MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolly4236b543-0f9c-4370-a116-4df5cedff98a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tolly4236b543-0f9c-4370-a116-4df5cedff98a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ వయసు తొంబై ఏళ్ళు. ఏడాదికి వంద సినిమాలు తగ్గకుండా తీసే సత్తా టాలీవుడ్ కి ఉంది. ఆ విధంగా చూస్తే ఇప్పటికి కొన్ని వేల సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చాయనుకోవాలి. అలాగే టాలీవుడ్ టచ్ చేయని సబ్జెక్ట్ కానీ జోనర్ కానీ లేదని చెప్పాలి. tolly;nageshwara rao akkineni;hosta;tollywood;cinema;genre;heroineఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?tolly;nageshwara rao akkineni;hosta;tollywood;cinema;genre;heroineSun, 23 May 2021 19:00:00 GMTటాలీవుడ్ వయసు తొంబై ఏళ్ళు. ఏడాదికి వంద సినిమాలు తగ్గకుండా తీసే సత్తా టాలీవుడ్ కి ఉంది. ఆ విధంగా చూస్తే ఇప్పటికి కొన్ని వేల సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చాయనుకోవాలి. అలాగే టాలీవుడ్ టచ్ చేయని సబ్జెక్ట్ కానీ జోనర్ కానీ లేదని చెప్పాలి.

ఇక టాలీవుడ్ లో మొదట పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఆ తరువాత జానపదాలు, చివరిగా సాంఘికాలు వచ్చాయి. అయితే సాంఘీకాల పట్ల జనాలు మక్కువ కనబరచడంతో టాలీవుడ్ లో అవే వరసపెట్టి తీస్తూ 70 దశకం వచ్చేసరికి పూర్తిగా ఈ ఒక్క జోనర్ నే నమ్ముకున్నారు. ఇక ఇందులో కమర్షియల్ హంగులు అన్నీ అద్ది తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచారు.
ఇక పాటల విషయంలో గ్లామర్ పెంచినది కూడా 70 దశకం నుంచే అని చెప్పాలి. ఈ క్రమంలో వాన పాటలు కూడా ఎక్కువగా తీయడం మొదలైంది. అక్కినేని బి సరోజా దేవి నటించిన చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్న సాంగ్ తో వాన పాటల శకం మొదలైంది అనుకుంటే ఆ తరువాత ప్రతీ సినిమాలో ఆ పాటలను కచ్చితంగా ఉండాలని కూడా భావించిన మేకర్స్ ఉన్నారు.

అలాగే  హీరోయిన్ గ్లామర్ ని కూడా వాన పాటలలో పూర్తిగా ఎలివేట్ చేసుకోవడానికి వాడుకునేవారు. ఈ విషయంలో చాలా మంది దర్శకులు సిద్ధ హస్తులుగా పేరు గడించారు. డెబ్బై ఎనభై దశకాల్లో వచ్చిన సినిమాల్లో తప్పకుండా వాన పాటలు ఉండేవి. ఇక తొంబై దశకంలో వాణీ విశ్వనాధ్ లాంటి వారు వాన సుందరి గా పేరు గడించారు. ఆమె ఎక్కువగా  వాన పాటలలో నటించి మంచి గ్లామర్ ని అందించారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో వాన పాటలు పెట్టేవారు. ఇక 2000 దశకం తరువాత మాత్రం వాన పాటలను బాగా తగ్గించేశారు. ఇపుడు అయితే సినిమాల్లో వాన పాటలే లేని పరిస్థితి. ఎందుకు ఇలా అన్న మాటకు వస్తే వాన పాటలను తీయడం చాలా కష్టం. పైగా వ్యయ ప్రయాస‌లకు కూడా ఓర్చాలి. ఇక హీరోహీరోయిన్లు కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇన్ని రకాలైన బాధలు ఉన్నాయి కాబట్టే ఇప్పటి తరం వాన పాటలకు నో అంటోంది అంటున్నారు. అయితే పాత సినిమాల్లో వాన పాటలకు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది అన్నది వాస్తవం.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సూపర్ స్టార్ తో రాఘవేంద్ర రావు కాంబో కి ఉన్న ప్రత్యేకత అదే ... !!

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ

మోనాల్ కు షాక్.. ఆ షో చూడటం కంటే చావటం బెస్ట్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>