NRISuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news71ec1d50-89e8-415c-b11e-7d04a3f6e77f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/nri-news71ec1d50-89e8-415c-b11e-7d04a3f6e77f-415x250-IndiaHerald.jpgభారత సంతతికి చెందిన ఎన్నో ఆర్గనైజేషన్లు, వ్యాపార కంపెనీలు కరోనా సెకండ్ వేవ్ తో పోరాడుతున్న ఇండియాకి అండగా నిలుస్తున్నాయి. ప్రవాసులు భారత్ కరోనాపై చేస్తున్న పోరులో మద్దతుగా నిలుస్తూ కరోనా చికిత్సకు సంబంధించిన వైద్య సామాగ్రిని, డబ్బులను పంపిణీ చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది ఎన్నారైల నుంచి సహాయం అందుతోంది. తాజాగా సూర్యాపేటకు చెందిన ఒక ఎన్నారై ప్రభుత్వ ఆసుపత్రికి పది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ఒక్కరే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భారతీయులు సహాయం అందించేందుకుnri news;health;nri;bharath;india;sri bharath;sardar vallabhai patel;oxygen;indianకాలిఫోర్నియాలో విరాళాలు సేకరిస్తున్న ఎన్నారైలు..?కాలిఫోర్నియాలో విరాళాలు సేకరిస్తున్న ఎన్నారైలు..?nri news;health;nri;bharath;india;sri bharath;sardar vallabhai patel;oxygen;indianSun, 23 May 2021 09:00:00 GMTభారత్ కరోనాపై చేస్తున్న పోరులో మద్దతుగా నిలుస్తూ కరోనా చికిత్సకు సంబంధించిన వైద్య సామాగ్రిని, డబ్బులను పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కూడా చాలామంది ఎన్నారైల నుంచి సహాయం అందుతోంది.

తాజాగా సూర్యాపేటకు చెందిన ఒక ఎన్నారై ప్రభుత్వ ఆసుపత్రికి పది ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ఒక్కరే కాదు ప్రపంచం నలుమూలల నుంచి భారతీయులు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన ప్రవాసులు కూడా తమ వంతు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు.


హిల్టన్ వరల్డ్‌వైడ్, మారియట్ ఇంటర్నేషనల్, ఛాయిస్ హోటల్స్, రమడా హోటల్స్, హాలిడే ఇన్, హయత్ వంటి వివిధ కంపెనీల ద్వారా భారతదేశంలోని హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చేందుకు క్యాలిఫోర్నియాలోని భారతీయులు నడుంబిగించారు. సిక్కు, హిందూ దేవాలయాలు, చర్చిల తదితర మత సంస్థల ద్వారా కూడా నిధులు సేకరిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ వ్యాపారవేత్తలు ఇండియాకు అండగా ఉండాలని.. ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని కాలిఫోర్నియాలోని ఆధ్యా అనే ఓ ఇండియన్ రెస్టారెంట్ యజమాని చెప్పుకొచ్చారు. భారత్ కి సహాయ సహకారాలు అందించేందుకు ఆధ్యా రెస్టారెంట్స్ ఇప్పటికే దాదాపు 30 వేల డాలర్లు సేకరించింది.



ఇకపోతే లాస్ ఏంజెలెస్ లో నివసిస్తున్న భారతీయ డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్లను ఇండియాకి పంపించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. తాము 5 లక్షల డాలర్ల విరాళాలు సేకరించామని అసోసియేషన్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ALAPIO) వ్యవస్థాపకుడు డా. భరత్ పటేల్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. 10 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లను 500కు పైగా కొనుగోలు చేశామని వాటిని త్వరలోనే భారతదేశానికి పంపిస్తామని డా. భరత్ పటేల్ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మే లో 12 వ సారి పెట్రో 'మంట'

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>