PoliticsThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-carona-virus-news1bcbb261-c14c-4310-9dbc-6d945d3ef6ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-carona-virus-news1bcbb261-c14c-4310-9dbc-6d945d3ef6ef-415x250-IndiaHerald.jpgగ‌డిచిన 24గంట‌ల్లో 2.57ల‌క్ష‌ల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త ఆరురోజులుగా వ‌రుస‌గా మూడు ల‌క్ష‌ల‌లోపు కేసులు రావ‌డం కొవిడ్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంద‌న‌టానికి మ‌రో కార‌ణం. దేశ‌వ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతంపైగానే ఉంద‌ని, దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని తాజా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. 18 రాష్ట్రాల్లో 15శాతానికిపైగా పాజిటివిటీ రేటు న‌మోద‌వుతోంద‌ని ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ అన్నాడు. రోజురోజుకు క‌రోనా టెస్టుcoronavirus, carona virus news;kcrగుడ్ న్యూస్‌.. త‌గ్గుతున్న క‌రోనా ఉధృతి.. పెరిగిన రిక‌వరీ రేటుగుడ్ న్యూస్‌.. త‌గ్గుతున్న క‌రోనా ఉధృతి.. పెరిగిన రిక‌వరీ రేటుcoronavirus, carona virus news;kcrSun, 23 May 2021 07:01:00 GMTదేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుందా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తుంది. ఈ వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఆర్థికంగా చితికిపోతున్నారు. వైర‌స్ సోకి ఆస్ప‌త్రుల బాట ప‌డుతుండ‌టంతో పాటు ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నాయి. మ‌రోవైపు టీకా పంపిణీ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి 24.83 శాతంగా ఉన్న క‌రోనా కేసుల పాజిటివిటీ రేటు మే 22 నాటికి 12.45 శాతానికి దిగిరావ‌డ‌మే ఇందుకు తార్కాణం.

గ‌డిచిన 24గంట‌ల్లో 2.57ల‌క్ష‌ల క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త ఆరురోజులుగా వ‌రుస‌గా మూడు ల‌క్ష‌ల‌లోపు కేసులు రావ‌డం కొవిడ్ వ్యాప్తి త‌గ్గుముఖం ప‌డుతుంద‌న‌టానికి మ‌రో కార‌ణం. దేశ‌వ్యాప్తంగా 382 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతంపైగానే ఉంద‌ని, దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ల‌క్ష‌కుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని తాజా గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. 18 రాష్ట్రాల్లో 15శాతానికిపైగా పాజిటివిటీ రేటు న‌మోద‌వుతోంద‌ని ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ అన్నాడు. రోజురోజుకు క‌రోనా టెస్టుల సంఖ్యను పెంచుతున్న‌ప్ప‌టికీ పాజిటివిటీ రేటు త‌గ్గుతూ వ‌స్తోంద‌ని ఆయ‌న తెలిపాడు. ఐసీఎంఆర్ గ‌ణాంకాలుసైతం కొవిడ్ తీవ్ర‌త దేశ‌వ్యాప్తంగా త‌గ్గుతూ వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

తెలంగాణ‌లోనూ క‌రోనా వైర‌స్‌తో చికిత్స పొందుతున్న‌వారి రిక‌వ‌రీ రేటు పెరుగుతూ వ‌స్తుంది. గ‌త ప‌క్షం రోజుల క్రితం వ‌ర‌కు చేసిన టెస్టుల్లో 10శాతం వ‌ర‌కు పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కానీ ప్ర‌స్తుతం 5 నుంచి 6శాతం మందికే వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అవుతుంది. మ‌రోవైపు రిక‌వ‌రీ రేటు గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. తెలంగాణ‌లో 91.33శాతం పాజిటివ్ కేసుల రిక‌వ‌రీ ఉన్న‌ట్లు గ‌ణాంకాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈనెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 66.087 మంది కొవిడ్ -19 బారిన ప‌డ్డారు. అదే స‌మ‌యంలో 94,993 మంది రిక‌వ‌రీ అయ్యారు. దీనిని బ‌ట్టి పాజిటివిటీ కంటే రిక‌వ‌రీ రేటు ఒక‌టిన్న‌ర రెట్లు అధికంగా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌రోవైపు కొవిడ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డానికి లాక్‌డౌన్ కూడా కార‌ణంగా ప్ర‌భుత్వ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ లాక్‌డౌన్‌ను మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని పోలీస్‌శాఖ‌, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 30వ‌ర‌కు ప‌క‌డ్బందీగా లాక్‌డౌన్ చేప‌డితే కొవిడ్ తీవ్ర‌త భారీగా త‌గ్గుతుంద‌న్న భావ‌నను వైద్య‌శాఖ అధికారులు వ్య‌క్తంచేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>