PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/trs-eetala-kcr-harishrao6fcdad0d-3f52-49dd-baf7-af16a8c979d5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/trs-eetala-kcr-harishrao6fcdad0d-3f52-49dd-baf7-af16a8c979d5-415x250-IndiaHerald.jpg ఈటెల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేయాల‌నే కృత‌నిశ్చ‌యంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి పావులు క‌దుపుతోంది. హుజూరాబాద్‌లో ఈటెల‌ను బ‌ల‌హీన‌ప‌రిస్తే జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు సులువ‌వుతంద‌ని భావిస్తోంది. అలాగే పార్టీ నుంచి కేడ‌ర్ జారిపోకుండా ఉండేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు స్థానిక నాయ‌కుల‌తో స‌మావేశాలు, చ‌ర్చ‌లు జ‌రిపిన టీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. పార్టీ ఏర్పాటైన‌ప్ప‌టినుంచి ఎటువంటి సంక్షోభం త‌లెత్తినా వాటిని ప‌రిష్క‌రిస్తూ వtrs, eetala, kcr, harishrao;kcr;kamalakar;telangana rashtra samithi trs;gangula kamalakar;telangana;minister;local language;partyఉప ఎన్నిక జ‌రిగితే ఈటెల‌పై టీఆర్ఎస్ గెల‌వ‌గ‌ల‌దా?ఉప ఎన్నిక జ‌రిగితే ఈటెల‌పై టీఆర్ఎస్ గెల‌వ‌గ‌ల‌దా?trs, eetala, kcr, harishrao;kcr;kamalakar;telangana rashtra samithi trs;gangula kamalakar;telangana;minister;local language;partySun, 23 May 2021 08:01:41 GMT
ఈటెల రాజేంద‌ర్‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేకుండా చేయాల‌నే కృత‌నిశ్చ‌యంతో తెలంగాణ రాష్ట్ర స‌మితి పావులు క‌దుపుతోంది. హుజూరాబాద్‌లో ఈటెల‌ను బ‌ల‌హీన‌ప‌రిస్తే జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు సులువ‌వుతంద‌ని భావిస్తోంది. అలాగే పార్టీ నుంచి కేడ‌ర్ జారిపోకుండా ఉండేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు స్థానిక నాయ‌కుల‌తో స‌మావేశాలు, చ‌ర్చ‌లు జ‌రిపిన టీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. పార్టీ ఏర్పాటైన‌ప్ప‌టినుంచి ఎటువంటి సంక్షోభం త‌లెత్తినా వాటిని ప‌రిష్క‌రిస్తూ వ‌స్తోన్న మంత్రి హ‌రీష్‌రావుకే హుజూరాబాద్ బాధ్య‌త‌లు కూడా అప్ప‌జెప్పింది. రంగంలోకి దిగిన హ‌రీష్‌రావు వెంట‌నే త‌న ప‌ని ప్రారంభించారు. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.

పార్టీ శ్రేణులు జారిపోకుండా ప్ర‌య‌త్నాలు
హుజూరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలోనే ఈటెల ధీటైన నేత‌. ఆయ‌న్ను ఎదుర్కోవాలంటే జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల‌ని టీఆర్ ఎస్ అధిష్టానం భావిస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఈటెల‌కు మ‌ద్ద‌తు లేకుండా చేయాలనే లక్ష్యంతో హరీష్రావు ఆపరేషన్ మొదలుపెట్టారు. మంత్రి గంగుల కమలాకర్ స్థానిక నేత‌ల‌తో విడతల వారీగా చర్చలు జరిపారు. ఎవరూ టీఆర్ఎస్‌ను వీడ‌కుండా   జాగ్రత్త పడుతున్నారు. ఈటెలపై ఇప్పటి వరకు పార్టీపరంగా చర్యలు తీసుకోకపోయినా.. ముందు జాగ్రత్తగా ప్రతివ్యూహం రచిస్తోంది. అనుకున్న ప్ర‌ణాళిక‌ను మరింత ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు ట్రుబుల్ షూటర్ హ‌రీష్రావును రంగంలోకి దింపింది.

నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి ఏంటి?
ఈటెల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే అక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం అనివార్యం. అప్ప‌డు ఎలా ప‌ట్టు నిలుపుకోవాల‌నే అంశంపైనే పార్టీ దృష్టిసారించింది. ఏ ప‌ని అప్పగించినా దాన్ని సమర్థంగా నిర్వహిస్తారనే విశ్వాసం కేసీఆర్ హ‌రీష్‌పై ఉంది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకురావ‌డం హ‌రీష్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన హ‌రీష్‌రావు హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో వరుస సమీక్షలు జరుపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి ఏంటి?  శ్రేణుల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? అభివృద్ధి ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయి? ఉప ఎన్నిక అనివార్య‌మైతే టీఆర్ ఎస్ గెల‌వ‌డం ఖాయ‌మేనా?  నాయ‌కుల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? ఈటెల వెంట వెళ్లేవారెవ‌రు?  పార్టీలోనే ఉండేవారెవ‌రు? త‌దిత‌ర విష‌యాల‌న్నీ ఆయ‌న కూలంకుషంగా చ‌ర్చిస్తున్నారు. టీఆర్ఎస్‌ను వీడివెళ్ల‌మంటూ పార్టీ శ్రేణులు హ‌రీష్‌రావుకు హామీ ఇస్తున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>