Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-shooting-just-10-of-12-days-pending80589f0f-772d-486f-ad0c-2aa85be5dbcf-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-shooting-just-10-of-12-days-pending80589f0f-772d-486f-ad0c-2aa85be5dbcf-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా కోస మెగాస్టార్ చాలా కష్టపడ్డారు. సినిమాను త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో వరుసగా కరోనా బారిన పడడంతో..ACHARYA;chiranjeevi;shiva;geetha;koratala siva;mani sharma;cinema;sangeetha;november;lord siva;matinee entertainments;chitram‘ఆచార్య’కు 10 రోజులు చాలా..? కానీ...‘ఆచార్య’కు 10 రోజులు చాలా..? కానీ...ACHARYA;chiranjeevi;shiva;geetha;koratala siva;mani sharma;cinema;sangeetha;november;lord siva;matinee entertainments;chitramSun, 23 May 2021 11:57:00 GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమా కోస మెగాస్టార్ చాలా కష్టపడ్డారు. సినిమాను త్వరగా పూర్తి చేయాలని, ఆ వెంటనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో వరుసగా కరోనా బారిన పడడంతో సినిమా పూర్తిగా ఆడిపోయింది. ఇక మెగాస్టార్ కూడా ఇప్పటి పరిస్థితుల్లో మూవీ షూటింగ్‌లో పాల్గొనే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఎంత పెండింగ్ ఉందో ఇప్పటివరకు తెలియదు. కానీ తాజా సమాచారం మేరకు కేవలం 10 లేదా 12 రోజులు మాత్రమే షూట్ మిగిలుందట. ఈ విషయాన్ని కొరటాల శివ స్వయంగా చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.

నిజానికి ఆచార్య సినిమా గతేడాదిలోనే పూర్తి కావల్సింది. కానీ అప్పుడు కూడా కరోనానే దెబ్బ తీసింది. అప్పటి లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ మొదలు కాలేదు. నాలుగు నెలల లాక్‌డౌన్, ఆ తర్వాత వేరే పనుల్లో పడిన దర్శక నిర్మాతలు, మెగాస్టార్ ఎట్టకేలకు ఏడాది చివర్లో నవంబర్ నుంచి షూటింగ్ మొదలు పెట్టారు. అలాగే ఈ చిత్రంలో ఇంకా కేవలం పది నుంచి పన్నెండు రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉందని కూడా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ కొద్ది రోజుల షూటింగ్ పూర్తయితే బాగుంటుందని, త్వరగా సినిమా విడుదలైతే చూసి ఆనందించాలని ఫ్యాన్స్ తెగ ముచ్చటపడుతున్నారు.

అయితే కరోనా పరిస్థితులు కుదుటపడే వరకు ఆ షూట్ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతనే ఈ షూట్‌ను పూర్తి చేసి  ప్రేక్షకుల ముందుకు తీసుకుురావాలని దర్శకనిర్మాతల ప్లాన్ అని తెలుస్తోంది. కాగా.. ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనికోసం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ ఆలయం సెట్‌ను కూడా వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో..? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

రాఘవేంద్రరావు మాజీ కోడలు గొప్పతనం తెలుసుకోవాల్సిందే.. !

ఆ సినిమా టైటిల్ వినే హీరోలు మూవీని రిజెక్ట్ చేశారంట..?

రాఘవేంద్రరావు తల్లి మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్..?

బాలయ్య-రాఘవేంద్రరావు కాంబో ఇంత దారుణమా..? ఒక్క హిట్ కూడా..!!

ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ వద్దని.. బన్నీతో హిట్ కొట్టిన దర్శకేంద్రుడు

రాఘవేంద్రరావు కుటుంబం నుంచి వచ్చిన సినిమా వాళ్ళు వీరే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>