PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/putta-sudhakar-9031c602-88d7-4432-b71e-dc4098376198-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/putta-sudhakar-9031c602-88d7-4432-b71e-dc4098376198-415x250-IndiaHerald.jpgకడప జిల్లా వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ హవానే ఉంటుంది. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకునేది. ఇక జగన్ ఎంట్రీ ఇచ్చాక, జిల్లాలో వైసీపీ జెండా ఎగురుతుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది.putta sudhakar;raghu;sudhakar;jagan;y. s. rajasekhara reddy;congress;2019;district;kadapa;assembly;air;fort;tdp;ycp;mydukur;tirumala tirupathi devasthanamపుట్టాకు ఛాన్స్ వస్తుందా?పుట్టాకు ఛాన్స్ వస్తుందా?putta sudhakar;raghu;sudhakar;jagan;y. s. rajasekhara reddy;congress;2019;district;kadapa;assembly;air;fort;tdp;ycp;mydukur;tirumala tirupathi devasthanamSun, 23 May 2021 03:00:00 GMTకడప జిల్లా వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎన్నికలు జరిగిన జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ హవానే ఉంటుంది. గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకునేది. ఇక జగన్ ఎంట్రీ ఇచ్చాక, జిల్లాలో వైసీపీ జెండా ఎగురుతుంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 9 గెలిస్తే, టీడీపీ 1 గెలిచింది. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది.


ఈ విధంగా కడప జిల్లాలో వైఎస్సార్ ఫ్యామిలీ హవా ఉంటుంది. అయితే ఆ ఫ్యామిలీ హవాలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచి ఏళ్ళు గడిచిపోతున్నాయి. అలా టీడీపీ జెండా ఎగిరి ఏళ్ళు గడిచిపోయిన నియోజకవర్గాల్లో మైదుకూరు కూడా ఒకటి. టీడీపీ ఆవిర్భవించాక ఇక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచింది. 1985, 1999 ఎన్నికల్లో టీడీపీ తరుపున శెట్టిపల్లి రఘురామిరెడ్డి గెలిచారు. ఈ రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలవగా, ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది.


2014, 2019 ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. అది కూడా గతంలో టీడీపీలో రెండుసార్లు గెలిచిన శెట్టిపల్లి ఇప్పుడు వైసీపీ తరుపున గెలిచారు. ఇక గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ టీడీపీ తరుపున పుట్టా సుధాకర్ యాదవ్ పోటీ చేసి ఓడిపోతున్నారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో పుట్టాకు టీటీడీ ఛైర్మన్ పదవి దక్కింది. ఇక అధికారం ఉండటంతో నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.


కానీ జగన్ వేవ్ ఉండటంతో 2019 ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. అయితే నియోజకవర్గంలో పుట్టా బలపడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మైదుకూరులో టీడీపీ సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచినా, మైదుకూరులో 24 వార్డుల్లో టీడీపీ 12 గెలిచింది. అటు వైసీపీకి 11, జనసేనకు ఒక వార్డు వచ్చింది. వైఎస్సార్‌సీపీకి ఇద్ద‌రు ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌తో క‌లుపుకుంటే వైసీపీ బ‌లం 13కి పెరిగడంతో మైదుకూరు మున్సిపాలిటీ చేజారింది. అయితే ఎక్కువ వార్డులు గెలవడం టీడీపీకి కలిసొచ్చే విషయం. ఇదే ఊపు నెక్స్ట్ ఎన్నికల వరకు కొనసాగించి సత్తా చాటాలని పుట్టా చూస్తున్నారు. కానీ జగన్ వేవ్‌లో పుట్టాకు గెలిచే ఛాన్స్ దక్కుతుందా అనేది డౌటే.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?

చేసిన పాత్రతో విమర్శల ఎదుర్కొన్న నటులు వీరే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>