MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-kd4c9584f-6930-4ddf-ae3e-f056355e52dc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra-rao-kd4c9584f-6930-4ddf-ae3e-f056355e52dc-415x250-IndiaHerald.jpgతెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడి నుండి ద‌ర్శ‌కేంద్రుడు అని పిల‌వ‌బ‌డే స్థాయికి వ‌చ్చిన వ్య‌క్తి కె. రాఘ‌వేంద్ర‌రావు. వంద‌ల సినిమాల‌కు దర్శ‌కత్వం వ‌హించిన రాఘ‌వేంద్ర‌రావు తండ్రి ప్ర‌కాశ‌రావు కూడా ద‌ర్శ‌కుడే. రాఘవేంద్ర‌రావు బాబు సినిమాతో మొద‌ట‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత జ్యోతి, రాజా, అమ‌రదీపం లాంటి సినిమాలు చేశారు. అయితే ఓ ఇంట‌ర్యూలో సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ రాఘ‌వేంద్ర‌రావు గారి గురించి ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి , ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ‌రావు ప‌త్రిక‌ల‌కు ఇంట‌రraghavendraravu;jyothi;raja;bollywood;tollywood;cinema;producer;producer1;heroine;romantic;father;murariఆ సీన్ వ‌ద్ద‌న్నందుకు ద‌ర్శ‌కేంద్రుడు షూటింగ్ నుండి వెళ్లిపోయార‌ట‌..!ఆ సీన్ వ‌ద్ద‌న్నందుకు ద‌ర్శ‌కేంద్రుడు షూటింగ్ నుండి వెళ్లిపోయార‌ట‌..!raghavendraravu;jyothi;raja;bollywood;tollywood;cinema;producer;producer1;heroine;romantic;father;murariSun, 23 May 2021 08:55:10 GMTతెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ద‌ర్శ‌కుడి నుండి ద‌ర్శ‌కేంద్రుడు అని పిల‌వ‌బ‌డే స్థాయికి వ‌చ్చిన వ్య‌క్తి కె. రాఘ‌వేంద్ర‌రావు. వంద‌ల సినిమాల‌కు దర్శ‌కత్వం వ‌హించిన రాఘ‌వేంద్ర‌రావు తండ్రి ప్ర‌కాశ‌రావు కూడా ద‌ర్శ‌కుడే. రాఘవేంద్ర‌రావు బాబు సినిమాతో మొద‌ట‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర‌వాత జ్యోతి, రాజా, అమ‌రదీపం లాంటి సినిమాలు చేశారు. అయితే ఓ ఇంట‌ర్యూలో సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ రాఘ‌వేంద్ర‌రావు గారి గురించి ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. రాఘ‌వేంద్ర‌రావు తండ్రి , ద‌ర్శ‌కుడు ప్ర‌కాశ‌రావు ప‌త్రిక‌ల‌కు ఇంట‌ర్యూలు ఇచ్చేవార‌ట కానీ రాఘ‌వేంద్ర‌రావు మాత్రం ఇంట‌ర్య్వూ అనేస‌రికి ఆమ‌డ దూరం వెళ్లే వార‌ట‌. అయితే త‌న‌కు ప‌త్రిక‌ల‌న్నా జ‌ర్న‌లిస్ట్ లు అన్నా ఎంతో గౌర‌వం ఉంటుంద‌ని కానీ త‌న‌కు మాట్లాడ‌టం స‌రిగ్గా రాద‌ని ఇంట‌ర్యూలు ఇవ్వ‌న‌ని చెప్పేవార‌ట‌. అప్ప‌ట్లో రాఘ‌వేంద్ర‌రావు అన్నీ మ‌సాలా సినీమాలు తీస్తున్నార‌ని అనుకునే వార‌ని కానీ మొద‌ట్లో ఆయ‌న అభ్యుద‌య సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కేంద్రుడని అన్నారు. తొలిసినిమా బాబు ఫెయిల్ అవ్వడం ఆ త‌ర‌వాత ఎక్స్ప‌రిమెంటల్ గా తీసిన జ్యోతికి పాజిటివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా ఆడ‌క‌పోవ‌డం జ‌రిగింద‌ట‌. 

ఆ త‌ర‌వాత ఎన్నో అంచనాల‌తో తెర‌కెక్కించిన క‌ల్ప‌న సినిమాకు కూడా అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంద‌ట‌. మ‌రోవైపు రాఘ‌వేంద్ర‌రావు హీరోయిన్ల అంద‌చందాల‌ను చూపించ‌డంపై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయట‌. ఆయ‌న కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొట్టేలా సినిమాలు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేసేవార‌ట‌. త్రిశూలం సినిమా షూటింగ్ స‌మ‌యంలో నిర్మాత మురారికి రాఘ‌వేంద్ర‌రావు కు పెద్ద వివాదమే  జరిగింద‌ట‌. శ్రీదేవితో ఓ పాట చిత్రీక‌రిస్తుంటే రొమాంటిక్ గా చిత్రించ‌డానికి నిర్మాత మురారి అడ్డు చెప్పార‌ట‌. దాంతో దర్శ‌కేంద్రుడు సినిమాలో పాటలు మీరే తీసుకోండ‌ని చెప్పివెళ్లిపోయార‌ట‌. ఆ విష‌యం ఫిల్మ్ న‌గ‌ర్లో హాట్ టాపిక్ గా మారింద‌ట‌. మ‌రోవైపు రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లో హీరోయిన్ ల‌ను రొమాంటిక్ గా చూపిస్తార‌ని బాలీవ‌డ్ లోను చ‌ర్చ‌జ‌రిగేద‌ట‌. నిజానికి త్రిశూలం సినిమాలో జ‌య‌సుధ పాత్ర కోసం నిర్మాత మొద‌ట బాలీవుడ్ హీరోయిన్ స్మితా పాటిల్ ను సంప్ర‌దించార‌ట మొద‌ట ఆమె ఓకే చెప్పి రాఘ‌వేంద్ర‌రావు పేరు చెప్ప‌గానే అమ్మో నేను చేయ‌న‌ని చెప్పార‌ట‌. కానీ ఆ త‌ర‌వాత రాఘ‌వేంద్ర‌రావు రికార్డులు చూసి బాలీవుడ్ హీరోయిన్ లు ఆయ‌న సినిమాల్లో న‌టించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపేవార‌ట‌.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బండి సంజయ్ తో ఆ పని పూర్తి చేయిస్తే బెస్ట్...?

జీ నెట్‌వ‌ర్క్‌కు రూ.100 కోట్ల ఆదాయం?

డైరెక్టర్ రాఘవేంద్ర రావును నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!!-

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>