PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-harish-rao-99764cab-8e43-44a6-923b-b9b45eda03c9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/minister-harish-rao-99764cab-8e43-44a6-923b-b9b45eda03c9-415x250-IndiaHerald.jpgకరోనా తన వ్యాప్తిని తీవ్రంగా చూపిస్తున్న ఈ తరుణంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం మరియు హాస్పిటల్ యాజమాన్యాలు కట్టుదిట్టంగా ఉండి కరోనాను కట్టడి చేయాల్సింది. కానీ తెలంగాణలోని కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా దొరికన అవకాశాన్ని వారికి అనుకూలంగా మరియు లాభాపేక్షతో ప్రజలు సొమ్మును హాస్పిటల్ బిల్స్ రూపంలో దోచుకుంటున్నారు. MINISTER HARISH RAO;kcr;telangana;district;government;media;minister;central government;sangareddy;nijamతెలంగాణ మంత్రి: ఆ హాస్పిటల్స్ పై కొరడా తప్పదు ... ?తెలంగాణ మంత్రి: ఆ హాస్పిటల్స్ పై కొరడా తప్పదు ... ?MINISTER HARISH RAO;kcr;telangana;district;government;media;minister;central government;sangareddy;nijamSun, 23 May 2021 11:00:00 GMTకరోనా తన వ్యాప్తిని తీవ్రంగా చూపిస్తున్న ఈ తరుణంలో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం మరియు హాస్పిటల్ యాజమాన్యాలు కట్టుదిట్టంగా ఉండి కరోనాను కట్టడి చేయాల్సింది. కానీ తెలంగాణలోని కొన్ని హాస్పిటల్స్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా దొరికన అవకాశాన్ని వారికి అనుకూలంగా మరియు లాభాపేక్షతో ప్రజలు సొమ్మును హాస్పిటల్ బిల్స్ రూపంలో  దోచుకుంటున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. దేశమంతా కరోనా ను అదుపు చేయడానికి తంటాలు పడుతుంటే ఈ పరిస్థితుల్లో కూడా మెడికల్ దందా ఆగడం లేదంటే ఏమనుకోవాలి. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు నిన్న మీడియా ముఖంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏవిధంగా అయితే ఉత్తర్వులు ఇచ్చిందో, ఆ ఉత్తర్వులను తప్పకుండా అన్ని హాస్పిటల్స్ పాటించాలని చెప్పారు. ఫీజులు వసూలు చేసే సమయంలో ఉత్తర్వులకు లోబడే ఉండాలని సూచించారు.

ఎవ్వరైనా రూల్స్ ను అతిక్రమించి ప్రజల నుండి అధికంగా ఫీజులు వసూలు చేస్తే అటువంటి హాస్పిటల్స్ పై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.  అంటే కాకుండా అటువంటి హాస్పిటల్స్ లైసెన్స్ లను రద్దు చేస్తామని చెప్పాడు. దీనికి సబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు. గత పది రోజులుగా బ్లాక్ ఫంగస్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని వారికి చెప్పడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కరోనా పరిస్థితులపై రెవెన్యూ మరియు వైద్యాధికారులతో మంత్రి హరీష్ రవ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు.

ఇందులో భాగంగా ఒక సామెతను గుర్తు చేశారు మంత్రి "అమ్మ తను పెట్టదు... అడుక్కు తిననివ్వదు" అని కేంద్రాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొదట్లో ఏమో వ్యాక్సిన్ లు అన్ని రాష్ట్రాలకు ఉచితంగా ప్పినే చేస్తామని చెప్పి ఇప్పుడేమో నేరుగా రాష్ట్రాలను ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేయమంటోంది. ఇలా మాట ఇచి తప్పడం సరి కాదని మంత్రి విమర్శించారు. ముందు కహి ఆ వ్యాక్సిన్ లకు కూడా కేసీఆర్ వంద కోట్లు అడ్వాన్స్ గా ఇస్తేనే వ్యాక్సిన్ ను పంపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ వ్యాక్సిన్ సమస్యకు త్వరలోనే  పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్: యువకుడి తాటతీసిన కలెక్టర్..

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>