Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raghavendra-rao-k3c5232c9-a974-4675-bec0-d66ff55eb585-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/raghavendra-rao-k3c5232c9-a974-4675-bec0-d66ff55eb585-415x250-IndiaHerald.jpgకొంతమంది దర్శకులకు సూపర్ డైరెక్టర్లుగా పేరుంటుంది. మరికొంతమంది హీరోలకు స్టార్ హీరోలుగా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్లు వేరు వేరుగా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఉండొచ్చు. ఆ దర్శకుడు ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చి ఉండొచ్చు. అలాగే ఈ హీరో కూడా హిట్‌లు కొడుతూ దూసుకుపోతూ ఉండవచ్చు. కానీ ఇంతటి సూపర్ ఫాంలో ఉన్నా.. వాళ్లిద్దరూ కలిస్తే మాత్రం సినిమాలు ఆడవు. అలాంటి వారిలో..raghavendra-rao-k;chiranjeevi;ntr;balakrishna;apoorva;krishna;paandu;ramu;cinema;nandamuri balakrishna;blockbuster hit;remake;hero;thief;nandamuri taraka rama rao;nijam;donga;massబాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!raghavendra-rao-k;chiranjeevi;ntr;balakrishna;apoorva;krishna;paandu;ramu;cinema;nandamuri balakrishna;blockbuster hit;remake;hero;thief;nandamuri taraka rama rao;nijam;donga;massSun, 23 May 2021 10:17:00 GMTకొంతమంది దర్శకులకు సూపర్ డైరెక్టర్లుగా పేరుంటుంది. మరికొంతమంది హీరోలకు స్టార్ హీరోలుగా గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి వాళ్లు వేరు వేరుగా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఉండొచ్చు. ఆ దర్శకుడు ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చి ఉండొచ్చు. అలాగే ఈ హీరో కూడా హిట్‌లు కొడుతూ దూసుకుపోతూ ఉండవచ్చు. కానీ ఇంతటి సూపర్ ఫాంలో ఉన్నా.. వాళ్లిద్దరూ కలిస్తే మాత్రం సినిమాలు ఆడవు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకొవాలంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించే చెప్పుకోవాలి. ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్‌లు ఇచ్చిన రాఘవేంద్రరావు బాలకృష్ణతో మాత్రం ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయారు. నమ్మలేకుండా ఉన్నా ఇది నిజం.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సీనియర్ ఎన్టీఆర్‌తో 12 సినిమాలు చేశారు. అన్నీ సూప‌ర్ డూప‌ర్ హిట్స్. ఎన్టీఆర్‌తో పాటు శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, మోహ‌న్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేష్ స‌హా టాప్ హీరోలందరితో ఆయన ప‌నిచేశారు. ఎన్నో మంచి హిట్స్ అందించారు. వాళ్లందరినీ టాప్ హీరోలుగా తీర్చిదిద్దారు. అయితే నంద‌మూరి బాల‌కృష్ణ‌కు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా స‌రైన హిట్ ఇవ్వ‌లేకపోయారు. బాల‌కృష్ణ‌తో రాఘ‌వేంద్ర‌రావు మొత్తం 7 సినిమాలు తీశారు. వీటిలో ఒక్క‌టి కూడా హిట్ కాలేదు. రాఘ‌వేంద్రుడితో బాల‌య్య తొలి చిత్రం రౌడీ రాముడు కొంటె కృష్షుడు. ఎన్టీఆర్ మెయిన్ హీరో కాగా.. ఆయన త‌మ్ముడి క్యారెక్ట‌ర్ బాల‌కృష్ణ పోషించాడు. ఈ సినిమాకు నిర్మాత‌గా ఎన్టీఆర్ స్వయంగా వ్యవహరించారు. కానీ సినిమా హిట్ కాలేదు.

ఇక రెండో మూవీ ప‌ట్టాభిషేకం. ఈ మూవీ పూర్తయ్యేనాటికి బాల‌య్యకు మాస్ ఫ్యాన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది. ‘మంగ‌మ్మ గారి మ‌నువ‌డు సినిమాతో’ సూప‌ర్ హిట్ అందుకుని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇలాంటి సందర్భంలో వచ్చిన సినిమా అయినా.. ప‌ట్టాభిషేకం స‌రైన విజ‌యం సాధించ‌లేదు. ఆ త‌ర్వాత బాల‌య్య‌తో రాఘవేంద్ర‌రావు అపూర్వ సోద‌రులు సినిమాను తెరకెక్కించారు. ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ త‌ర్వాత సాహ‌స సామ్రాట్ మూవీ వ‌చ్చింది. ఈ సినిమాతో బాల‌కృష్ణ - విజ‌య‌శాంతి పెయిర్ సూపర్ హిట్ అయింది. కానీ సినిమా ప్లాఫ్ అయింది. ఆ త‌ర్వాత వీరిద్దరి కాంబినేషన్లో దొంగ రాముడు సినిమా రాగా.. అది కూడా బాక్లాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా వరుస ఫ్లాప్‌లు రావడంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో నెగెటివ్ టాక్ వచ్చింది. నిర్మాత‌లు కూడా వీరిద్దరితో సినిమాలు తీయాలంటే వెనుకడుగువేశారు. దీంతో ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో చాలా సంవత్సరాలు సినిమాలు రాలేదు. అయితే ఎట్టకేలకు మళ్లీ  1992లో అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో అశ్వ‌మేధ ‌యాగం తెరకెక్కింది. శోభ‌న్ బాబు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కానీ క‌థ దెబ్బతినడంతో ఈ సినిమా సైతం ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా ప్రయత్నించలేదు. ఇద్దరూ వేరు వేరుగా సినిమాలు తీసుకుంటూ వెళ్లారు.

కానీ దాదాపు 16 ఏళ్ల త‌ర్వాత బాల‌కృష్ణ హీరోగా త‌న సొంత బ్యాన‌ర్‌పై రాఘ‌వేంద్ర‌రావు నిర్మించిన చిత్ర పాండురంగ‌డు. సీనియర్ ఎన్టీఆర్ పాండురంగ మ‌హ‌త్యానికి రీమేక్ ఇది. స్నేహ‌, ట‌బు హీరోయిన్లుగా భారీ అంచ‌నాల‌తో రూపొందిన ఈ సినిమా కూడా బాక్లాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది.  దీంతో వేరువేరుగా సూపర్ హిట్ అయినా.. వీరి కాంబినేష‌న్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా  సూప‌ర్ హిట్ కాక‌పోవ‌డం నిజంగా విడ్డూరమనే చెప్పాలి.

కాగా.. పాండురంగడుసినిమాలో బాలయ్య తండ్రిగా కే విశ్వ‌నాథ్ ఈ సినిమాలో న‌టించారు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌నాథ్ న‌టించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??

రాఘవేంద్రరావు సినిమా వాడని పండు ఏంటో తెలుసా..?

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>