PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona93172648-03e1-4ce7-93c0-e117be308e3d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona93172648-03e1-4ce7-93c0-e117be308e3d-415x250-IndiaHerald.jpgక‌రోనా రెండోద‌శ‌లో ఉధృతంగా వ్యాపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా యువ‌త‌ను, న‌డివ‌య‌సువారిని ఈ ద‌శ‌లో ల‌క్ష్యంగా ఎంచుకుంది. రెండోద‌శ‌లో ఏప్రిల్‌, మే నెలల్లో 50 సంవ‌త్స‌రాల్లోపువారు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య పెరిగిందని, అలాగే ఐసీయూలో చేరుతున్నవారి సగటు వయసు కూడా తక్కువగానే ఉంటోంద‌ని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ రెండోద‌శ‌లో యువతీ యువకులు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. 60-70 శాతం వరకు 60 సంవ‌త్corona;central government;international;aprilముంద‌స్తు ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డ‌మే ప్రాణాల‌కు ముప్పు?ముంద‌స్తు ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డ‌మే ప్రాణాల‌కు ముప్పు?corona;central government;international;aprilSun, 23 May 2021 15:50:00 GMT

క‌రోనా రెండోద‌శ‌లో ఉధృతంగా వ్యాపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా యువ‌త‌ను, న‌డివ‌య‌సువారిని ఈ ద‌శ‌లో ల‌క్ష్యంగా ఎంచుకుంది. రెండోద‌శ‌లో ఏప్రిల్‌, మే నెలల్లో 50 సంవ‌త్స‌రాల్లోపువారు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య పెరిగిందని, అలాగే ఐసీయూలో చేరుతున్నవారి సగటు వయసు కూడా తక్కువగానే ఉంటోంద‌ని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్ రెండోద‌శ‌లో యువతీ యువకులు అధిక సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. 60-70 శాతం వరకు 60 సంవ‌త్స‌రాల్లోపువారే ఉంటున్నారు. అందులోను స‌గానికిపైగా 45 సంవ‌త్స‌రాల్లోపువారే ఉంటున్నార‌ని వైద్యులు వెల్ల‌డిస్తున్నారు.

కార‌ణాలేంటి?
ఎలాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేని 45 సంవ‌త్స‌రాల్లోపువారు అధికసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. ఇందుకు ప్రధానంగా వైద్యులు మూడు కారణాలను చెబుతున్నారు. ఒకటి హ్యాపీ హైపోక్సియా. దీనివల్ల ఆక్సిజన్‌ స్థాయిలు భారీగా తగ్గినా యువతలో ముందస్తు లక్షణాలు కనిపించడం లేదు. తీరా ఆరోగ్యం విషమించాక ఆసుప‌త్రిలో చేరడం వల్ల అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోంద‌ని వైద్యులు చెబుతున్నారు. రెండోది, యువత ఎక్కువగా బయట తిరగడంతోపాటు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం. దీనివల్ల వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉంటోందంటున్నారు. మూడో కారణం.. వైరస్‌ ఉత్పరివర్తనం చెందడం. ఇది వేగంగా వ్యాపించడంతోపాటు యువతకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంద‌ని చెబుతున్నారు.

టీకాలే రక్ష‌ణ‌
ప్ర‌స్తుతానికి 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన‌వారికి టీకాలిస్తున్నార‌ని, ఈ కార్య‌క్ర‌మం వేగ‌వంతం చేయ‌డంతోపాటు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన‌వారికి కూడా టీకాలిచ్చే కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వ్వాల‌ని, అప్పుడే ప్ర‌జ‌లంతా ధైర్యంగా ఉండ‌గ‌ల‌ర‌ని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ కొనుగోళ్లతోపాటు, అంతర్జాతీయ టీకా సహకార ప్రాజెక్టు అయిన కొవాక్స్‌ కవరేజీని కూడా కలుపుకుంటే వచ్చే ఏడాది తొలి అర్ధభాగానికి 25 శాతానికిపైగా జనాభాకు వ్యాక్సిన్‌ వేయవచ్చంటున్నారు. 60 శాతం జనాభాకు టీకాలివ్వాలంటే తక్షణమే భారత ప్రభుత్వం 100 కోట్లకుపైగా వ్యాక్సిన్ల‌కు ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటోంద‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ కూడా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరాచకం...!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>