MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-mohan-birthday-special-58281bd9-0fa3-45e0-9a20-b893c09505fa-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chandra-mohan-birthday-special-58281bd9-0fa3-45e0-9a20-b893c09505fa-415x250-IndiaHerald.jpgచంద్రమోహన్.. ప్రస్తుత తరానికి ఆయన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. ఒకానొక సమయంలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరుchandra mohan;sridevi kapoor;vijayashanti;jaggaiah;jayaprada;jayasudha;krishna;tara;cinema;scheduled caste;hero;girl;heroine;satyabhama;reddy;chitramఏడాదికి 20 సినిమా చేసి వారెవ్వా అనిపించిన చంద్రమోహన్..ఏడాదికి 20 సినిమా చేసి వారెవ్వా అనిపించిన చంద్రమోహన్..chandra mohan;sridevi kapoor;vijayashanti;jaggaiah;jayaprada;jayasudha;krishna;tara;cinema;scheduled caste;hero;girl;heroine;satyabhama;reddy;chitramSun, 23 May 2021 11:00:00 GMTచంద్రమోహన్.. ప్రస్తుత తరానికి ఆయన ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఊపు ఊపిన నటుడు. ఎన్నో సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్నారు. ఒకానొక సమయంలో మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో మంచి అనుభవం సంపాదించాడు. ఆ కారణం చేతనే సినిమా రంగం వైపు ఆయన అడుగులు పడ్డాయి.

బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుడు.. ఆయన పేరును చంద్రమోహన్ అని పెట్టారు. బి.యన్. రెడ్డి తెరకెక్కించిన  రంగులరాట్నం చిత్రంలో తెలుగు పరిశ్రమకు హీరోగా  పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలు చేశారు. ప్రతి పాత్రలో ఆయన జీవించే వారు.  నాటి మేటి నటులు యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు. తన తరం హీరోలయిన శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిత్రాలలోనూ ముఖ్య పాత్రలు చేశారు. ఏడాదికి ఇరవై చిత్రాల్లో నటించి వారెవ్వా అనిపించారు చంద్రమోహన్.

ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, చంద్రమోహన్ కు అన్న వరుస అవుతారు. ప్రతిభ లేకుంటే ఏ అన్న అయినా  ఆదరించడు అనే విషయం అందరికీ తెలిసిందే..  అలాగే విశ్వనాథ్ తన చిత్రాల్లో చంద్రమోహన్ కు తగ్గ పాత్రలుంటే తప్పక అతణ్ణే పిలిపించేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ నటించిన  సీతామాలక్ష్మి, సిరిసిరిమువ్వ, శంకరాభరణం, శుభోదయం వంటి సినిమాలు మంచి పేరు సంపాదించి పెట్టాయి.  ఇంటింటి రామాయణం, పదహారేళ్ళ వయసు, తాయారమ్మ-బంగారయ్య, కోరికలే గుర్రాలయితే, సత్యభామ, పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, పెళ్ళిచూపులు, రాధాకళ్యాణం, మూడుముళ్ళు  మొదలైన చిత్రాల్లోనూ చంద్రమోహన్ హీరోగా నటించి మెప్పించారు. ఆయన సరసన  నటించిన జయప్రద, జయసుధ, శ్రీదేవి, విజయశాంతి వంటి వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు.  76 సంవత్సరాలు దాటినా, ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తుమ్మ‌ల‌కు ఆ ప‌ద‌వి ద‌క్కేనా..! కేసీఆర్ ఆలోచ‌నేంటి?

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?

ప్రీతీ జింటా లాంటి స్ట్రక్చర్ ఉందని ఛాన్స్ ఇచ్చారు.. తొలి ఛాన్స్ పై తాప్సీ..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>