటుతో సడెన్ గా  మరణించారు.

ఇపుడు ఈ విషయం మీదనే టీడీపీ గట్టిగా పోరాడుతోంది. సుధాకర్ మరణానికి జగన్ సర్కార్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఏకంగా విశాఖ వచ్చి మరీ లోకేష్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు.  జగన్ సర్కార్ దళితులకు వ్యతిరేకమని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి చూస్తే దళిత కార్డుతోనే జగన్ ని దెబ్బ కొట్టాలని టీడీపీ చూస్తోంది. మరి దీన్ని ఎంతవరకూ వైసీపీ ఎదుర్కొంటారు అన్నది చూడాలి. ఏది ఏమైనా టీడీపీ పవర్ ఫుల్ కార్డే బయటకు తీసింది. ఇది ఏ విధంగా వైసీపీని ఇబ్బంది పెడుతుంది అన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో  సాగుతోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ కోసం భారీ స్కెచే ప్లాన్ చేసాడట ..... ??

మాస్ రాజా కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాడు ..... ??

డిజాస్టర్ మూవీస్ అయినా కూడా రికార్డు వ్యూస్

"బంగార్రాజు" కి నో చెప్పిన బోల్డ్ బ్యూటీ

కన్నడ సూపర్ స్టార్ కోరిక.. సీఎం అవ్వాలని ఉందట.. !!

ఆ దర్శకుడే మళ్ళీ మళ్ళీ కావాలి అంటున్న నిర్మాతలు

త్రివిక్రమ్ - మహేష్ సినిమా అంతా ఆ దేశంలోనే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>