PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vaccine-confusion262c3d65-9bb7-4815-aa97-e5a50e8f787a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-vaccine-confusion262c3d65-9bb7-4815-aa97-e5a50e8f787a-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తన వీరంగాన్ని ఇంకా ఆపలేదు. కేసులు సంఖ్యలో మార్పు ఉన్నా కానీ, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయనే వార్త ప్రజలను తీవ్రంగా కలచి వేస్తోంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు చెప్పకపోయినా, లోలోపల చింతిస్తూ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. CORONAVIRUS-VACCINE-CONFUSION;modi;narendra modi;prime minister;central government;coronavirusకరోనా వ్యాక్సిన్ పంపిణీపై కొనసాగుతున్న గందరగోళం ...!కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కొనసాగుతున్న గందరగోళం ...!CORONAVIRUS-VACCINE-CONFUSION;modi;narendra modi;prime minister;central government;coronavirusSat, 22 May 2021 19:13:28 GMT కరోనా వైరస్ తన వీరంగాన్ని ఇంకా ఆపలేదు. కేసులు సంఖ్యలో మార్పు ఉన్నా కానీ, మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయనే వార్త ప్రజలను తీవ్రంగా కలచి వేస్తోంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న పరిస్థితులను చూస్తున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బయటకు చెప్పకపోయినా, లోలోపల చింతిస్తూ ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కరోనా మొదటి దశకు మరియు కరోనా సెకండ్ దశకు మధ్యలో ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలతో పాటు ఇండియాలోని ప్రతిపక్ష పార్టీలు మరియు వార్తా పత్రికలు రోజూ విమర్శిస్తున్నాయి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యమే రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ ఒక సమావేశంలో కంట నీరు చిందించారు. ఇందులో అటు ప్రభుత్వాలు కొన్ని పొరపాట్లు చేస్తే, అసలు సూత్రధారులయిన ప్రజలు కూడా కొన్ని తప్పులు చేశారనేది వాస్తవం.

కరోనా మొదటి దశ చివరి సమయంలో వైద్య శాస్త్రవేత్తలు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కరోనా రెండవ దశ వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ వారి మాటలు పెడచెవిన పెట్టి, విచ్చలవిడిగా ఎటువంటి కరోనా నిబంధనలను పాటించకుండా తిరిగారు. దాని ఫలితమే కరోనా సెకండ్ వేవ్ యొక్క దారుణమైన పరిస్థితులు. దీనికి తోడు మన ప్రభుత్వాలు కరోనా మొదటి దశలో జరిగిన తప్పులను సరిదిద్దుకోలేదు. ముఖ్యంగా వ్యాక్సిన్ ను అందరికీ అందించడంలో ఫెయిల్ అయింది. ఈ రోజుకీ వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదట 45 సంవత్సరాలు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో భిన్నమైన ప్రతిపాదనలను ప్రజాల్ ముందుకు తీసుకువస్తూ కన్ఫ్యూజన్ అయ్యేలా చేస్తున్నారని ప్రముఖులు వాపోతున్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్ లను ఇస్తూ విస్తరించే దిశగా వెళుతున్నామని తెలిపింది. ఇప్పటి వరకు పలు రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 21 కోట్ల డోసుల వ్యాక్సిన్ లను ఉచితంగా ఇచ్చినట్లు కేంద్రం తెలుపుతోంది. వీటిలో ఇంకా రెండు కోట్ల డోసుల వరకు రాష్ట్రాల దగ్గరే మిగిలున్నాయని చెబుతున్నారు. కాగా గురువారం నాటికి 199060575 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఇందులో కొన్ని వ్యాక్సిన్ డోసులు వృధా అయినట్లు చెబుతోంది. ఇంకా రెండు కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

రానున్న మూడు రోజుల్లో మరొక 26 లక్షల డోసులను రాష్ట్రాలకు పంపుతామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా తీసుకొచ్చిన వ్యాక్సిన్ నిబంధనల్లో మే 1 నుండి తమ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో 50 శాతం వరకు నేరుగా రాష్ట్రాలకు మరియు ప్రైవేట్ సంస్థలకు విక్రయించుకోవచ్చని చెప్పింది. అవి పోగా మిగిలిన 50 శాతం వ్యాక్సిన్ లను కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా పంపుతుందని చెబుతున్నారు. ఇలా రకరకాల నియమనిబంధనలతో మోదీ సర్కారు ప్రజలను తికమక పెట్టేస్తున్నారనే నానుడి అందరిలో ఎక్కువైపోయింది. దీనిని మోడీ ఫెయిల్యూర్ గా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. మరి రానున్న రోజుల్లో అయినా వ్యాక్సిన్ ల విషయంలో ఒక స్పష్టత ఇస్తారని ఆశిద్దాం.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>