PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu927fde02-fc4d-4cf8-a112-ce1d436784c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/babu927fde02-fc4d-4cf8-a112-ce1d436784c0-415x250-IndiaHerald.jpgచంద్రబాబును అంతా రాజకీయ చాణక్యుడు అంటారు. ఆయన వ్యూహాలు పదుని అయినవి అని కూడా పొగుడుతారు. ఇక చంద్రబాబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే తన మీద విపరీతమైన నమ్మకం. రేపటి మీద ఎక్కువ ధీమా. బహుశా ఆయన ఓడిపోయిన ప్రతీసారి అది టానిక్ లా పనిచేసి ఆలా బాబు ముందుకు తీసుకువెళ్తున్నారు అనుకోవాలేమో babu;view;cbn;tara;jagan;andhra pradesh;chanakya-movie-2019;telugu;chanakya;chief minister;ycpబాబుకే పేటెంట్ హక్కులు... ?బాబుకే పేటెంట్ హక్కులు... ?babu;view;cbn;tara;jagan;andhra pradesh;chanakya-movie-2019;telugu;chanakya;chief minister;ycpSun, 23 May 2021 21:00:00 GMTచంద్రబాబును అంతా రాజకీయ చాణక్యుడు అంటారు. ఆయన వ్యూహాలు పదుని అయినవి అని కూడా పొగుడుతారు. ఇక చంద్రబాబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే తన మీద విపరీతమైన నమ్మకం. రేపటి మీద ఎక్కువ ధీమా.

బహుశా ఆయన ఓడిపోయిన ప్రతీసారి అది టానిక్ లా పనిచేసి ఆలా బాబు ముందుకు తీసుకువెళ్తున్నారు అనుకోవాలేమో. తెలుగుదేశం పార్టీకి చూస్తే గత రెండేళ్ళుగా విజయాలు అసలు లేవు. అదే సమయంలో క్యాడర్ కూడా నిస్తేజంగా ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. పైగా ఆయన ప్రతీ రోజూ జగన్ మీద విమర్శలు చేయకుండా ఉండడంలేదు. జగన్ని ఏ విషయంలోనూ మెచ్చుకోని చంద్రబాబు చిన్న తప్పు జరిగినా కూడా గట్టిగానే గర్జిస్తారు అన్నది తెలిసిందే.

ఇదిలా ఉంటే జగన్ సీఎం గా రెండేళ్ల పాలన పూర్తి చేశారు. ఆయన పాలన మీద జాతీయ స్థాయిలో కూడా ఒక రకమైన  ఆసక్తి ఉంది. అనేక కీలక నిర్ణయలు, విప్లవాత్మకమైన నిర్ణయలను ఆయన తీసుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎపుడూ ఒకే మాట అంటున్నారు. జగన్ కి పాలన చేతకాదు, ఏ మాత్రం అనుభవం లేదు. ఆయన ఏలుబడిలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతోంది. ఏపీ ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అంటూ జగన్ మీద విరుచుకుపడుతున్నారు.

ఏపీని అప్పుల కుప్పగా జగన్ మార్చారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఏపీలో ఆదాయం అసలు లేదని, ప్రజల నెత్తిన అప్పు మాత్రం చాలా ఉందని అంటున్నారు. అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు తేల్చేది ఏంటి అంటే జగన్ కి పాలన చేతకాదు అని. అయితే బాబు పాలనే అద్వాన్నమని వైసీపీ నేతలు అంటున్నారు. అయినా కూడా పాలన అంటే తనదని, ఏపీని పాలించే పేటెంట్ హక్కులు అన్నీ తనకే ఉన్నాయని బాబు భావిస్తే తప్పులేదు కానీ జనం కూడా అలాగే అనుకోవాలని భావిస్తేనే పొరపాటేమో అంటున్నారు ఆయన వ్యతిరేకులు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యాస్ తుపాన్.. కరోనా రోగులకు ప్రాణ గండం?

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>