SmaranaDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/soundhariya-e16ad556-86b4-4632-9a43-30a93ff78fb9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/soundhariya-e16ad556-86b4-4632-9a43-30a93ff78fb9-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ ఇండస్ట్రీలో పురస్కారాలు అందుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. అందులోనూ అతి చిన్న వయసులోనే ఏకంగా ఆరు పురస్కారాలు అందుకోవడం అంటే అది మాటల్లో చెప్పలేనిది. ఇక అందులో ఒకరు, తెలుగింటి ఆడపడుచుగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన నటి సౌందర్య. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకకు చెందినది . ఇక సినీ రంగ ప్రవేశం చేయడం కోసం ఈమె సౌందర్యగా పేరు మార్చుకుంది. అయితే ఈమె ప్రాథమిక విద్య చదువుకునే సమయంలోనే మొదటి చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఎం.బి.బి.ఎస్ మొదటSOUNDHARIYA;venkatesh;amitabh bachchan;soundarya;raja;savitri;soumya;sowmya;vidya;bharatiya janata party;karnataka - bengaluru;mohandas karamchand gandhi;cinema;telugu;tamil;marriage;loksabha;parliment;producer;kannada;hindi;film industry;industry;producer1;hero;heroine;mahanati;father;research and analysis wing;savithri 1;tangirala sowmya;chitramస్మరణ : అందులో పన్నెండేళ్ల అచిరకాలంలోనే ఆరు పురస్కారాలు అందుకున్న నటి..స్మరణ : అందులో పన్నెండేళ్ల అచిరకాలంలోనే ఆరు పురస్కారాలు అందుకున్న నటి..SOUNDHARIYA;venkatesh;amitabh bachchan;soundarya;raja;savitri;soumya;sowmya;vidya;bharatiya janata party;karnataka - bengaluru;mohandas karamchand gandhi;cinema;telugu;tamil;marriage;loksabha;parliment;producer;kannada;hindi;film industry;industry;producer1;hero;heroine;mahanati;father;research and analysis wing;savithri 1;tangirala sowmya;chitramSat, 22 May 2021 06:30:00 GMT
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పురస్కారాలు అందుకోవడం  అంటే అంత ఆషామాషీ కాదు. అందులోనూ అతి చిన్న వయసులోనే ఏకంగా ఆరు పురస్కారాలు అందుకోవడం అంటే అది మాటల్లో చెప్పలేనిది. ఇక అందులో ఒకరు, తెలుగింటి ఆడపడుచుగా ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన నటి సౌందర్య. ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. సౌందర్య అసలు పేరు సౌమ్య. కర్ణాటకకు చెందినది . ఇక సినీ రంగ ప్రవేశం చేయడం కోసం ఈమె సౌందర్యగా పేరు మార్చుకుంది. అయితే ఈమె ప్రాథమిక విద్య చదువుకునే సమయంలోనే మొదటి చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగానే , సౌందర్య తండ్రి యొక్క స్నేహితుడు 1992లో గంధర్వ అనే చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అమ్మోరు చిత్రం లో నటించింది. ఇక ఈ చిత్రం విజయవంతం అవడంతో, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది..


ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాదు కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలలో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది..అంతేకాకుండా హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో  స్టార్ హీరోయిన్ లుగా పేరు,  ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో సౌందర్య కూడా ఒకరు. ఈమె ప్రముఖ హీరో వెంకటేష్ సరసన రాజా, పెళ్లి చేసుకుందాం రా,పవిత్ర బంధం,దేవి పుత్రుడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రశంసలందుకున్నారు. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపు పొందారు..


సౌందర్య 1994లో అమ్మోరు, 1998లో అంతఃపురం, 1999లో రాజా, 2002లో ద్వీప అలాగే 2004లో ఆప్తమిత్ర, పవిత్ర బంధం  వంటి చిత్రాల్లో నటించినందుకు గాను కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పురస్కారాలు అలాగే ఆంధ్ర ప్రభుత్వం నుండి మూడు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను అందుకున్నారు. సౌందర్య గిరీష్ కాసరవెల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి ఉత్తమ,ఉత్తమ నిర్మాత విభాగాలలో రెండు పురస్కారాలు అందుకుంది.. ఇవన్నీ ఈమె కేవలం అతి చిన్న వయసులోనే పొందడం గమనార్హం..


అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి లాగే అందరినీ ఆదుకుంటుందని మంచి పేరు కూడా ఉంది.2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాజపా తరపున ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రం లోని,  కరీంనగర్‌ లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్డ్ విమానంలో బయలుదేరారు. ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే, పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం  ఆవరణంలో కుప్పకూలిపోవడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఇక ఈమె మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ సోకసంద్రం అయ్యింది. ఇక తీరని లోటును మిగిల్చింది..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మరింత కఠినం : హైద‌రాబాద్ సీపీ

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>