LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/insurence4cdf0a2f-29a0-4e6c-9b7d-9e5aa69a438c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/insurence4cdf0a2f-29a0-4e6c-9b7d-9e5aa69a438c-415x250-IndiaHerald.jpgకొందరు పనికిరాని ఖర్చుల కోసం వేలకు వేలు తగలేస్తుంటారు. కానీ బీమా పాలసీల విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం చూపిస్తారు. కానీ ఇది అసలే కరోనా కాలం. సెకండ్ వేవ్‌లో ఉదయం లేచింది మొదలు ఏదో ఒక దుర్వార్త వింటూనే ఉన్నాం. మనకు తెలిసినవారు, మన బంధువులు, స్నేహితులు, చివరకు మన కుటుంబ సభ్యులనే పోగొట్టుకుంటున్నాం. అలాగే చాలా మంది పోయిన తర్వాత, వారి కుటుంబ సభ్యులు సంపాదించే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితులు, ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు కూడా మన దృష్టికి వస్తున్నాయి. చాలా మంది ఎల్ఐసీ పాలసీలు కడుinsurence;health;koti;jeevitha rajaseskhar;vidya;vఅసలే ఇది కరోనా కాలం.. ఈ పాలసీ తీసుకోవడం మస్ట్‌..?అసలే ఇది కరోనా కాలం.. ఈ పాలసీ తీసుకోవడం మస్ట్‌..?insurence;health;koti;jeevitha rajaseskhar;vidya;vSun, 23 May 2021 00:00:00 GMTకొందరు పనికిరాని ఖర్చుల కోసం వేలకు వేలు తగలేస్తుంటారు. కానీ బీమా పాలసీల విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం చూపిస్తారు. కానీ ఇది అసలే కరోనా కాలం. సెకండ్ వేవ్‌లో ఉదయం లేచింది మొదలు ఏదో ఒక దుర్వార్త వింటూనే ఉన్నాం. మనకు తెలిసినవారు, మన బంధువులు, స్నేహితులు, చివరకు మన కుటుంబ సభ్యులనే పోగొట్టుకుంటున్నాం. అలాగే చాలా మంది పోయిన తర్వాత, వారి కుటుంబ సభ్యులు సంపాదించే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితులు, ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు కూడా మన దృష్టికి వస్తున్నాయి.

చాలా మంది ఎల్ఐసీ పాలసీలు కడుతూ ఉండొచ్చు. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చాలా  అవసరం. మనం పెట్టే సొమ్ము తిరిగిరాదు కాబట్టి చాలా మంది టర్మ్ జోలికి వెళ్లరు. రిటర్న్స్ ఆశించి కడుతున్న జీవిత బీమా పాలసీల్లో కవరేజి చాలా తక్కువ ఉంటుంది. మనపై ఆధారపడ్డవారు ఒక్కసారిగా రోడ్డున పడకుండా ఉండాలంటే, పెద్ద మొత్తంలోనే వారికి డబ్బు అందే పాలసీలు అవసరం.

ఆర్థిక నిపుణులు చెప్పే సూత్రం ప్రకారం - మన వార్షికాదాయానికి పది రెట్లు వచ్చేలా పాలసీలు కట్టాలి. ఉదాహరణకు ఏడాది జీతం రూ. 10 లక్షలు అయితే, రూ. 1 కోటికి టర్మ్ ఇన్సూరెన్సు తీసుకోవాలి. రూ. 1 కోటి పాలసీ కోసం మనం కట్టే ప్రీమియం మన వయస్సు, టర్మ్ కవరేజి పీరియడ్, ప్రీమియం కట్టే వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. టర్మ్ కవరేజి 85 ఏళ్ల వరకు కూడా ఆఫర్ చేస్తున్నాయి. కానీ కవరేజి పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది.

ప్రీమియం కట్టే వ్యవధి కూడా మనమే సెట్ చేసుకోవచ్చు. వ్యవధి పెంచేకొద్ది ప్రీమియం తగ్గుతుంది. కానీ మొత్తంగా చూస్తే మనం కట్టే ఎమౌంట్ పెరుగుతుంది. పదేళ్ల పాటు కట్టేసి, మరో 16 ఏళ్లు నెత్తి మీద టర్మ్ ఉంచుకోవడం బెటర్. పదేళ్ల తర్వాత పిల్లల ఉన్నత విద్య, తదితర ఖర్చులతో ప్రీమియం కట్టలేని పరిస్థితి వస్తే ఉన్న పాలసీ పనికిరాకుండా పోతుంది. మిమ్మల్ని నమ్ముకున్న వారి కోసం మీ సంపాదన పరిధిలో ఒక హెల్త్ పాలసీ, ఒక టర్మ్ పాలసీ తీసుకోండి. ఇప్పటికీ తీసుకోనివారు తప్పకుండా తీసుకోండి. అది మీ కుటుంబాలను కాపాడుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాధేశ్యామ్ సినిమా కోసం మరో పాట చేయబోతున్న ప్రభాస్..?

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>