MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tolllywood-gossips2eaf013e-ff71-43ad-b6dd-0e8e4938e8cd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tolllywood-gossips2eaf013e-ff71-43ad-b6dd-0e8e4938e8cd-415x250-IndiaHerald.jpg మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం " ఆచార్య ". ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో భారీ అభిమాన ఘనం ఉన్న తండ్రికొడుకులు ఒకే సినిమాలో నటిస్తుండడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. tolllywood gossips;chiranjeevi;ntr;ram charan teja;shiva;jr ntr;koratala siva;pawan kalyan;ram pothineni;cinema;telugu;audience;blockbuster hit;lord siva;box office;letter;nandamuri taraka rama rao;indianకొరటాల "ఆచార్య"ను పక్కన పెట్టాడా?కొరటాల "ఆచార్య"ను పక్కన పెట్టాడా?tolllywood gossips;chiranjeevi;ntr;ram charan teja;shiva;jr ntr;koratala siva;pawan kalyan;ram pothineni;cinema;telugu;audience;blockbuster hit;lord siva;box office;letter;nandamuri taraka rama rao;indianSun, 23 May 2021 15:00:00 GMT మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం " ఆచార్య ". ఈ సినిమాపై కేవలం మెగా అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో భారీ అభిమాన ఘనం ఉన్న తండ్రికొడుకులు ఒకే సినిమాలో నటిస్తుండడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఇక ఇప్పటివరకు కొరటాల దర్శకత్వం వహించిన సినిమాలు ఆయా హీరోల కెరియర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. దీంతో మెగాస్టార్ కు కూడా కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అందిస్తాడని మెగా అభిమానులు ఆశగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రారంభం అయ్యి దాదాపుగా రెండేళ్ళు పూర్తి అవుతున్న షూటింగ్ పరంగా ఎన్నో అడ్డంకులు ఎదురు కావడంతో ఇంతవరకు మూవీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మే 13వ తేదీ విడుదల కావాల్సి ఉండగా  కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికొస్తే దాదాపుగా 90శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇక మిగిలిన 10శాతం షూటింగ్ ను కరోనా ఉదృతి తగ్గిన తరువాత పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకోశాస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇక " ఆచార్య " షూటింగ్ పార్ట్ కొద్దిగానే ఉండడంతో కొరటాల " ఆచార్య" ను పక్కన పెట్టి ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడట. కొరటాల తన తరువాతి సినిమాను జూ. ఎన్టీఆర్ తో కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక తారక్- కొరటాల కాంబినేషన్ లో వచ్చిన " జనతా గ్యారేజ్ " సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సెకండ్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీగా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది ఏప్రెల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మెగాస్టార్ " ఆచార్య " కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే వచ్చే ఏడాది షార్ట్ టైమ్ లోనే కొరటాల రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చెయ్యడం ఖాయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్

సినిమా ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ ...

రాఘవేంద్రరావును "దర్శకేంద్రుడి "గా మార్చిన సినిమా ఆదేనా ?

దర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>