Upendra: ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నా..నన్ను గెలిపిస్తారా?: సూపర్ స్టార్ సూటి ప్రశ్న

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి..

వచ్చే ఏడాది కర్ణాటక.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. దీనికోసం అన్ని పార్టీలూ సమాయాత్తమౌతోన్నాయి. అధికార భారతీయయ జనతా పార్టీ, కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) ఈ దిశగా కసరత్తు ఆరంభించాయి. వాటితో పాటు ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధినేతగా ఉపేంద్ర కూడా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయాలా? వద్దా? అనే విషయాన్ని ఆయన ప్రజలకే వదిలేశారు. దీనిపై ఆయన కన్నడిగులకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సహజంగా ఉపేంద్ర సినిమాల్లో ఉండే సూటితత్వం.. ఈ లేఖలో ప్రతిబింబించింది.

ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా..

ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా..

తన రాజకీయ రంగ ప్రవేశం ఉద్దేశమేంటో సూటిగా తేల్చేశారు. ఎక్కడా దాపరికాలకు పోలేదు. కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాననంటూ ఆయన తన లేఖను ప్రారంభించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలిపిస్తారా? అంటూ నేరుగా ప్రశ్నించారు. తాను ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాననే సారాంశాన్ని ఈ లేఖలో పొందుపరిచారు. ఇప్పటిదాకా ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఇందులో వివరించారు. ఆహార వస్తువులను తాను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి.. పేదలకు అందిస్తున్నానని చెప్పారు.

అధికార, ప్రతిపక్షాలు వైఫల్యం..

కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రజల ఆదరణను కోల్పోయాయనేది స్పష్టమౌతోందని ఉపేంద్ర పేర్కొన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ పరస్పరం విమర్శలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తోన్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఉత్తమ ప్రజాకీయ పార్టీని చైతన్యవంతం చేస్తానని, పూర్తిస్థాయిలో ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలిపిస్తారా? అని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తే.. రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తానని, కర్ణాటకను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. ఓటర్లు తనను ఎన్నుకుంటారో.. లేదో తెలియదని పేర్కొన్నారు.

రాజకీయానికి, ప్రజాకీయానికీ అదే తేడా..

రాజకీయానికి, ప్రజాకీయానికీ అదే తేడా..

ఈ సందర్భంగా ఆయన రాజకీయానికి, ప్రజాకీయానికి ఉన్న తేడాను వివరించారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నాయకులు.. నాయకులుగా మారుతారని, ప్రజాకీయంలో సామాన్య ప్రజలే నాయకులుగా తయారవుతారని చెప్పారు. వారికి రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోనక్కర్లేదని, ప్రజాలకు సేవకుడిగా ఉంటారని అన్నారు. రాజకీయ నాయకుల తరహాలో వారెవరూ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించబోరని హామీ ఇచ్చారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటారని అన్నారు.

ఎన్నుకొన్న తరువాత..పార్టీ ఫిరాయిస్తే.. రీకాల్

ఎన్నుకొన్న తరువాత..పార్టీ ఫిరాయిస్తే.. రీకాల్

తమ పార్టీకి చెందిన వ్యక్తిని ప్రజలు ఎన్నుకొన్న తరువాత.. అతను పార్టీ ఫిరాయిస్తే.. అతనికి వ్యతిరేకంగా తాను సైతం పోరాడతానని ఉపేంద్ర స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నా సరే.. పార్టీ ఫిరాయించిన నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. దీనికోసం అవసరమైతే రీకాల్ వ్యవస్థను ప్రవేశపెడతానని తేల్చి చెప్పారు. ఒక్కసారి తనకు అధికారాన్ని అప్పగిస్తే.. శాశ్వతంగా ప్రజలకు దగ్గరగా ఉంటానని, సీఎం అంటే కామన్ మ్యాన్ అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని అన్నారు. తమకు కామన్ మ్యాన్ అవసరం లేదని ఓటర్లు భావిస్తే.. ఎవరిని ఎన్నుకుంటారనేది వారిష్టమని అన్నారు.

Source | Oneindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *