PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/arogyasri-covid-treatment-6c7cfed2-f428-451b-8300-598a7979ecfd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/arogyasri-covid-treatment-6c7cfed2-f428-451b-8300-598a7979ecfd-415x250-IndiaHerald.jpgఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొవిడ్ సంక్షోభంలో.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకునే రోగులకు 50శాతం బెడ్లు కేటాయించకపోతే ఆస్పత్రికి ఇచ్చిన ఆరోగ్యశ్రీ చికిత్సల అనుమతి రద్దు చేయడంతోపాటు, ఆస్పత్రి అనుమతిని కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. కొవిడ్ వార్డ్ లో ఎన్ని బెడ్లు ఉంటే.. అందులో యాభై శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేరే రోగులకు కేటాయించాలని తేల్చి చెప్పింది. arogyasri, covid treatment,;tara;arogyasriఅలా చేస్తే ఆరోగ్యశ్రీ రద్దవుతుంది జాగ్రత్త..అలా చేస్తే ఆరోగ్యశ్రీ రద్దవుతుంది జాగ్రత్త..arogyasri, covid treatment,;tara;arogyasriSat, 22 May 2021 07:00:00 GMTఏపీలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొవిడ్ సంక్షోభంలో.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకునే రోగులకు 50శాతం బెడ్లు కేటాయించకపోతే ఆస్పత్రికి ఇచ్చిన ఆరోగ్యశ్రీ చికిత్సల అనుమతి రద్దు చేయడంతోపాటు, ఆస్పత్రి అనుమతిని కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. కొవిడ్ వార్డ్ లో ఎన్ని బెడ్లు ఉంటే.. అందులో యాభై శాతం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేరే రోగులకు కేటాయించాలని తేల్చి చెప్పింది.

ఇటీవల మచిలీపట్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి 150 పడకల్లో కేవలం 10 పడకల్ని కూడా ఆరోగ్యశ్రీకి కేటాయించలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టి యాజమాన్యానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయంలో మరో రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. 50 శాతం పడకలు ఇవ్వకపోయినా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినా భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఇప్పటికే విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ బృందం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది.

ఆస్పత్రుల అక్రమాలపై బాధితులెవరైనా రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే అలాంటి ఆస్పత్రిపై 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. ఆరోగ్యశ్రీ ద్వారా కొవిడ్‌ చికిత్సకు 50 శాతం పడకలు కేటాయించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆయా ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దుచేసేందుకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేసారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని ఇప్పటికే తేలింది. నిరుపేదలు ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అవుతామంటే బెడ్లు ఖాళీగా లేవని చెబుతారు, అదే సమయంలో డబ్బులు కట్టేందుకు సిద్ధపడితే మాత్రం బెడ్లు ఇస్తామని అంటారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తే వారి వద్దనుంచి ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉండదు, పైగా చికిత్స వ్యయం రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం మంజూరు చేస్తుంది. అక్రమాలకు అవకాశం ఉండదు కాబట్టే.. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ చికిత్సను నిరాకరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లాక్ డౌన్ మరింత కఠినం : హైద‌రాబాద్ సీపీ

రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిలిచేనా..?

అక్కినేని సుమంత్ ఆ 5 సినిమాలు చేసుంటే.. !

రఘురామ ఎపిసోడ్ లో ఆ ఒక్క తప్పూ... ?

రవితేజ మూడు లక్షల రూపాయల హీరో.. దర్శకుడి కామెంట్స్ వైరల్.. ?

మరో హీరోను లాక్ చేసిన మాటల మాంత్రికుడు..?

టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడుతున్న వైసీపీ యువ‌నేత‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>