HealthN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aurvedam-krishnapatnam-anandaih1bc29f04-8863-4f76-8c2d-f986e6fbf337-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/aurvedam-krishnapatnam-anandaih1bc29f04-8863-4f76-8c2d-f986e6fbf337-415x250-IndiaHerald.jpgప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హామ్మారికి ఇప్ప‌టి వ‌రకు స‌రైన మందు రాలేదు.ల‌క్ష‌ల కోట్ల‌తో వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న అదికూడా అంత స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌డంలేదు.కానీ క‌రోనాకు ఆయుర్వేద మందు బాగా ప‌ని చేస్తుంద‌నే పుకార్లు షికార్లు చేస్తుండ‌టంతో అది త‌యారు చేస్తున్న ఆనంద‌య్య పేరు ఇప్పుడు అంద‌రినోట వినిపిస్తుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్లు సైతం ఆయ‌నంద‌య్య ఇంటికి క్యూక‌డుతున్న విష‌యం తెలిసింది.అయితే ఆనంద‌య్య ఇచ్చే మందుల్లో కూడా రాకాలున్నాయంట‌..ఇంత‌కీ ఆ మందులు ఎన్ని ర‌కాలో తెలుసుకుందాం, aurvedam krishnapatnam anandaih;mandula;cumin;ayurveda;brinjal;mixie;neem;indian;indian gooseberry;shaktiఆనంద‌య్య మందు ఎన్ని రకాలంటే...!ఆనంద‌య్య మందు ఎన్ని రకాలంటే...!aurvedam krishnapatnam anandaih;mandula;cumin;ayurveda;brinjal;mixie;neem;indian;indian gooseberry;shaktiSat, 22 May 2021 18:46:00 GMTఆయుర్వేద మందు బాగా ప‌ని చేస్తుంద‌నే పుకార్లు షికార్లు చేస్తుండ‌టంతో అది త‌యారు చేస్తున్న ఆనంద‌య్య పేరు ఇప్పుడు అంద‌రినోట వినిపిస్తుంది. ఐసీయూలో ఉన్న పేషెంట్లు సైతం ఆనంద‌య్య ఇంటికి క్యూక‌డుతున్న విష‌యం తెలిసింది.అయితే ఆనంద‌య్య ఇచ్చే మందుల్లో కూడా రాకాలున్నాయంట‌..ఇంత‌కీ ఆ మందులు ఎన్ని ర‌కాలో తెలుసుకుందాం,
 
కరోనాకు ఆనందయ్య మొత్తం ఐదు రకాల మందులను పంపిణీ చేస్తున్నారు. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచడానికి ఒక మందు, పాజిటివ్‌ వచ్చిన వారికి నాలుగు రకాల మందులను ఇస్తున్నారు. కరోనా రాకుండా ‘పీ’ రకం మందును, కోవిడ్‌ వచ్చిన వారికి పీ, ఎఫ్, ఎల్, కే రకాలను ఇస్తున్నారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన వారికి నాలుగు రకాలతో పాటు పసరు డ్రాప్స్‌ ఇస్తున్నారు.

1. పీ:
ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వినియోగించాలి.ఇందులో తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్‌లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు.

2. ఎఫ్‌:
పాజిటివ్‌ ఉన్న వారికి ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి.

3. ఎల్‌:
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్‌ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

4. కే:
ఇది కూడా పాజిటివ్‌ ఉన్న వారికే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్‌ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

5. ఐ:
ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి.

గ‌మ‌నిక - ప్ర‌స్తుతం ఆనంద‌య్య మందు బాగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇస్తున్న మందుల ర‌కాలు గురించి తెలియ‌జేస్తున్నాం పైన తెలిపిన వ‌స్తువుల‌తో సొంత‌గా ప్ర‌యోగాలు చేయ‌వ‌ద్దు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పదో తరగతి పరీక్షల రద్దుపై బాంబే హైకోర్టు ఆగ్రహం..

తెలుగు సినిమాకు క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్ ఇచ్చిన దర్శ‌కుడు

ఇవివి ఆ మార్క్ సినిమాలకు ఓ ట్రెండ్ సెట్టర్ ..!

మహేష్ పోలికలతో ఉన్న ఈ పిల్లలు ఎవరంటే.?

శ్రీమంతుడు సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన నటి సుకన్య

హీరోలకే హీరోయిజాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్కడు ..!

బాలయ్య నుంచి భారీ ట్రీట్.. అప్పుడు పక్కా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>