PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ap-gvot-ycp-tdp-babu81080780-a910-4cb6-a71d-8d5ae9ad203d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ap-gvot-ycp-tdp-babu81080780-a910-4cb6-a71d-8d5ae9ad203d-415x250-IndiaHerald.jpg వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ముఖ్య‌మంత్రి అవ‌డానికి ముందు ఇద్ద‌రే రాజ‌కీయ శ‌త్రువులు ఉండేవారు. ఒక‌రు సోనియాగాంధీ కాగా, మ‌రొక‌రు చంద్ర‌బాబునాయుడు. రాజ‌కీయంగా, సిద్ధాంత ప‌రంగా వ్య‌తిరేక‌త ఉంటుంది కాబ‌ట్టి అది స‌హ‌జం. కానీ 2019లో అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌కు ఇప్పుడు లెక్క‌కు మిక్కిలి శ‌త్రువులు త‌యార‌య్యారు. రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల నుంచి ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌వ‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌నంత‌ట ఆయ‌నే శ‌త్రువుల సంఖ్య‌ను కjagan, ap gvot, ycp, tdp, babu;cbn;telangana;vishakapatnam;bus;amaravathiప‌లాస నుంచి హిందూపురం వ‌ర‌కు శ‌త్రువులే!!ప‌లాస నుంచి హిందూపురం వ‌ర‌కు శ‌త్రువులే!!jagan, ap gvot, ycp, tdp, babu;cbn;telangana;vishakapatnam;bus;amaravathiSun, 23 May 2021 15:14:24 GMT
వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ముఖ్య‌మంత్రి అవ‌డానికి ముందు ఇద్ద‌రే రాజ‌కీయ శ‌త్రువులు ఉండేవారు. ఒక‌రు సోనియాగాంధీ కాగా, మ‌రొక‌రు చంద్ర‌బాబునాయుడు. రాజ‌కీయంగా, సిద్ధాంత ప‌రంగా వ్య‌తిరేక‌త ఉంటుంది కాబ‌ట్టి అది స‌హ‌జం. కానీ 2019లో అధికారం చేప‌ట్టిన జ‌గ‌న్‌కు ఇప్పుడు లెక్క‌కు మిక్కిలి శ‌త్రువులు త‌యార‌య్యారు. రాష్ట్రంలోని అన్నివ‌ర్గాల నుంచి ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌వ‌మ‌వుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆయ‌నంత‌ట ఆయ‌నే శ‌త్రువుల సంఖ్య‌ను కొనితెచ్చుకున్నార‌నే భావ‌న కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

అమ‌రావ‌తి రైతుల నుంచి పింఛ‌నుదారుల‌వ‌ర‌కు
ప‌రిపాల‌నా రాజ‌ధానిని విశాఖ‌ప‌ట్నంకు త‌ర‌లిస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత 523 రోజులుగా రాజ‌ధాని రైతులు ఉద్య‌మిస్తూనే ఉన్నారు. వీరి త‌ర్వాత ప్ర‌భుత్వ ఉద్యోగులు జ‌గ‌న్‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబునాయుడు ఉద్యోగుల‌తో మాట్లాడి వారికి కావ‌ల్సిన అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటుచేసి, హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేకంగా ఒక రైలు ఏర్పాటుచేసి, వారానికి రెండురోజులు సెల‌వులిచ్చి ఎలాగోలా అమ‌రావ‌తికి ర‌ప్పించుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ విశాఖ అనేస‌రికి వారంతా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగుల‌కు వేత‌నాలు పెరిగినా ఇక్క‌డ మాత్రం పెర‌గ‌డ‌క‌పోవ‌డంపై కూడా అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు.

జ‌ర్న‌లిస్టుల‌కు న‌ర‌కం చూపిస్తున్న జ‌గ‌న్‌
జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలిస్తామ‌ని చంద్రబాబు ఇవ్వ‌లేదు. క‌నీసం ఆయ‌న గుర్తింపుకార్డుల‌తోపాటు బస్సుపాసులిచ్చారు. కానీ జ‌గ‌న్ బస్సు పాసుకాదు క‌దా.. గుర్తింపుకార్డులు లేవు.. బీమా లేక‌పోవ‌డంపై పాత్రికేయ సంఘాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌ద్యం దుకాణాల్లో పెరుగుతున్న మందుసీసాల ధ‌ర‌ల‌పై  మందుబాబులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇసుక లేక‌పోవ‌డంతో బిల్డ‌ర్లు, నిర్మాణ‌రంగంలోని కార్మికులు, బిల్లులు రాక వైద్య‌శాల‌ల్లోని వైద్యులు, చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్ల‌లు రాక వారు, ప్ర‌భుత్వ ఉద్యోగాలు చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన పింఛ‌నుదారుల పింఛ‌ను కూడా నెల‌ల త‌ర‌బ‌డి ఆల‌స్య‌మ‌వుతుండ‌టంతో వారు కూడా తీవ్ర అస‌హ‌నంగా, అసంతృప్తిగా ఉన్నారు. వీరే కాకుండా విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు కూడా జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్నార‌ని, క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అంటున్నారు. స‌మాజంలో ఇంత‌మంది నుంచి వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌ను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎలా అధిగ‌మిస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారిందంటున్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'సినిమా జీవితం చాలా నేర్పింది.. ఈ జన్మకు ఇది చాలు' : చంద్రమోహన్

సినిమా ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ ...

రాఘవేంద్రరావును "దర్శకేంద్రుడి "గా మార్చిన సినిమా ఆదేనా ?

దర్శకేంద్రుడుకి కోపం వస్తే ఏం చేస్తారో తెలుసా ?

ప్రభాస్ మాస్ యాంగిల్ పక్కా.. ప్రశాంత్ భారీ ప్లాన్..?

చిన్న అల్లుడి కోసం చిరంజీవి బాగానే కష్టపడుతున్నాడుగా..?

రాఘవేంద్రరావుకి, చిరంజీవికి మధ్య ఉన్న అనుబంధం ఇదే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>