PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6d231b22-21a1-4236-8a4f-6e827436164f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus6d231b22-21a1-4236-8a4f-6e827436164f-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. జనాలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఏదో ఒక చిన్న పొరపాటుతో వారిపై దాడి చేసి అనారోగ్య పాలయ్యేలా చేస్తోంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందని ఇటీవలే గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. CORONAVIRUS;chinna;india;karnataka - bengaluru;air;october;central government;lieకరోనా థర్డ్ వేవ్: "భారత్ బి అలర్ట్"కరోనా థర్డ్ వేవ్: "భారత్ బి అలర్ట్"CORONAVIRUS;chinna;india;karnataka - bengaluru;air;october;central government;lieSat, 22 May 2021 13:00:00 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. జనాలు ఎంత జాగ్రత్తగా ఉంటున్నా ఏదో ఒక చిన్న పొరపాటుతో వారిపై దాడి చేసి అనారోగ్య పాలయ్యేలా చేస్తోంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తోందని ఇటీవలే గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కరోనా కొత్త మ్యూటెంట్లు వచ్చాయా ? థర్డ్ వేవ్ అప్పుడే మొదలైందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో పదేళ్ల లోపు పిల్లల్లో కొత్తగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. దీనితో తల్లితండ్రుల్లో భయం మొదలయింది. గత కొద్ది వారాలుగా ఇక్కడ లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నమోదవుతున్న కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అంతేకాక ఇటీవల ఆ రాష్ట్రంలో చిన్న పిల్లల కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.
 ఈ అంచనా గనుక నిజమై థర్డ్ వేవ్ మొదలైనట్లు అయితే ఇక ఆ ఉదృతి ఊహించలేని విధంగా ఉండబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా తొలిదశ బీభత్సం సృష్టించింది. రెండవ దశ పెను తుఫానుగా మారి భీకరం సృష్టించింది. ఇప్పుడు మూడవ దశ మొదలయిందా ? ఇది నిజమే అయితే చిన్నా,  పెద్దా  అని తేడా లేకుండా అందరినీ సునామీలా ముంచేస్తుందని, ఆ భీభత్సాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని, అంచనాలు మించి మరణాలు సంభవిస్తాయని అంటున్నారు. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా కోవిడ్ నిపుణులు సమాచారం ప్రకారం, కరోనా రెండవ దశ జులై నెలాఖరుకు ముగిసిపోతుందని మరియు థర్డ్ వేవ్ అక్టోబర్ నుండి స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. కేద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సారి ప్రతి ఒక్కరూ కరోనా నిర్మూలన కోసం నడుం బిగించాలని చెబుతున్నారు.

ఇది ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుంది, కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని నిపుణులు సూచనలిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు హాస్పిటల్స్ లో సౌకర్యాలు లేక ఎన్నో అవస్థలు పడ్డారు. కరోనా థర్డ్ వేవ్ కనుక వస్తే ఈ సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని అందరికీ ఈ లోపు వ్యాక్సిన్ అందిస్తే కొంత వరకు కరోనా నుండి బయటపడవచ్చు. భారతదేశం ముందు తరాల భవిష్యత్తు ఈ ఆరు నెలల సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నియోజకవర్గం కోసం వంశీ కష్టాలు...!

పవన్ హీరోయిన్ కి రెండు షాకులు ఏమైందంటే..?

భూమిపై అనేక జాతుల అభివృద్ధే.. జీవవైవిధ్యం

ఎంతోమంది యువదర్శకులకు ప్రేరణే డైరెక్టర్ మారుతి ...

ఆ అబ్బాయి సంథింగ్ స్పెషల్ అంటున్న కీర్తి సురేష్..

టాలీవుడ్ చిరస్మరణీయం : నాగార్జున నిర్ణయం భేష్!

అభిరామ్ ఎంట్రీ పై షాకింగ్ ట్విస్ట్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>