PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp30138f88-0c02-43af-ac94-593ab3bd61b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp30138f88-0c02-43af-ac94-593ab3bd61b2-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లా టీడీపీ అనగానే కమ్మ నేతలు ఎక్కువగా గుర్తొస్తారు. ఇక్కడ ఎక్కువగా వారిదే పెత్తనం ఉంటుంది. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కమ్మ నాయకులదే హవా. ముఖ్యంగా నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు కమ్మ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.tdp;jr ntr;sridhar;kamma;jagan;kodela siva prasada rao;2019;district;assembly;mla;cycle;tdp;sattenapalle;prathipati pullarao;chilakaluripeta;petta;dookudu;pedakurapadu;vinukonda;narasaraopeta;gurazala;macherla;parlimentఆ ఐదుగురు కమ్మ నేతలు సైకిల్ స్పీడ్ పెంచుతున్నారా?ఆ ఐదుగురు కమ్మ నేతలు సైకిల్ స్పీడ్ పెంచుతున్నారా?tdp;jr ntr;sridhar;kamma;jagan;kodela siva prasada rao;2019;district;assembly;mla;cycle;tdp;sattenapalle;prathipati pullarao;chilakaluripeta;petta;dookudu;pedakurapadu;vinukonda;narasaraopeta;gurazala;macherla;parlimentSun, 23 May 2021 04:00:00 GMTగుంటూరు జిల్లా టీడీపీ అనగానే కమ్మ నేతలు ఎక్కువగా గుర్తొస్తారు. ఇక్కడ ఎక్కువగా వారిదే పెత్తనం ఉంటుంది. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో కమ్మ నాయకులదే హవా. ముఖ్యంగా నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో ఉండే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు కమ్మ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.


నరసారావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసారావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాలు ఉన్నాయి. మాచర్ల, నరసారావుపేటలు మినహాయిస్తే మిగిలిన ఐదు నియోజకవర్గాలని కమ్మ నేతలే నడిపిస్తున్నారు. వినుకొండలో జి‌వి ఆంజనేయులు, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు, సత్తెనపల్లిలో కోడెల శివరాంలు సైకిల్‌ని నడిపిస్తున్నారు.


2014 ఎన్నికల్లో ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది. కానీ 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలిలో ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే కోడెల శివప్రసాద్ మరణించడంతో సత్తెనపల్లి బాధ్యతలు ఆయన తనయుడు శివరాం చూసుకుంటున్నారు. కాకపోతే కోడెల అంతా ఎఫెక్టివ్‌గా శివరాం పనిచేయడం లేదు. దాని వల్ల సత్తెనపల్లిలో సైకిల్ స్పీడ్ పెరగలేదు. పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలే వచ్చాయి.


అటు చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, జూనియర్ ఎమ్మెల్యే అయిన విడదల రజిని ముందు తేలిపోతున్నారు. గురజాలలో యరపతినేని శ్రీనివాసరావు దూకుడుగానే ఉంటున్నారు. కానీ టీడీపీ పరిస్తితి మెరుగ్గా కనిపించడం లేదు. అటు వినుకొండలో జి‌వి ఆంజనేయులు, పెదకూరపాడులో శ్రీధర్‌లు బాగానే కష్టపడుతున్నారు.


పార్టీని నిలబెట్టడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కాకపోతే జగన్ హవా ఇంకా ఉండటంతో టీడీపీకి పుంజుకునే అవకాశాలు రావడం లేదు. జగన్ హవా వల్లే ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ కమ్మ నేతలకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ బలంగానే ఉంది. కాబట్టి పరిస్థితులు బట్టి సైకిల్ స్పీడ్ పెరిగే అవకాశముంది. చూడాలి మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఈ కమ్మ నేతలు సైకిల్‌ని గెలిపిస్తారో లేదో?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>