MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k1b90b021-245f-47c2-b6dd-fd62fab2ef7d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-k1b90b021-245f-47c2-b6dd-fd62fab2ef7d-415x250-IndiaHerald.jpgదర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈరోజు తన 79 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రాఘవేంద్రరావు తండ్రి కోవెలమూడి ప్రకాష్ రావు తెలుగులో చాలా సినిమాలు రూపొందించారు. మరోవైపు ఆయన భార్య గరికపాటి వరలక్ష్మి హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి అలరించారు. అందమైన రూపంతో మంచి అభినయంతో ఆమె అప్పటి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆమె ఒంగోలు లో పుట్టారు కానీ గుంటూరులోనే తన బాల్యం గడిపారు. ఆమె తండ్రి సన్యాసం స్వీకరించడంతో కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి చraghavendra-rao-k;ntr;rambha;abinaya;maya;prasad;guntur;tollywood;cinema;telugu;kollywood;marriage;chennai;comedy;wife;heroine;nandamuri taraka rama rao;father;manam;v;chitramరాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?raghavendra-rao-k;ntr;rambha;abinaya;maya;prasad;guntur;tollywood;cinema;telugu;kollywood;marriage;chennai;comedy;wife;heroine;nandamuri taraka rama rao;father;manam;v;chitramSun, 23 May 2021 11:00:00 GMTతండ్రి కోవెలమూడి ప్రకాష్ రావు తెలుగులో చాలా సినిమాలు రూపొందించారు. మరోవైపు ఆయన భార్య గరికపాటి వరలక్ష్మి హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించి అలరించారు. అందమైన రూపంతో మంచి అభినయంతో ఆమె అప్పటి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.


ఆమె ఒంగోలు లో పుట్టారు కానీ గుంటూరులోనే తన బాల్యం గడిపారు. ఆమె తండ్రి సన్యాసం స్వీకరించడంతో కుటుంబ పోషణ కోసం వరలక్ష్మి చిన్నతనం నుంచే విజయవాడలో ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసేవారు. అయితే అక్కడే ఆమెకు కోవెలమూడి ప్రకాష్ రావు పరిచయమయ్యారు. వారి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రకాష్ రావు, వరలక్ష్మి పెళ్లి చేసుకొని విజయవాడలో 2-3 సంవత్సరాల పాటు కాపురం చేశారు. 1948 లో మద్రాస్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే మద్రాసు వెళ్ళిన తర్వాత వరలక్ష్మికి సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. ఆమె మొట్టమొదటిగా వింధ్యరాణి అనే చిత్రంలో రేలంగి సరసన ఓ చిన్న కామెడీ పాత్రలో నటించారు. 1948లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ద్రోహి అనే సినిమాలో ప్రకాష్, వరలక్ష్మి కలిసి హీరోహీరోయిన్లుగా నటించారు. తదనంతరం ఈ దంపతులు ప్రకాష్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. ప్రకాష్ స్టూడియోస్ పేరిట ఒక స్టూడియో కూడా ప్రారంభించారు.



వరలక్ష్మి ఎన్టీఆర్ సరసన పెళ్లి చేసి చూడు సినిమా లో హీరోయిన్ గా కూడా నటించారు. ఈమె యుక్తవయసులో మాయ రంభ, మొదటి రాత్రి, స్వప్న సుందరి, దీక్ష, నిర్దోషి వంటి చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసారు.. కాస్త వయసు పైబడిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. గయ్యాలి మహిళా పాత్రలలో కూడా ఆమె చాలా చక్కగా నటించి ప్రశంసలు పొందారు. ఆమె తల్లి పాత్రలలో కూడా నటించి మెప్పించారు. టాలీవుడ్ పరిశ్రమలో మంచి పేరు దక్కించుకున్న ఆమె కోలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేశారు. అయితే ఆమె తన భావాలను కుండబద్దలు కొట్టినట్టు వ్యక్తపరుస్తారు అని చెబుతుంటారు. ఆమె తనకు నచ్చని పనులు చేసిన వారిని చెప్పుతో కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. రాఘవేంద్రరావు తల్లి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్: యువకుడి తాటతీసిన కలెక్టర్..

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..

రాఘవేంద్రరావు ప్రతి సినిమాలో పేరు పక్కన బీఏ అని ఎందుకు ఉంటుందంటే..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>