MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-184fa9fc-5fdf-4b2f-ab9e-e8d0bf25f8e1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krishna-184fa9fc-5fdf-4b2f-ab9e-e8d0bf25f8e1-415x250-IndiaHerald.jpgనటుడిగా వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన క్రిష్ణ మూడు వందల యాభై సినిమాలలో నటించారు. టాలీవుడ్ ని ఒక దశలో శాసించారు. ఇక అత్యధిక చిత్రాలు నటించిన హీరోగా కూడా ఆయన కొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే క్రిష్ణ కేవలం నటుడిగానే కాకుండా స్టూడియో అధినేతగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. krishna;alluri sitarama raju;tollywood;cinema;rajani kanth;hindi;seetharamaraju;alluri seetha rama raju;v;seetharama rajuసూపర్ స్టార్ క్రిష్ణ ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా... ?సూపర్ స్టార్ క్రిష్ణ ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా... ?krishna;alluri sitarama raju;tollywood;cinema;rajani kanth;hindi;seetharamaraju;alluri seetha rama raju;v;seetharama rajuSun, 23 May 2021 20:00:00 GMTనటుడిగా వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన క్రిష్ణ మూడు వందల యాభై సినిమాలలో నటించారు. టాలీవుడ్ ని ఒక దశలో శాసించారు. ఇక అత్యధిక చిత్రాలు నటించిన హీరోగా కూడా ఆయన కొత్త రికార్డులను క్రియేట్ చేశారు.

ఇదిలా ఉంటే క్రిష్ణ కేవలం నటుడిగానే కాకుండా స్టూడియో అధినేతగా, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వహించారు. క్రిష్ణకు దర్శకత్వం మీద మొదటి రోజుల్లో పెద్దగా మోజు లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన దర్శకుడు కావాల్సి వచ్చింది. అది ఎలాగంటే క్రిష్ణ ఇండస్ట్రీకి వచ్చిన ఎనిమిదేళ్ల వ్యవధిలోనే వంద చిత్రాలు పూర్తి చేసి రికార్డు బద్ధలు కొట్టారు. అలా ఆయన వందవ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ పద్మాలయా మీద నిర్మించారు. విప్లవవీరుడి కధతో అల్లూరి సీతారామరాజు సినిమాను ఆయన నిర్మించారు.

అయితే ఈ సినిమాకు దర్శకుడిగా వి రామచంద్రరావుని క్రిష్ణ తీసుకున్నారు. ఆయన క్రిష్ణ నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ ని డైరెక్ట్ చేసిన మేటి దర్శకుడు. దాంతో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రానికి డైరెక్ట్ చేసే బాధ్యతను కూడా క్రిష్ణ ఆయనకే అప్పగించారు. దాంతో ఆయన సినిమాను తీయడానికి రెడీ అయ్య్యారు. సినిమా కొంత షూటింగ్ అయ్యాక రామచంద్రరావు అనారోగ్యంతో మృతి చెందడంతో నిర్మాణం ఆగింది. దాంతో మిగిలిన నటీనటులు ఇతర టెక్నీషియన్లు అంతా కలసి క్రిష్ణనే ఈ సినిమాను డైరెక్ట్ చేయమని కోరారట.

దానికి కారణం సినిమా అప్పటికి  సగంలో ఉంది. కధ మీద సినిమా మీద పూర్తి పట్టు ఉన్నది క్రిష్ణకు మాత్రమే. దాంతో ఆయన కనుక డైరెక్ట్ చేతే కంటిన్యుటీ ఎక్కడా దెబ్బతినకుండా ఆ టెంపో  కూడా కొనసాగుతుంది అని భావించే అలా సలహా ఇచ్చారుట. మొత్తానికి క్రిష్ణ ఆ సినిమాను తనదైన శైలిలో దర్శకత్వం చేసి పూర్తి చేశారు. సినిమా రిలీజ్ అయి బక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొట్టింది. అయితే సినిమాలో మాత్రం క్రిష్ణ దర్శకుడిగా తన పేరు ఎక్కడా వేసుకోలేదు. వి రామచంద్రరావు పేరునే ఉంచేశారు. ఆ తరువాత పదేళ్ళకు  క్రిష్ణ సింహాసనం మూవీని తన సొంత బ్యానర్ లో తెలుగు హిందీ భాషలలో తీసి  దర్శకత్వం చేశారు. అది సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత అనేక సినిమాలకు క్రిష్ణ డైరెక్షన్ చేసినా కూడా ఆయన ఫస్ట్ దర్శకత్వం చేసిన మూవీగా అల్లూరి సీతారామరాజునే చెప్పుకోవాలేమో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాఘవేంద్ర రావు ని మహేష్ బాబు అందుకే అలా సంబోధిస్తారు .... ??

ఆ కమర్షియల్ ఎలిమెంట్ ని మరచిన టాలీవుడ్... ?

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు, వెంకటేష్ ల కాంబోలోని సూపర్ హిట్ సినిమాలివే..!!

ఆరేళ్ళ తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న 'టాప్ డైరెక్టర్'.. ఈసారి నేటితరం నటీ నటులతో..?

రెమ్యూనరేషన్ తో "ఆహా" అనిపించిన కాజల్..

రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్, మోహన్ బాబు ల మేజర్ చంద్రకాంత్ సినిమా రికార్డులు ఇవే..!!

"చిన్నదే" అంటూ అంచనాలు పెంచుతున్న ఏక్ మినీ కథ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>