PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ycp-jagan-tdp-babu-ap750587c8-a1ee-4a4b-bc08-39d98074a42d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ycp-jagan-tdp-babu-ap750587c8-a1ee-4a4b-bc08-39d98074a42d-415x250-IndiaHerald.jpg మీ క‌ష్టాల‌న్నీ తీరిపోతాయి.. అన్నొస్తున్నాడ‌ని చెప్పండి.. అధికారంలోకి వ‌స్తే మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను.. అన్నారు. అధికారం వ‌చ్చింది. తిరుగులేని మెజారిటీ వ‌చ్చింది. 49.95 శాతంతో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 151 సీట్లు గెలుచుకోవ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. రెండు సంవ‌త్స‌రాల క్రితం స‌రిగ్గా ఇదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించి ఏపీలో అధికార ప‌గ్గాల్ని చేప‌ట్టింది. ఎంత మంది ఎమ్మెల్యేల్ని, ఎంపీల‌ని తెలుగుదేశం పార్టీ త‌న‌నుంచి దూరం చేసిందో స‌రిగ్గా అదే సంఖ్య‌లో ఎమ్మెల్యే సీట్ycp, jagan, tdp, babu, ap;poorna;tiru;telugu desam party;y. s. rajasekhara reddy;congress;mp;telugu;capital;court;assembly;mla;arrest;cemetery;thief;donga;party;amaravathi;mantraఅన్నొచ్చాడు.. మాట త‌ప్పాడు.. మ‌డ‌మ తిప్పాడు..!!అన్నొచ్చాడు.. మాట త‌ప్పాడు.. మ‌డ‌మ తిప్పాడు..!!ycp, jagan, tdp, babu, ap;poorna;tiru;telugu desam party;y. s. rajasekhara reddy;congress;mp;telugu;capital;court;assembly;mla;arrest;cemetery;thief;donga;party;amaravathi;mantraSun, 23 May 2021 13:22:00 GMT
మీ క‌ష్టాల‌న్నీ తీరిపోతాయి.. అన్నొస్తున్నాడ‌ని చెప్పండి.. అధికారంలోకి వ‌స్తే మాట త‌ప్ప‌ను.. మ‌డ‌మ తిప్ప‌ను.. అన్నారు. అధికారం వ‌చ్చింది. తిరుగులేని మెజారిటీ వ‌చ్చింది. 49.95 శాతంతో 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు 151 సీట్లు గెలుచుకోవ‌డం సామాన్య‌మైన విష‌యం కాదు. రెండు సంవ‌త్స‌రాల క్రితం స‌రిగ్గా ఇదే రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించి ఏపీలో అధికార ప‌గ్గాల్ని చేప‌ట్టింది. ఎంత మంది ఎమ్మెల్యేల్ని, ఎంపీల‌ని తెలుగుదేశం పార్టీ త‌న‌నుంచి దూరం చేసిందో స‌రిగ్గా అదే సంఖ్య‌లో ఎమ్మెల్యే సీట్లు, అన్నే ఎంపీ సీట్లు ఆ పార్టీకి ద‌క్క‌డం యాదృచ్ఛికం.

క‌రోనా స‌మ‌యంలో అరెస్ట్‌లు
మూడు రాజ‌ధానులంటూ ఉన్న రాజ‌ధానిని వ‌దులుకోవ‌డం.. అమూల్ కోసం డెయిరీల నిర్వీర్యం.. రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న ఇసుక కొర‌త‌.. అభివృద్ధి కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స‌పోయిన పారిశ్రామిక‌వేత్త‌లు.. రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు ఇద్ద‌రికీ త‌గ్గిపోయిన ఆదాయ వ‌న‌రులు.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుపై కేసుల ప‌రంప‌ర‌.. మాజీ మంత్రులు అచ్చ‌న్నాయుడు, కొల్లు ర‌వీంద్ర‌ల అరెస్ట్‌.. సంగం డెయిరీ కోసం ఆ సంస్థ చైర్మ‌న్ దూళిపాళ్ల న‌రేంద్ర అరెస్ట్‌.. సంక్షేమం పేరిట ప్ర‌జ‌ల ఖాతాల్లో నేరుగా సొమ్ములు.. ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్ల విజృంభ‌ణ‌.. ప్ర‌జాప్ర‌తినిధుల మాట‌ల్లో, చేత‌ల్లో లోపించిన గౌర‌వం.. అసెంబ్లీలో బూతుపురాణం విప్పిన‌వారికి సంపూర్ణ మ‌ద్ద‌తు.. మెడ‌లు వంచి తెస్తామ‌న్న ప్ర‌త్యేక హోదా ఎక్క‌డుందో తెలియ‌దు.. కొర‌వ‌డ్డ రాజీనామాస్త్రాలు.. ఒక‌టా? రెండా? ఈ త‌ర‌హా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు రాష్ట్రంలో కోకొల్ల‌లు అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

అమ‌రావ‌తి అంటే ఎడారి.. అమ‌రావ‌తి అంటే స్మ‌శానం
ప్రత్యేక హోదా సంగతి త‌ర్వాత‌.. రాష్ట్రానికి రాజధాని ఉందో లేదో తెలియని పరిస్థితి. అమరావతిలో రాజధాని అవసరం లేదని చెబుతోంది. ఆ పార్టీ నేత‌లు దాన్ని ఎడారిగా అభివర్ణిస్తారు.. స్మశానంగా పేర్కొంటారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాదు.. నిధులు రావు. పునరావాసం స‌మ‌స్య‌ల‌న్నీ ఎక్క‌డిక‌క్క‌డే ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం ఉక్కుక‌ర్మాగారం ఉంటుందా?  లేదా?  తెలియ‌దు.. క‌డ‌ప‌లో స్టీలు ప్లాంట్ రాలేదు.. ఆస్తుల‌న్నీ అంబానీ, అదానీలే కొల్ల‌గొట్టేస్తున్నా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి.  ఎంపీ అరెస్ట్ కేసుకు సంబంధించి కోర్టులో న్యాయ‌మూర్తుల‌నే అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ గ‌ద్దిస్తుంటారు. కోర్టుల నుంచి మొట్టికాయ‌లేకానీ మెచ్చ‌కోళ్లు లేవు..  ప్ర‌త్య‌ర్థుల మీద క‌క్ష సాధింపులేకానీ ప్రేమ‌తో ద‌గ్గ‌ర‌కు తీసిన ఆన‌వాళ్లు లేవు. రాబోయే రోజుల్లోనైనా ఏదైనా అద్భుతాలు జ‌రిగి రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుందేమోన‌నే చిన్న ఆశ అంద‌రిలో ఉంది. వారి ఆశ నెర‌వేరాల‌ని కోరుకుందాం.!!





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సెక్సీడ్రెస్‌లో సుహానా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అనన్య..?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

బన్నీ కెరీర్ కి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు ... !

ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>