MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/raghavendra-rao-k-8d82573c-e6bd-4999-83d6-abce11c0792e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/raghavendra-rao-k-8d82573c-e6bd-4999-83d6-abce11c0792e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి స్థానం చాలా ప్రత్యేకమైనది. ఆయన ద్వారా ఎంతోమంది కొత్త దర్శకులు, కొత్త హీరోయిన్స్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన నుండి వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశాయి. అటు క్లాస్ సినిమాలు, ఇటు మాస్ సినిమాలు, సరికొత్తగా అధ్యాత్మిక చిత్రాలు ఇలా దర్శకేంద్రుడు ప్రతి జోనర్ లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే దర్శకేంద్రుడు తీసిన అన్నీ సినిమాల్లో కెల్లా " అన్నమయ్య " చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా విడుదలకుraghavendra-rao-k;bindu;akkineni nagarjuna;atreya;bharavi;bindhu;geetha;jeevitha rajaseskhar;k raghavendra rao;m m keeravani;shankar;india;cinema;sangeetha;sri venkateswara swamy;parliment;genre;producer;director;minister;husband;producer1;hero;letter;heroine;central government;annamayya;maha;mass;raghavendraరాఘవేంద్రరావును "దర్శకేంద్రుడి "గా మార్చిన సినిమా ఆదేనా ?రాఘవేంద్రరావును "దర్శకేంద్రుడి "గా మార్చిన సినిమా ఆదేనా ?raghavendra-rao-k;bindu;akkineni nagarjuna;atreya;bharavi;bindhu;geetha;jeevitha rajaseskhar;k raghavendra rao;m m keeravani;shankar;india;cinema;sangeetha;sri venkateswara swamy;parliment;genre;producer;director;minister;husband;producer1;hero;letter;heroine;central government;annamayya;maha;mass;raghavendraSun, 23 May 2021 14:00:46 GMT తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది దర్శకులు ఉన్నప్పటికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి స్థానం చాలా ప్రత్యేకమైనది. ఆయన ద్వారా ఎంతోమంది కొత్త దర్శకులు, కొత్త హీరోయిన్స్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన నుండి వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశాయి. అటు క్లాస్ సినిమాలు, ఇటు మాస్ సినిమాలు, సరికొత్తగా అధ్యాత్మిక చిత్రాలు ఇలా దర్శకేంద్రుడు ప్రతి జోనర్ లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే దర్శకేంద్రుడు తీసిన అన్నీ సినిమాల్లో కెల్లా " అన్నమయ్య " చాలా  ప్రత్యేకమైనది. ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తరువాత ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైంది. అలాంటి మహా అద్బుత దృశ్యకావ్యం గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేసుకుందాం..

తాళ్ళపాక అన్నమాచార్య శ్రీనివాసుడి భక్తుడిగా, ప్రసిద్ద గేయ రచయితగా అందరికీ తెలుసు. 32 వేల సంకీర్తనలు రచించిన వెంకటేశ్వరుడి భక్తుడు. ఈయన జీవితం గురించి సినిమాలు తియ్యలని ఎంతోమంది దర్శకులు ప్రయత్నాలు చేశారు.. కె. విశ్వనాథ్, బాపు, జంద్యాల, వంటి దిగ్గజ దర్శకులు అన్నమాచార్య గురించి సినిమా తియ్యలనో భావించినప్పటికి అవేవీకూడా కార్యరూపం దాల్చలేదు. ఇక సి ఎస్ రావు డైరెక్షన్ లో మూవీ ప్రారంభం అయ్యి అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రముఖ కవి ఆత్రేయ అన్నమాచార్య కు సంబంధించి పాటలతో పాటు ఓ మోస్తరు కథ కూడా సిద్దం చేసుకున్నారు. అయితే ఆత్రేయ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన జె.కె భారవి అన్నమాచార్య కు సంబంధించి ఎన్నో శాస్త్రాలు, పుస్తకాలు పరిశోదించి పూర్తి కథను సిద్దం చేసి ఎంతో మంది దర్శకులను సంప్రదించినప్పటికి ఎవరు కూడా సినిమా తీసేందుకు ముందుకు రాలేదు.

వెంకన్న భక్తుడు అయిన నిర్మాత దొరస్వామి రాజు మూవీ తీసేందుకు ముందుకు వచ్చాడు. ఇక జె.కె భారవి మరియు దొరస్వామి రాజు ఇద్దరు కలిసి ఈ సినిమా కథను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావుకు వినిపించగా, ఆయన వెంటనే ఒప్పేసుకోవడంతో " అన్నమయ్య " మూవీకి బీజం పడింది. ఇక "అన్నమయ్య " మూవీలో ఎంతో మంది హీరోలను అనుకున్నప్పటికి చివరికి నాగ్ ఫైనల్ అయ్యారు. ఇక కె. రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్లో అన్నమయ్య మూవీ అనౌన్స్ మెంట్ రాగానే ఎన్నో విమర్శలు, ఓ మాస్ హీరో, ఓ కమర్షియల్ డైరెక్టర్ కలిసి భక్తి కథ చిత్రం తియ్యడమేమిటి అని ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. ఇక ఎట్టకేలకు 1997 మే 22 న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక సినిమా చూస్తున్న ప్రేక్షకులు వెంకటేశ్వరుడి భక్తిలో మునిగిపోయారు. ఈ సినిమాలో దర్శకేంద్రుడు చూపిన ప్రతిభ ఆయన సినిమాను మలిచిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తరువాత కె. రాఘవేంద్ర రావు దర్శకత్వానికి కేంద్ర బిందువు అయ్యారు. ఈ సినిమాలో నాగార్జున నటన, కీరవాణి సంగీతం కూడా ప్రేక్షకుల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్రవేశాయి. ఈ సినిమా సాదారణ ప్రేక్షకులనే కాదు అప్పటి రాష్ట్ర పతి శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతి స్పెషల్ షో వేయించుకొని చూశారంటే ఈ సినిమా చూపిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఇక అప్పటి ప్రదాన మంత్రి పీవీ నరసింహారావు ఏకంగా పార్లమెంట్ లోనే " అన్నమయ్య " మూవీని స్పెషల్ షో వేయించడంతో, ఇండియా వైడ్ గా అన్నమయ్య మూవీ సంచలనంగా మారింది. ఏది ఏమైనప్పటికి కె రాఘవేంద్ర రావు సినిమాలన్నిటిలో కెల్లా "అన్నమయ్య "  ఎంతో ప్రత్యేకమైన సినిమాగా నిలవడంతో పాటు " దర్శకేంద్రుడు " అనే బిరుదును సార్థకం చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !

రాఘ‌వేంద్ర‌రావుతో క‌మ‌ల్‌, ర‌జ‌నీకాంత్‌ల గొడ‌వేంటో తెలుసా?

బన్నీ కెరీర్ కి అద్దిరిపోయే స్టార్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు ... !

ఎన్టీఆర్ తో అయినా ఆయన రాత మారేనా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>